Yatra For Change- రైతులు బాగుపడాలంటే KCR ను ఉరేయాల్సిందే: రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : “రైతులు బాగుపడాలంటే బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలో కేసీఆర్ ను ఉరేయాల్సిందే. పోచారంను పాతాళంలో పాతిపెట్టాల్సిందే. ఎంతటి వారినైనా మెడలు వంచి శక్తి ఈ ప్రాంత రైతులకు ఉంది. చక్కెర కర్మాగారాన్ని మూసేసిన కేసీఆర్ ను గద్దె దింపాల్సిన బాధ్యత మీపై ఉంది” అని టీపీసీసీ అధ్యక్షుడు అన్నారు. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా సోమవారం బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని నస్రులాబాద్ నుంచి నుంచి బాన్సువాడ వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన జన సభలో ఆయన ప్రసంగించారు.

పోచారం గ్రహచారం బాగాలేదు. గతంలో ఈ ప్రాంత సమస్యలపై పోచారం కొట్లాడేవారు. కానీ సావాస దోషంతో పోచారం కుటుంబ సభ్యులు దండుపాళ్యం ముఠా సభ్యులుగా మారారు. ఇసుక దందా వారిదే.. ఇక్కడ క్రషర్లు వారివే..తమ్ముడిని ఊరు మీదకు వదిలేసి.. కొడుకులకు మండలాలను పంచి ఇచ్చిండు పోచారం.
మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా.. నిజాం కాలంలో ఉన్నామా. భూమి శిస్తు కట్టకపోతే ఆ నాడు రజాకార్లు ఏది దొరికితే అది గుంజుకపోయేవారు. ఇవాళ పోచారం కొడుకు చైర్మన్ గా ఉన్న బ్యాంకు సిబ్బంది… రైతు ఇంటి తలుపులు, ల్యాప్ టాప్ ఎత్తుకెళ్లారు. కేసీఆర్ పాలన ఆ నాటి రజాకర్లను తలపిస్తోంది.
చంద్రబాబు నాయుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీని 51 శాతం ప్రయివేటు చేస్తుండని అడ్డం పడ్డ అని పోచారం చెప్పిండు. మరి కేసీఆర్ ఆ ఫ్యాక్టరీని మూతెస్తే పోచారం ఏం చేస్తున్నారు.. 2021లో బాన్సువాడలో 8000 ఎకరాల పంట నష్టం జరిగింది.

రైతులకు పరిహారం ఇస్తానని ఇప్పటి వరకు ఇవ్వలేదు. నష్టపోయిన రైతులను ఆదుకునే బాధ్యత పోచారంపై లేదా? వరి వేసుకుంటే ఉరే అన్న కేసీఆర్ మనిషి రూపంలో ఉన్న రాక్షసుడా? రైతులు బాగుపడాలంటే బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలో కేసీఆర్ ను ఉరేయాల్సిందే. పోచారంను పాతాళంలో పాతిపెట్టాల్సిందే. ఎంతటి వారినైనా మెడలు వంచి శక్తి ఈ ప్రాంత రైతులకు ఉంది. చక్కెర కర్మాగారాన్ని మూసేసిన కేసీఆర్ ను గద్దె దింపాల్సిన బాధ్యత మీపై ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో చక్కెర కర్మాగారం తెరుస్తాం. రైతులు పండించే ప్రతీ పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. ఎమ్మెల్యేలను నియంత్రించగలిగే స్పీకర్… తన కొడుకులను నియంత్రించలేకపోతున్నారు. బాన్సువాడకు పట్టిన పీడ విరగడ కావాలంటే ఎన్నికల్లో పోచారంను బొందపెట్టాలి.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఉచితంగా ఇస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తాం. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను ఏడాదిలోగా భర్తీ చేస్తాం. పేదలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకుంటాం.

సంతలో సరుకులా టీఎస్పీఎస్సీ పరీక్ష ప్రశ్నాపత్రాలు : రేవంత్

టీఎస్పీఎస్సీ పరీక్ష ప్రశ్నాపత్రాలు సంతలో సరుకుల మారాయి అని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా సోమవారం బాన్సువాడ నియోజకవర్గానికి వచ్చిన రేవంత్ రెడ్డి దుర్కి పాదయాత్ర క్యాంపు వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం తన తప్పులు కప్పిపుచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఐటీ శాఖకు అసలు ఏమాత్రం సంబంధం లేదని కేటీఆర్ అంటున్నారు. లీకేజీని తామే బయటపెట్టామని మంత్రి గంగుల చెప్పుకుంటున్నారు. లీకేజీ వ్యవహారం ఇద్దరు వ్యక్తులకు సంబంధించిందని కేటీఆర్ చెప్పారు. అవును.. లీకేజీ వ్యవహారం కేసీఆర్, కేటీఆర్ ఇద్దరికి సంబంధించినదే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలు కంప్యూటర్ లు తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారానే ఏర్పాటు చేస్తారు. ఇందుకు ఐటీ శాఖ అనుమతులు ఇస్తుంది. టీఎస్ టీఎస్ చైర్మన్ గా 2021లో కేటీఆర్ కెజగన్ మోహన్ రావును నియమించారు. రాజశేఖర్ రెడ్డిని ఔట్ సోర్సింగ్ ద్వారా టీఎస్ టీఎస్ నియమించింది. కేటీఆర్ పీఏ నే రాజశేఖర్ రెడ్డిని నియమింపజేశారు. 2015లో గంటా చక్రపాణి చైర్మన్ గా ఉండగా కేటీఆర్ టీఎస్ పీఎస్సీని విజిట్ చేశారు.

ఐటీ యాక్ట్ 2000 రూల్ 2 ప్రకారం కంప్యూటర్ సెక్యూరిటీపై ఆడిట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కేంద్ర ప్రభుత్వం సర్టిఫై చేసిన ఏజెన్సీని మాత్రమే ఆడిటింగ్ కు పెట్టుకోవాలి. చైర్మన్, సెక్రెటరీ, సెక్షన్ ఆఫీసర్ కు మాత్రమే కంప్యూటర్ లో ప్రశ్నాపత్రం తీసుకునేందుకు యాక్సెస్ ఉంటుంది. ఈ ముగ్గురికి తెలియకుండా రాజశేఖర్, ప్రవీణ్ ప్రశ్నాపత్రం హ్యాక్ చేయగలిగారు. ఐటీ శాఖకు తెలియకుండా, చైర్మన్ కు తెలియకుండా ఎలా బయటకు వచ్చాయి. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఈ కేసులో సెక్షన్ ఆఫీసర్ శంకర లక్ష్మిని ఎందుకు ప్రశ్నిచడం లేదు. బాధ్యత వహించాల్సిన చైర్మన్ జనార్దన్ రెడ్డి, సెక్రెటరీ అనిత రామచంద్రన్ ను ఎందుకు విచారించలేదు. రాజశేఖర్ రెడ్డి నియామకం వెనక కేటీఆర్, అతని పీఏ తిరుపతి ఉన్నారు. కొత్త జోనల్ వ్యవస్థ పేరుతో 7 జోన్ లుగా విభజించారు.

ఏపీ వ్యక్తులకు ఉద్యోగాలు రాకుండా చేస్తానని ప్రగల్భాలు పలికారు. కానీ నియామకాలు జరిగే టీఎస్పీఎస్సీ లో ప్రవీణ్ అనే ఆంధ్రా వ్యక్తిని నియమించారు. 30 లక్షల విద్యార్థుల భవిష్యత్ ను నిర్ణయించే అత్యంత కీలక ఉద్యోగంలో ఆంధ్రా వ్యక్తి ప్రవీణ్ కుమార్ ను నియమించారు. అసలు కేసీఆర్ కు సోయి ఉందా? కేసీఆర్ ది తెలంగాణ రక్తమేనా? టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారానికి కేటీఆర్, కేసీఆర్ బాధ్యత వహించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పారదర్శక విచారణ చేయదు. గతంలో సిట్ అప్పగించిన కేసులన్నీ నిర్వీర్యమయ్యాయి. ప్రభుత్వం సిట్ వేసిందంటే ఈ నేరాన్ని కాలగర్భంలో కలిపేయడమే. గతంలో డ్రగ్స్ కేసులోనూ ఇలాగే జరిగింది. అందుకే ఈ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. సిట్ నోటీసులు ఊహించిందే.. స్వాగతిస్తున్నా. మమ్మల్ని వేధించాలన్న ఆలోచనతోనే ప్రభుత్వం నోటీసులు ఇస్తోంది. రాజ్యాంగాన్ని గౌరవించి సిట్ నోటీసులకు స్పందిస్తా.

