हैदराबाद: आंध्र प्रदेश में दसवीं पास करने वाले छात्रों को वाईएस जगन मोहन रेड्डी की सरकार ने खुशखबरी दी है। इस माह की 12 से 17 तारीख तक ‘जगनन्ना विद्या कनुका सप्ताह’ समारोह आयोजित करने का मंत्रिमंडल की बैठक में निर्णय लिया गया है। कैबिनेट ने दसवीं परीक्षाओं में उत्कृष्ट प्रदर्शन करने वाले छात्रों को ‘जगनन्ना आणिमुत्यालु (मोती) पुरस्कार’ देने को हरी झंडी दे दी है। इस वर्ष दसवीं में प्रतिभा दिखाने वाले छात्रों को 15 जून को विधानसभा स्तर पर, 17 जून को जिला स्तर पर और 20 जून को राज्य स्तर पर ‘जगनन्ना आणिमुत्यालु पुरस्कार’ से सम्मानित किया जाएगा।
इतना ही नहीं, शिक्षा प्रणाली में क्रांतिकारी परिवर्तन कर रही जगन सरकार स्कूली स्तर से ही छात्रों के कौशल में सुधार कर उन्हें ‘टीओईएफएल’ (Test of English as a Foreign Language) परीक्षा के लिए तैयार करने जा रही है। टीओईएफएल प्राथमिक (ग्रेड 3-5) और टीओईएफएल जूनियर (ग्रेड 6-10) परीक्षाएं संचालित करके प्रमाणपत्र दिया जाएगा। अच्छी प्रतिभा दिखाने वाले छात्रों को पढ़ाने वाले अंग्रेजी शिक्षक को 3 दिन के प्रशिक्षण के लिए अमेरिका भेजती है।
इस हद तक कैबिनेट ने परीक्षा आयोजित करने के लिए ईटीएस के साथ समझौते को मंजूरी दी है। प्रत्येक मंडल के लिए दो जूनियर कॉलेज स्थापित किए जाएंगे। एक विशेष रूप से लड़कियों के लिए और दूसरा सह-शिक्षा प्रणाली के तहत स्थापित किये जाएंगे। इसी माह की 12 तारीख को जगनन्ना विद्याकानुका के साथ ही 28 से एक सप्ताह तक ‘अम्माओडी’ कार्यक्रम आयोजित किए जाएंगे।
कर्मचारियों को खुशखबरी देते हुए जगन सरकार ने प्रत्येक राजस्व मंडल के स्कूलों में होने वाली गतिविधियों की व्यापक निगरानी के लिए एक उप शिक्षा अधिकारी नियुक्त करने का निर्णय लिया है। कैबिनेट ने चित्तूर जिले के सोदुम में बीसी गर्ल्स गुरुकुल कॉलेज में दो और श्रीकाकुल जिले के अमदालवलसा बीसी गर्ल्स गुरुकुल स्कूल में दो पदों की भर्ती को भी मंजूरी दी है। ‘नाडु-नेडु’ कार्यक्रम पुरे हो चुके 476 जूनियर कॉलेजों में चौकीदारों की नियुक्ति को भी मंजूरी दी है।
ఆంధ్ర ప్రదేశ్ లో టెన్త్ పాసైన విద్యార్థులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ లో టెన్త్ పాసైన విద్యార్థులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ నెల 12నుంచి 17 వరకూ జగనన్న విద్యా కానుక వారోత్సవాలు నిర్వాహించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పది పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాలు అవార్డులను ప్రదానం చేసేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది టెన్త్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాల’ పేరుతో జూన్ 15న నియోజకవర్గ స్థాయిలో అలాగే 17న జిల్లా, 20న రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ఘనంగా సన్మానించనున్నారు.
అంతేకాదు విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేస్తోన్న ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందిస్తూ ‘టోఫెల్’ పరీక్షలకు సిద్ధం చేయనుంది. టోఫెల్ ప్రైమరీ (3–5 తరగతులు) అలాగే టోఫెల్ జూనియర్ (6–10 తరగతులు) పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ అందజేస్తారు. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు బోధించే ఇంగ్లీష్ టీచర్‌ను ప్రభుత్వం 3 రోజుల శిక్షణ కోసం అమెరికాకు పంపిస్తుంది.
ఈ మేరకు పరీక్షల నిర్వహణకు ఈటీఎస్‌తో ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి మండలానికి రెండు జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నారు. ఒకటి ప్రత్యేకంగా బాలికల కోసం మరొకటి కో ఎడ్యుకేషన్ విధానంలో ఏర్పాటు చేస్తారు. ఈనెల 12న జగనన్న విద్యాకానుకతోపాటు 28 నుంచి వారం రోజుల పాటు ‘అమ్మఒడి’ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన జగన్ ఇకనుంచి ప్రతి రెవెన్యూ డివిజనల్‌లో పాఠశాలల్లో అమలయ్యే కార్యకలాపాల సమగ్ర పర్యవేక్షణకు ఒక డిప్యూటీ ఎడ్యుకేషనల్ అధికారిని నియమించాలని నిర్ణయించారు. చిత్తూరు జిల్లా సొదుంలో బీసీ బాలికల గురుకుల కళాశాలలో రెండు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస బీసీ బాలికల గురుకుల పాఠశాలలో రెండు పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నాడు–నేడు పనులు పూర్తైన 476 జూనియర్ కాలేజీల్లో వాచ్‌మెన్ల నియామకానికి ఓకే చెప్పారు.
