“ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అసమర్ధ పాలనకు చరమాంకం పాడాలి”

-భారాస ఎపి అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్

హైదరాబాద్: ప్రజావ్యతిరేక విధానాలతో ఏకపక్షంగా వ్యవహరిస్తోన్న వైసీపీ ప్రభుత్వ అసమర్ధ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమాంకం పాడాలని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు. ఆదివారం హైదారాబాద్ లోని భారాస ఎపి క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తోట సుబ్బారావు, జాలే వాసుదేవ నాయుడు ఆధ్వర్యంలో పలు జిల్లాలకు చెందిన వైసీపీ నాయకులు తోట సమక్షంలో భారాస లో చేరారు.

అనంతరం చంద్రశేఖర్ మాట్లాడుతూ… కూల్చివేతలతో ప్రారంభమైన వైకాపా పాలనలో గత నాలుగేళ్లుగా అభివృద్ది పడకేసిందని దుయ్యబట్టారు. తమ రాష్ట్ర రాజధాని ఏదో చెప్పుకోలేని గందరగోళ స్తితిలో రాష్ట్ర ప్రజానీకముందని ఆవెదన వ్యక్తం చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారం చేజిక్కించుకున్న సిఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలొ నట్టేట ముంచారని మండి పడ్డారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయిన తెలంగాణ రాష్ట్రం సిఎం కేసిఆర్ సారధ్యంలో శరవేగంగా అభివృద్దిలో దూసుకుపోతుంటే ఎపిలో అందుకు బిన్నపరిస్తితులు నెల కొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీలో వైకాపా పాలనతో రాష్ట్ర ప్రజలు తీవ్ర సంతృప్తితో ఉన్నారని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఎపి ప్రజలు బిఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారని వెల్లడించారు.

తొలుత వైసిపీ నేతలు గిద్దలూరు నుండి రహమత్, అశోక్ కుమార్, బొర్రా శేఖర్ రంగస్వామి, రాకేష్, శేఖర్, దర్శి నుండి నాగరాజు, బ్రహ్మ నాయుడు, చీపురుపల్లి నుండి విష్ణు గుప్త, శ్రీనివాసరావు, విజయవాడ నుండి శంకర్, తిరువూరు నుండి వంశీ, పసుపులేటి అశోక్, కోడూరు నుండి జాకీర్ హుస్సేన్, కాకినాడ నుండి శివకుమార్, జగ్గయ్యపేట నుండి చంద్ర, యర్రగొండపాలెం నుండి ప్రభాకర్, ఒంగోలు నుండి శివయ్య, మదనపల్లి నుండి సుబ్బరాజు, తిరుపతి నుండి ధనుంజయరాజు, ధర్మవరం నుండి సత్యన్నారాయణ యాదవ్, గురజాల నుండి శ్రీనివాసరావు తదితరులు భారాశలో చేరారు. ఈ కార్యక్రమంలో భారాస జిల్లా నాయకులు ఈదా చెన్నయ్య, తోట హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X