Hyderabad: పాదయాత్రకు భద్రత కల్పించాలని అడిషనల్ డీజీపీకి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వినతి పత్రం అందజేశారు. రాజకీయ కారణాలతోనే తనను అరెస్టు చేశారని ఆరోపించారు. పోలీసులను టీఆర్ఎస్ కార్యకర్తల్లా వాడుకున్నారన్న ఆమె. డిసెంబర్ 4 తేదీ నుంచి 14 వరకు మళ్లీ తమ పాదయాత్ర ఎక్కడైతే ఆగిందో అదే చోటు నుంచి మళ్లీ పునఃప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి పోలీసులను జీతగాళ్లుగా, తమ కార్యకర్తలుగా అధికార పార్టీ టీఆర్‌ఎస్ వాడుకుంటోందని విమర్శించారు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. శుక్రవారం తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసిన ఆమె… అనంతరం మీడియాతో… పోలీసులకు లా అండ్ ఆర్డర్ ఫాలో కావాల్సిన అవసరముందన్న షర్మిల… మళ్లీ వాళ్లకు వాళ్ల బాధ్యతలను గుర్తు చేస్తున్నామన్నారు. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని చెప్పారు. తెలంగాణలో తాలిబన్ల రాజ్యం సాగుతుందనడానికి ఏమాత్రం సంకోచం లేదన్నారు. టీఆర్ఎస్ నాయకులంటే నాయకుల ముసుగులో ఉన్న గూండాలని ఆరోపించారు. ఈ తాలిబన్ మాటలకు మేం బెదరమని తేల్చి చెప్పారు. ఉదయించే సూర్యున్ని ఎవరూ ఆపలేరన్న ఆమె… పాదయాత్రనే కాదు వైఎస్ఆర్ పార్టీని కూడా ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.
వైఎస్ షర్మిల మాట్లాడుతూ… ‘నేను ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించలేదు. నిందితులను వదిలేసి బాధితులను అరెస్ట్ చేశారు. ఇదే విషయాన్ని డీజీపీని కలిసి ఫిర్యాదు చేశా’ అని వైఎస్ షర్మిల తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసులనే ప్రచారం కేవలం టీఆర్‌ఎస్ పార్టీకే వర్తిస్తుందని, మిగతా పార్టీలకు కాదని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు ఉందన్న ఆమె.. ప్రజల దృష్టిలో చులకన కావొద్దని పోలీసులకు సూచించారు.
ఒకప్పుడు ఉదమ్యపార్టీగా ఉన్న టీఆర్‌ఎస్.. నేడు గుండాల పార్టీగా మారిందన్నారు ఆమె. తెలంగాణ తాలిబన్‌ల రాజ్యం అనడానికి ఎలాంటి సంకోచం లేదని చెప్పారు. వీళ్లు తాలిబన్‌లు కాదా? కేసీఆర్ తాలిబన్ల అధ్యక్షుడు కాదా? అంటూ విమర్శించారు. వాళ్ల బెదిరింపులకు భయపడేది లేదని, వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీని ఎవరూ అడ్డుకోలేరని వైఎస్ షర్మిల తెలిపారు. ఇక్కడుంది రాజశేఖర్ బిడ్డ. ఎక్కడైతే మీరు పాదయాత్రను ఆపారో అక్కడి నుంచే మొదలుపెడతానని స్పష్టం చేశారు.
ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. అలాగే రాజశేఖర్‌రెడ్డిగారి సంక్షేమ పాలన తీసుకొచ్చేంత వరకు ఆగేది లేదు. నిత్యం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ముందుకు వెళ్తామని స్పష్టం చేశారామె. జరుగుతున్న పరిణామాలను గమనించాలని తెలంగాణ ప్రజానీకాన్ని ఆమె కోరారు. ఆదివారం నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తానని, ఈ నెల 14వరకు యాత్ర కొనసాగుతుందని తెలిపారు. నాకు , నా కార్యకర్తలకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత.