హైదరాబాద్: ప్రముఖ చిత్రకారుడు స్వర్గీయ పిటి రెడ్డి 108 వ జయంతి సందర్భంగా నారాయణగూడ లోని పి టి రెడ్డి గ్యాలరిని సందర్శించిన ఎమ్మెల్సీ కవిత. పిటి రెడ్డి కి నివాళులు అర్పించిన అనంతరం గ్యాలరి లోని చిత్రాలను, స్క్లప్చర్ ఆర్ట్ ని ఆసక్తిగా తిలకించిన ఎమ్మెల్సీ కవిత.
కార్యక్రమంలో టీఎస్ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్, ఉప్పల శ్రీనివాస్ గుప్త, అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి,భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కవిత,కామెంట్స్
రాష్ట్రం గర్వించదగ్గ ప్రముఖ చిత్రకారుడు పి.టి రెడ్డి జయంతి సందర్భంగా వారి నివాసాన్ని సందర్శించడం జరిగింది. పి టి రెడ్డి పెయింటింగ్స్, స్క్లప్చర్, ఆర్ట్ వర్క్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. కళ ను కాపాడుకొని కళనే తన జీవితంగా జీవించారు.
ఆనాటి అందమైన కళాకృతులను వారి కూతురు అపురూపంగా కాపాడుకొస్తున్నారు. పి టీ రెడ్డి టెక్నీక్స్ నేటి తరం కళాకారులు అందిపుచ్చుకోవాలి. పి టి రెడ్డికి తగిన గుర్తింపు కోసం ప్రభుత్వం తరపున నా వంతు ప్రయత్నం చేస్తాను. తెలంగాణ కళాకారులు ఈ ప్రదేశాన్ని సందర్శించడం ద్వారా ఆర్ట్ మీద మరింత పట్టు సాధించవచ్చు