జూన్ 2న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో యువ కవుల సమ్మేళనం, పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

తెలంగాణ జీవన విశిష్టతను చాటిచెప్పడానికే ఈ సమ్మేళనం

యువతలో సాహిత్యాభిలాషను, చైతన్యాన్ని నింపడానికి ఇది దోహదపడుతుంది

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు

హైదరాబాద్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన యువ కవుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి ప్రకటించింది. తెలంగాణ సారస్వత పరిషత్ లో జరగనున్న ఈ సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్ ను గురువారం నాడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన నివాసంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… తెలంగాణ జీవనశైలి విశిష్టతను చాటి చెప్పడంతో పాటు యువతలో సాహితీ స్పృహను, చైతన్యాన్ని పెంపొందించడానికి ఈ యువ కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ తాత్వికతను, చరిత్రక నేపథ్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని, సౌభ్రాతృత్వాన్ని, సహనశీలతను, సమగ్రతను, సమాజంలో ఉండే సమిష్టితత్వాన్ని ప్రతిబింబించేలా యువ కవులు తమ కలాలకు పదును పెట్టాలని కవిత పిలుపునిచ్చారు.

పాల్ఘొన దలచిన కవులు, కవయిత్రులు 35 ఏళ్ల లోపువారు అయి ఉండాలి. తెలుగు, హిందీ ఇంగ్లీష్, ఉర్దూలలో కవితలు వినిపించవచ్చు. నమోదు చేయించుకోవడానికి కవులు తమ వివరాలతో ఈ నెల 26 లోపు kavitha.telangana@gmail.com కు మెయిల్ చేయాలి.

Also Read-

కవులు తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమ చరిత్రను, పోరాట స్పూర్తిని చాటిచెప్పాలని కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ నేల మీద అనేక గొప్ప కవులు, కవయిత్రులు తమ రచనల ద్వారా సామాజంలో చైతన్యాన్ని రగిలించారని, ఆ పరంపరంను కొనసాగించడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు. గోల్కొండ కవుల సంచిక ద్వారా సురవరం ప్రతాప్ రెడ్డి తెలంగాణ రచయితలు, కవులు, కవయిత్రుల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పారని, ఆ స్పూర్తితో తాము ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు.

అయితే, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సాహిత్యానికి కనీస గౌరవం ఇవ్వడం లేదని విమర్శించారు. దాశరథి శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

అలాగే, జానపదానికి గౌరవం దక్కడం కోసం జీవితాంతం కృషి చేసిన బిరుదురాజు శత జయంతి కు రాష్ట్ర ప్రభుత్వం కనీస గౌరవం ఇవ్వలేదని, గొప్ప కవులు, కళాకారులు సమాజానికి చేసిన సేవలను ప్రభుత్వం విస్మరించడం తగదని సూచించారు. ఈ కార్యక్రమంలో కవులు కాంచనపల్లి, వనపట్ల సుబ్బయ్య, ఘనపురం దేవేందర్, జాగృతి నాయకులు నవీన్ ఆచారి, శ్రీధర్ రావు, మనోజ్ గౌడ్, లలిత యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X