हैदराबाद: पाकिस्तान से एक युवक के अवैध तरीके से हैदराबाद पहुंचने से हड़कंप मच गया है। पुलिस को पता चला कि वह नेपाल के रास्ते भारत में दाखिल हुआ और हैदराबाद पहुंच गया। टास्क फोर्स पुलिस ने उसे हिरासत में ले लिया। युवक की पहचान मोहम्मद फैयाज के रूप में हुई है।
दुबई में काम करने वाले फैयाज ने कुछ महीने पहले हैदराबाद की एक लड़की से शादी की थी। वह लड़की इस समय हैदराबाद में है। उसने पुलिस को बताया कि उसकी पत्नी गर्भवती है। फैयाज ने पुलिस को यह भी बताया कि वह अपनी गर्भवती पत्नी से मिलने के इरादे से हैदराबाद आया है।
पुलिस ने पाया कि फैयाज बिना वीजा के अवैध रूप से भारत में दाखिल हुआ है। खबर है कि पुलिस ने उसे गिरफ्तार कर लिया है। फ़ैयाज़ की पत्नी यह जानकर चिंतित है कि उसके पति को पुलिस ने गिरफ्तार किया किया है। फिलहाल पुलिस उससे पूछताछ कर रही है। इस बात की जांच की जा रही है कि फैयाज द्वारा कही गई बातें सच हैं या नहीं।
గర్భవతి అయిన భార్యను కలిసేందుకు పాకిస్థాన్ యువకుడు హైదరాబాద్ వచ్చాడు
హైదరాబాద్: పాకిస్థాన్‌కు చెందిన ఓ యువకుడు అక్రమంగా హైదరాబాద్‌కు రావడం కలకలం రేపుతోంది. నేపాల్ మీదుగా అతడు భారత్‌లోకి ప్రవేశించి హైదరాబాద్‌కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సదరు యువకుడిని మొహమ్మద్ ఫయాజ్‌గా గుర్తించారు.
దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న ఫయాజ్ కొన్ని నెలల కిందట హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఆమె గర్భం దాల్చినట్లు అతడికి తెలిపింది. భార్యను కలుసుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులతో ఫయాజ్ చెప్పాడు.
వీసా లేకుండా భారత్‌లోకి ఫయాజ్ అక్రమంగా వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలుసుకొని ఫయాజ్ భార్య ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం పోలీసులు అతడిని విచారిస్తున్నారు. ఫయాజ్ చెప్పిన విషయాలు నిజమా, కాదా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. (ఏజెన్సీలు)