కేబినెట్‌లో తీసుకున్న మిగిలిన నిర్ణయాలు…
రాష్ట్రంలో నాలుగు ఐఆర్ బెటాలియన్లు ఏర్పాటులో భాగంగా ప్రతి బెటాలియన్‌కు 980 పోస్టుల చొప్పున మొత్తం 3920 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం ఎస్.ఎం.పురం, చిత్తూరు జిల్లా చిత్తూరు పట్టణం, ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం అన్నంగి, రాజమహేంద్రవరం పట్టణంలోనూ ఏర్పాటు కానున్న నాలుగు ఐఆర్ బెటాలియన్లు.
గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్‌అమ్మెనియా పాలసీకి కేబినెట్ ఆమోదం.
ఏడాదికి 0.5 మిలియన్ మెట్రిక్ టన్నుల హైడ్రోజన్, 2 మిలియన్ మెట్రిక్ టన్నుల అమ్మోనియాను వచ్చే ఐదేళ్లలో ఉత్పత్తిచేయాలన్నది ఈ పాలసీ లక్ష్యం.
ఈ ఉత్పత్తిచేసే పరిశ్రమల స్థాపనద్వారా కూడా గణనీయంగా పెరగనున్న పారిశ్రామిక ప్రగతి.
దాదాపు 12వేలమందికి ఉద్యోగాలు.
అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో 300 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటుచేయనున్న రెన్యూ వోయేమాన్ పవర్ ప్రై. లిమిటెడ్.
దాదాపు రూ.1800 కోట్ల పెట్టుబడులు.
300 మందికి ఉద్యోగాలు.
ఆమోదం తెలపిన రాష్ట్ర మంత్రివర్గం.
మండల కేంద్రం నుంచి ప్రతి గ్రామ పంచాయతీకి ఆప్టిక్ ఫైబర్ కేబుల్. డిజిటల్ లైబ్రరీలు, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, స్కూళ్లు, పీహెచ్‌సీలు న్నింటికీ హై బ్యాండ్ విడ్త్. మారుమూల ప్రాంతాల్లోకి కూడా అందుబాటులోకి రానున్న 5జి సేవలు. దీని కోసం ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌కు రూ.445.7 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ అంగీకారం.
రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న దేవాలయాలకు మినహాయింపులు. వీటి నిర్వహణలో తగ్గనున్న ప్రభుత్వ జోక్యం. ఇకపై సులభంగా రోజువారీ కార్యకలాపాలను నిర్వహించేందుకు వెసులుబాటు. ఐదేళ్లపాటు ఇది అమల్లో ఉంటుంది. బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం. ఇదే సమయంలో పారదర్శకతను పాటించేందుకు ఫిర్యాదులు వస్తే.. వాటిని విచారించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
దేవాదాయ శాఖ భూముల పరిరక్షణకు చర్యల్లో భాగంగా చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం. ఆక్రమణలు తొలగించేందుకు, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి వీలుగా సవరణ. కాలపరిమితితో సంబంధం లేకుండా ఇదివరలో ఇచ్చిన ఉత్తర్వుల పరిశీలనకూ ప్రభుత్వానికి అధికారాలు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ సెక్షన్ 5 ను (రోడ్ ట్రాన్స్‌ఫోర్ట్ కార్పొరేషన్ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులోకి విలీనం చేస్తూ ) సవరించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి.
గుంటూరు జిల్లా తాడేపల్లిలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్‌సీడీసీ) సంస్ధ ఏర్పాటుకు 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.
వైయస్సార్ కడప జిల్లా సీ.కె.దిన్నె మండలం మామిళ్లపల్లెలో 3.70 ఎకరాలు, కడప మండలం చిన్నచౌక్‌లో 3.70 ఎకరాల ప్రభుత్వ భూమిని కడప జిల్లా బెస్త సంఘానికి కేటాయించాలన్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం.
అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. గతంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ , ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కొటిక్స్ సంస్ధకు కేటాయించిన 10 ఎకరాల స్ధలాన్ని అదే ప్రాంగణంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయడానికి అనుకూలంగా మార్పు చేస్తూ నిర్ణయం.
ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం, చేవూరు గ్రామంలో 40 సెంట్ల ప్రభుత్వ స్ధలాన్ని ఏపీ మారిటైం బోర్డుకు రామాయపట్నం నాన్ మేజర్ పోర్టు కోసం బదలాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం, రావూరు గ్రామంలో 9.46 ఎకరాల ప్రభుత్వ స్ధలాన్ని ఏపీ మారిటైం బోర్డుకు రామాయపట్నం నాన్ మేజర్ పోర్టు కోసం బదలాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
ఏర్పేడు మండలం వికృతిమాలలో 15.15 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వామి నారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటుకు కేటాయించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. (ఏజెన్సీలు)