నా దగ్గర ఉన్న వివరాలను సిట్ దృష్టికి తీసుకెళ. తాంసిట్ అధికారి ఏఆర్ శ్రీనివాస్ ను సూటిగా ప్రశ్నిస్తున్నా.. మంత్రులు ఏ హోదాతో కేసు ఇద్దరు వ్యక్తులకే ఈ కేసుతో సంబంధం ఉందని చెప్పారు. ఇద్దరికే సంబంధం ఉందని.. కేటీఆర్ చెప్పారు.. ఇక నన్ను ఆధారాలు అడగడం ఎందుకు? ఎవరికేం సంబంధం లేదని చెప్పిన కేటీఆర్ కు కూడా సిట్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కు కూడా నోటీసులు ఇవ్వాలి. విచారణ సంస్థలు విచారణ చేయకుండా ఏ రకంగా కేటీఆర్ జడ్జిమెంట్ ఇచ్చారో చెప్పాలి. కేటీఆర్ కు నోటీసులు ఇవ్వకపోతే.. ఏఆర్ శ్రీనివాస్ ఇద్దరం హైకోర్టులో కలుసుకుందాం. పండగ పూట నన్ను విచారణకు రమ్మంటున్నారంటే.. రాజ్ పాకాల ప్రభావం ఏఆర్ శ్రీనివాస్ పై ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.

కేసీఆర్ ప్రభుత్వం రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోంది : రేవంత్ రెడ్డి

యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా సోమవారం బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని బీర్కూర్, పొతంగల్ మండలం సుంకినిలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అకాల వర్షంతో రాష్ట్రంలో 5లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. మామిడి, మొక్కజొన్న, ఇతర పంటలు అకాల వర్షానికి నష్టం జరిగింది. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పంటల వివరాలు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి అందించి పరిహారం అందేలా చూడాలి. కాంగ్రెస్ హయాంలో రైతులకు పంట నష్ట పరిహారం అందించి రైతులను ఆదుకుంది. తెలంగాణ ప్రభుత్వం విత్తనాలు, ఎరువులు, పనిముట్లు సబ్సిడీ ఇవ్వడం లేదు.. కాంగ్రెస్ హయాంలో రైతులకు ఎకరాకు రూ. 40 వేల వరకు సాయం అందించింది. కేసీఆర్ ప్రభుత్వం రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. పంటల బీమా పథకాన్ని నీరుగార్చారు. కేంద్ర ప్రభుత్వం ఫెసల్ బీమా పథకం రాష్ట్రంలో అమలు కావడంలేదు. పంటల బీమా పథకం లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. 2021 లో బాన్సువాడ నియోజకవర్గంలో ఒకే మండలంలో 8 వేల ఎకరాల పంట నష్టం జరిగింది. 15 నెలలుగా రైతులకు పరిహారం అందించలేదు.

వరి పంటకు ఒక బస్తాకు 5 కిలోలు తరుగు తీస్తు రైతును దోచుకుంటున్నారు. పోచారం కొడుకులు అచ్చొసిన ఆబోతుల్లా ఊరుమీద పడి తిరుగుతున్నారు. పోచారం.. కేసీఆర్ సావాస దోషంతో మారిపోయారు. పోచారం తన ఇంటి పేరు పైసల శ్రీనివాస్ గా మార్చుకున్నారు. తండ్రీ కొడుకులు నియోజకవర్గాన్ని దోచుకుంటున్నారు. తక్షణమే ప్రభుత్వం ఎకరాకు రూ.15వేలు పంట నష్టం వెంటనే అందించాలి. బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉత్సవ విగ్రహాలుగా మారారు. పంట నష్టం జరిగి రైతులు బాధపడుతుంటే బీజేపీ నేతలు ఎందుకు క్షేత్ర స్థాయిలో పర్యటించడం లేదు.

రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విఫలం చెందాయి. కేంద్రం తక్షణమే బృందాలను పంపి ఇన్ పుట్ సబ్సిడీ అందించాలి. 2021 లో జరిగిన పంట నష్ట పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతులను వెంటనే ఆదుకోవాలి. రైతు బీమా కాదు.. పంట బీమా పథకం కేసీఆర్ అమలు చేయాలి. రైతు చనిపోతేనే డబ్బులు ఇస్తానంటున్న కేసీఆర్ మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. రైతు ఆత్మహత్యలన్నీ కేసీఆర్ ప్రభుత్వ హత్యలే అని రేవంత్ రెడ్డి విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X