हैदराबाद: यूट्यूब इंसानी जिंदगी का अहम हिस्सा बन चुका है। इसके बारे में कोई संदेह नहीं है। यह कहना कोई अतिशयोक्ति नहीं है कि स्मार्टफोन का उपयोग करने वाला हर व्यक्ति YouTube का उपयोग किए बिना या देखे बिना दिन में एक घंटा भी नहीं बिता सकता है। यह मानव जीवन के साथ इतना जुड़ा हुआ है। हालांकि यूट्यूब पर हर दिन कुछ लाख वीडियो अपलोड होते हैं। कई लोगों ने अपने हुनर से खुद को यूट्यूब पर कंटेंट क्रिएटर्स के तौर पर स्थापित किया है। लेकिन इसमें पैसे कमाने के लिए आपको सबसे पहले monetization के लिए क्वालीफाई करना होगा। इसके लिए आपको 90 दिनों में 1000 से अधिक सब्सक्राइबर, 4000 घंटे के व्यूज या 10 मिलियन शॉर्ट व्यूज होने चाहिए। लेकिन अब ये जरूरी नहीं हैं।
YouTube ने अपने पार्टनर प्रोग्राम के नियमों को सरल कर दिया है। अब तक इसने विमुद्रीकरण के लिए आवश्यक ग्राहकों की संख्या को आधा कर दिया है। इसने छोटे कंटेंट क्रिएटर्स के लिए भी मॉनेटाइजेशन के लिए नियम बनाए हैं। इस फैसले से कम सब्सक्राइबर वाले क्रिएटर्स भी यूट्यूब के जरिए कमाई कर सकेंगे।
अब 500 सब्सक्राइबर काफी हैं। आखिर 90 दिनों में कम से कम तीन या अधिक सार्वजनिक वीडियो अपलोड करना होगा। साथ ही एक साल में तीन हजार घंटे या पिछले 90 दिनों में 3 मिलियन शॉर्ट व्यूज होनी चाहिए। जो लोग इन न्यूनतम योग्यताओं को पूरा करते हैं, वे अब YouTube मुद्रीकरण कार्यक्रम के लिए आवेदन कर सकते हैं। लेकिन यूट्यूब ने कमाई के इस नए नियम को अमेरिका, ब्रिटेन, कनाडा, ताइवान और दक्षिण कोरिया में शुरू किया है। इसे जल्द ही अन्य देशों में लागू किया जाएगा। इसे भारत कब लाया जाएगा इसका खुलासा अभी नहीं हुआ है।
YouTube Monetization Rules, ఇప్పుడు డబ్బు సంపాదించడం సులువైంది, కానీ…
హైదరాబాద్: యూట్యూబ్ (YouTube) మనిషి నిత్య జీవితంలో ఓ ప్రధాన భాగమై పోయింది. ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ రోజులో గంట సేపైనా యూట్యూబ్ వాడకుండా, చూడకుండా ఉండలేరంటే అతిశయోక్తి కాదు. అంతగా మనిషి జీవితంతో పెనవేసుకుపోయింది. అయితే.. ప్రతిరోజు కొన్ని లక్షల వీడియోలు YouTube లో అప్‌లోడ్ అవుతుంటాయి. తమ నైపుణ్యాలతో ఎంతోమంది YouTube లో కంటెంట్ క్రియేటర్లుగా స్థిరపడిపోయారు. అయితే ఇందులో డబ్బులు సంపాదించాలంటే ముందుగా మానిటైజేషన్‌కు అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇందుకోసం 1000 మందికి పైగా సబ్‌స్క్రైబర్లు, 4000 గంటల వీక్షణలు లేదంటే 90 రోజుల్లో 10 మిలియన్ల షార్ట్ వ్యూస్ ఉండాలి. కానీ ఇప్పుడు ఇవి అవసరం లేదు.
యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన నిబంధనలను సరళీకరించింది. ఇప్పటి వరకు మానిటైజేషన్‌కు కావాల్సిన సబ్ స్క్రైబర్ల సంఖ్యను సగానికి తగ్గించింది. చిన్న కంటెట్ క్రియేటర్లు సైతం మానిటైజేషన్ ను పొందేందుకు అనుకూలంగా నిబంధనలను తీసుకొచ్చింది. ఈ నిర్ణయంతో తక్కువ సబ్ స్క్రైబర్లు ఉన్న క్రియేటర్లు సైతం YouTube ద్వారా ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది.
ఇకపై 500 మంది సబ్‌స్క్రైబర్లు ఉంటే సరిపోతుంది. చివరి 90 రోజుల్లో కనీసం మూడు లేదా అంతకంటే ఎక్కువ పబ్లిక్ వీడియోలను అప్‌లోడ్ చేసి ఉండాలి. అలాగే ఏడాదిలో మూడు వేల గంటల వీక్షణలు లేదంటే చివరి 90 రోజుల్లో 3 మిలియన్ షార్ట్స్ వ్యూస్ ఉండాలి. ఈ కనీస అర్హతలు సాధించిన వాళ్లు ఇకపై యూట్యూబ్ మానిటైజేషన్ ప్రోగ్రామ్‌కు అప్లయ్ చేసుకోవచ్చు. అయితే ఈ కొత్త మానటైజేషన్ నిబంధనల్ని యూట్యూబ్ అమెరికా, బ్రిటన్, కెనడా, తైవాన్, దక్షిణ కొరియాలో ప్రారంభించింది. త్వరలోనే మిగిలిన దేశాల్లోనూ అమలు చేయనుంది. భారత్‌కు ఎప్పుడు తీసుకొచ్చేదీ మాత్రం ఇంకా వెల్లడించలేదు.
YouTube తీసుకొచ్చిన కొత్త నిబంధనల కారణంగా చిన్న క్రియేటర్లకు మేలు జరగనుంది. YouTube ద్వారా ఆదాయాన్ని గడించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో YouTube లో కంటెంట్ సైతం మరింత పెరిగే అవకాశం ఉంది. అటు సూపర్ థ్యాంక్స్, సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్ వంటి టిప్పింగ్ టూల్స్ తో పాటు ఛానెల్ మెంబర్ షిప్స్ వంటి సబ్ స్క్రిప్షన్ టూల్స్ ను సైతం పొందే అవకాశం ఉన్నట్లు YouTube వెల్లడించింది. (ఏజెన్సీలు)