“WORLD HISTORY IS LINKED WITH METAL”

32nd South Indian Numismatics Society Conference Concluded

Hyderabad : Dr. B.R. Ambedkar Open University (BRAOU), Department of History, South Indian Numismatics Society, Telangana State Council of Higher Education in collaboration with “Numismatics – History of South India – Reconstruction, 32nd Annual Conference of South Indian Numismatics Society” concluded on Thursday.

The chief guest of the program was University Vice Chancellor Prof. K. Sitarama Rao attended and gave a speech. He said that the history of the world is linked with metal and only the coins made of metal reveal the history of the region and country. He said that if young researchers focus on these aspects, more historical aspects of history will come to light.

Prof. E. Sudha Rani, Seminar Director presided over the programme. She said, It was explained that for two days, many historical landmarks, different coins, research on them and other issues were thoroughly discussed. South Indian Numismatics Society President Dr. Raja Reddy Speaking on the occasion, he revealed that the society will be helped to study the history of the country on a stronger basis. Dean Prof. Vaddanam Srinivas spoke at the two-day national seminar. A session wise report with details of the program was presented in the conference.

Read Also:

Dr. Satya Murthy, Director ASI (Kerala) delivered the keynote address at the concluding session. He said that ancient coins have made the history of the world unearthed and he suggested that historians should study ancient coins more, collect and study the coins found in excavations more deeply.

Intach (New Delhi) Governing Council members Veda Kumar said that Hyderabad is second in the world in collecting oldest coins with historical background. Intach Hyderabad Chapter President P. Anuradha Reddy said that the historical landmarks of the world are enshrined in coins and suggested that young researchers should focus on studying and collecting historical coins.

A souvenir containing the research papers presented in this conference was unveiled in the meeting. Former Director of Archaeology, Erstwhile State of Andhra Pradesh Prof. P. Chenna Reddy wrote a book on “New Mismatica Indica” launched by Prof K.Seetharama Rao. Dr. G. Dayakar, Local Secretary and Head, Dept. of History and others spoke on the occasion. Deans of all departments, directors, heads of branches, historians from south India, heads of various departments, teaching and non-teaching employees are participated.

ప్రపంచ చరిత్ర మెటల్ తో ముడిపడి ఉంది

“న్యూమిస్మాటిక్స్ – దక్షిణ భారత దేశ చరిత్ర పునర్నిర్మాణం” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ముగింపు

హైదరాబాద్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (BRAOU), చరిత్ర విభాగం, సౌత్ ఇండియన్ న్యూమిస్మాటిక్స్ సొసైటీ, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సహకారంతో సంయుక్తంగా “న్యూమిస్మాటిక్స్ – దక్షిణ భారత చరిత్ర – పునర్నిర్మాణం, దక్షిణ భారత న్యూమిస్మాటిక్స్ సొసైటీ 32వ వార్షిక సదస్సు” గురువారం ముగిసింది.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ వీసీ ప్రొ. కె. సీతారామా రావు హాజరై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచ చరిత్ర లోహం తోనే ముడి పడి ఉందని, లోహంతో తయారయ్యే నాణేలు మాత్రమే ఆయా ప్రాంత, దేశ చరిత్రను బహిర్గత పరుస్తాయని ఆయన వివరించారు. యువ పరిశోధకులు ఈ అంశాలపై దృష్టి పెడితే చరిత్రకు సంబంధించిన మరిన్ని చారిత్రక అంశాలు వెలుగులోకి వస్తాయన్నారు.

ప్రొఫెసర్ E. సుధా రాణి, సెమినార్ డైరెక్టర్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఆమె మాట్లాడుతూ
రెండు రోజుల పాటు అనేక చారిత్రక ఆనవాళ్లు, విభిన్నమైన నాణేలు, వాటిపై పరిశోధనలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించినట్లు వివరించారు.

సౌత్ ఇండియన్ న్యూమిస్మాటిక్స్ సొసైటీ అధ్యక్షులు డా. రాజా రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ సొసైటీని మరింత పటిష్ట పర్చి దేశ చరిత్రను అధ్యయనం చేయడానికి దోహద పడనున్నట్లు వెల్లడించారు.
డీన్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు రోజులపాటు జరిగిన జాతీయ సెమినార్ లో
సెషన్స్ వారీగా కార్యక్రమ వివరాలతో కూడిన నివేదికను సదస్సులో సమర్పించారు.

డాక్టర్ సత్య మూర్తి, డైరెక్టర్ ASI (కేరళ) ముగింపు సదస్సులో కీలకోపన్యాసం చేశారు. ఆయన మాట్లాడుతూ పురాతన నాణేలు ప్రపంచ చరిత్రను వెలికి తీసేలా చేశాయని, చరిత్రకారులు పురాతన నాణేలను మరింత అధ్యయనం చేయాలనీ, తవ్వకాల్లో బయల్పడే నాణేలను సేకరించి మరింత లోతుగా అధ్యయనం చేయాలనీ ఆయన సూచించారు.

ఇంటాక్ (న్యూ ఢిల్లీ) గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు వేద కుమార్ మాట్లాడుతూ చారిత్రక నేపథ్యం కలిగిన అత్యంత పురాతన నాణేలు సేకరించడంలో హైదరాబాద్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఇంటాక్ హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ పి. అనురాధ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ చారిత్రక ఆనవాళ్లు నాణేలలో నిక్షిప్తమై ఉందని యువ పరిశోధకులు చారిత్రక నాణేలను సేకరించి అధ్యయనంపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఈ సదస్సులో సమర్పించిన పరిశోధనా పత్రాలతో కూడిన సావెనీర్ ను సభలో ఆవిష్కరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ ప్రొ. పి. చెన్నా రెడ్డి రచించిన న్యూ మిస్మాటికా ఇండికా పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో Dr. G. దయాకర్, స్థానిక కార్యదర్శి మరియు హిస్టరీ విభాగ అధిపతి తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు. అన్ని విభాగాల డీన్‌లు, డైరెక్టర్లు, బ్రాంచ్‌ల అధిపతులు, ఇతర విశ్వవిద్యాలయాల చరిత్రకారులు, వివిధ శాఖల అధిపతులు, టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు తదితరులు పాల్గిన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X