CM KCR ने विश्व आदिवासी दिवस पर आदिवासियों को दी बधाई, कहा, “हमारे तांडा में हमारा राज”

हैदराबाद: मुख्यमंत्री के चंद्रशेखर राव (KCR) ने विश्व आदिवासी दिवस (World Tribal Day) के अवसर पर प्रदेश के आदिवासियों को बधाई दी। मुख्यमंत्री ने मंगलवार को जारी बधाई संदेश में कहा कि आदिवासी प्रेम और स्नेह और बेदाग मानवीय संबंधों के प्रतीक हैं। तेलंगाना सरकार आदिवासियों के कल्याण और विकास के लिए कई कार्यक्रमों को लागू कर रही है।

सीएम केसीआर ने कहा, “राज्य सरकार ने आदिवासियों की आकांक्षाओं को ‘मावा नाटे मावा राज’ (तेलुगु- मा तांडा लो मा राज्यम हिंदी- हमारे तांडा में हमारा राज) में स्व-शासन के लिए पूरा किया। उन्होंने कहा कि सरकार आदिवासियों के लिए बनाई गई उप-योजना को प्रभावी ढंग से लागू कर रही है।

साथ ही कहा कि गिरिजान सहकारी समिति के माध्यम से आजीविका की पेशकश के अलावा, गिरि ब्रांड के तहत वन उत्पादों के व्यवसाय को बढ़ावा देने के लिए सभी आवश्यक सुविधा प्रदान कर रही है।

హైదరాబాద్‌ : కల్మశంలేని మానవీయ సంబంధాలకు ఆదివాసీ గిరిజనులు ప్రతీకలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఆదివాసీ బిడ్డలు సముజ్వలంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆదివాసీ, గిరిజనులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు.

‘మావ నాటే మావ రాజ్‌.. మా తాండాలో మా రాజ్యం’ అనే ఆదివాసీ గిరిజనుల ఆకాంక్షను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చిందని గుర్తు చేశారు. గిరిజనులకు సబ్‌ ప్లాన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నట్టు తెలిపారు. గురుకులాల ద్వారా అత్యున్నత స్థాయి విద్యను, అంబేదర్‌ విదేశీ విద్యానిధి ద్వారా విదేశీ విద్యను, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో స్థిరపడడానికి ఆదివాసీ, గిరిజన యువతకు ఉచిత శిక్షణను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

గిరిజనగూడెలకు, తండాలకు విద్యుత్తు, రోడ్లు వంటి మౌలిక వసతులను మరింతగా మెరుగుపరుస్తున్నామని తెలిపారు. కుమ్రంభీం స్మారక మ్యూజియంతోపాటు పలు మ్యూజియాలు ఇప్పటికే ప్రారంభం కాగా, రాంజీగోండు స్మారక మ్యూజియాన్ని త్వరలో నిర్మించనున్నట్టు సీఎం తెలిపారు. హైదరాబాద్‌లోని విలువైన ప్రాంతంలో ఆదివాసీ, గిరిజన ఆత్మగౌరవ భవనాలను నిర్మించామని గుర్తుచేశారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని తెలిపారు. (एजेंसियां)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X