हैदराबाद : तेलंगाना में एक तरफ प्रवेश परीक्षा है और दूसरी तरफ भर्ती परीक्षा है। इसके साथ ही मई सबके लिए परीक्षा का महीना बन गया। पेपर लीक के कारण रीशेड्यूल किए गए कुछ पदों के लिए मई में परीक्षा आयोजित की जा रही है। साथ ही, उच्च शिक्षा पाठ्यक्रमों के लिए प्रवेश परीक्षा भी इसी महीने में आयोजित की जाती है। ये सभी ऑनलाइन आयोजित किए जाते हैं।
तेलंगाना में दसवीं और इंटर की वार्षिक परीक्षाएं समाप्त होने के बाद उच्च शिक्षा पाठ्यक्रमों में प्रवेश के लिए प्रवेश परीक्षाएं आयोजित की जा रही हैं। उसी के तहत इस माह की 10 से 14 तारीख तक एमएसईटी का आयोजन किया जा रहा है। उसके बाद क्रमशः EDSET, ESET, LASET, ISET और PGESET परीक्षा आयोजित की जाएगी।
जहां एक ओर विभिन्न पाठ्यक्रमों में प्रवेश के लिए प्रवेश परीक्षा आयोजित की जा रही है, वहीं दूसरी ओर विभिन्न नौकरियों की भर्ती के लिए परीक्षा आयोजित करने का निर्णय लिया गया है। उसी के तहत इस महीने की 16 तारीख को कृषि अधिकारी की परीक्षा, 17 को फिजिकल डॉयरेक्टर की परीक्षा और 19 को ड्रग इंस्पेक्टर की परीक्षा आयोजित की जा रही है।
दसवीं और इंटर के नतीजे भी इसी महीने घोषित किए जाएंगे। इंटर की परीक्षा 15 से 29 मार्च तक और दसवीं की परीक्षा 3 से 11 अप्रैल के बीच हुई थी। इसके लिए मूल्यांकन का काम पूरा हो चुका है। अधिकारी इस सप्ताह के भीतर दसवीं और इंटर के परिणाम घोषित करने के लिए आवश्यक कदम उठा रहे हैं।
తెలంగాణ టెన్త్, ఇంటర్ ఫలితాలు …
హైదరాబాద్ : ఒక పక్క ప్రవేశ పరీక్షలు, మరో పక్క నియామక పరీక్షలు. దీంతో మే పరీక్షల నెలగా మారనుంది. పేపర్ లీక్‌తో రీషెడ్యూల్ అయిన కొన్ని పోస్టుల పరీక్షలను మేలో నిర్వహిస్తున్నారు. అలాగే ఉన్నత విద్య కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు కూడా ఈ నెలలోనే ఉన్నాయి. వీటన్నింటినీ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు.
రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలు ముగియడంతో ఉన్నత విద్య కోర్సుల అడ్మిషన్లకు సంబంధించిన ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 10 నుంచి 14వరకు ఎంసెట్ నిర్వహిస్తున్నారు. తర్వాత వరుసగా ఎడ్‌సెట్, ఈసెట్, లాసెట్, ఐసెట్, పీజీఈసెట్ పరీక్షలను నిర్వహించనున్నారు.
ఇలా పలు కోర్సుల అడ్మిషన్లకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు ఒక పక్క జరుగుతుండగానే మరో పక్క వివిధ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన పరీక్షలను కూడా నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెల 16న అగ్రికల్చర్ ఆఫీసర్స్ పరీక్ష, 17న ఫిజికల్ డైరెక్టర్ల పరీక్ష, 19న డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల పరీక్షను నిర్వహిస్తున్నారు.
ఈ నెలలోనే టెన్త్, ఇంటర్ ఫలితాలను కూడా ప్రకటించనున్నారు. మార్చి 15 నుంచి 29 వరకు ఇంటర్ పరీక్షలను, ఏప్రిల్ 3 నుంచి 11 వరకు పదవ తరగతి పరీక్షలను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వాల్యుయేషన్ కూడా ఇప్పటికే పూర్తి చేశారు. ఈ వారం రోజుల్లోనే టెన్త్, ఇంటర్ ఫలితాలను ప్రకటించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. (ఏజెన్సీలు)
