Yatra For Change : కళికోట సూరమ్మ ప్రాజెక్టును సందర్శించిన రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : కళికోట సూరమ్మ ప్రాజెక్టును టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సందర్శించారు. తర్వాత మీడియా మాట్లాడారు. కళికోట సూరమ్మ ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి పేజ్ 2 స్టేజ్ 1ను 2005లో రూ. 1750 కోట్లతో వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేసిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇంత మంచి ప్రాజెక్ట్ ను తీసుకొచ్చిన ఆది శ్రీనివాస్ ను ఆనాడు చెన్నమనేని రాజేశ్వరరావు అభినందించారు. 2018లో టీఆరెస్ ఓడిపోతుందని హరీష్ రావు కలికోట సూరమ్మ ప్రాజెక్టుకు శిలాఫలకం వేశారు. సాగు, తాగు నీటి సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచారు.

ఈ నాలుగేళ్లలో ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ నిరసనలు, పాదయాత్రలు, రాస్తారోకోలు చేసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు. రైతులు ప్రశ్నిస్తే వరదకాలువ ద్వారా నీళ్లు ఇస్తామని చెబుతున్నారు. ఎతైన ఈ ప్రాంతానికి వరదకాలువ ద్వారా నీళ్లు ఎలా ఇస్తారు. అపర భగీరథుడు, ఇంజనీర్ కేసీఆర్ కు ఆ మాత్రం తెలియదా? సమైక్య పాలనలో తెలంగాణ ప్రాజెక్టులు వివక్షకు గురయ్యాయని కేసీఆర్ పదే పదే ప్రశ్నించారు. ఉమ్మడి పాలనలో సీమాంధ్రులు వివక్ష చూపినట్లే.. తెలంగాణలో కేసీఆర్ కూడా అదే వివక్ష చూపుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి, కేసీఆర్ కు పెద్ద తేడా ఏం లేదు. ఈ వివక్షను భరించే ఓపిక ఈ ప్రాంత రైతులకు లేదు.

కేసీఆర్ ను మారిస్తే తప్ప రైతుల జీవితాల్లో మార్పు రాదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కళికోట సూరమ్మ ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తి చేస్తాం. ఆనాడు మేం మొదలు పెట్టిన ప్రాజెక్టును రేపు మేమే పూర్తి చేస్తాం. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈ ప్రాంత రైతులకు హామీ ఇస్తున్నా. నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. ఈ ప్రాంత సమస్యలపై ఇక్కడి ఎమ్మెల్యేకు అవగాహన లేదు. విహార యాత్రలకు వచ్చినట్లుగా ఎమ్మెల్యే జర్మనీ నుంచి వచ్చి పోతున్నారు. కోర్టులను అడ్డుపెట్టుకుని సాంకేతికంగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కానీ మానసికంగా ప్రజలు ఆయన్ను ఎమ్మెల్యేగా గుర్తించడం లేదు. వారసత్వం ముసుగులో రాజకీయాల్లో కొనసాగుతున్నారు. రాజేశ్వర్ రావు పేరును చెడగొడుతున్నారు అని రేవంత్ రెడ్డి అన్నారు.

ఎములాడ రాజన్నకు ఇచ్చిన మాట తప్పిన కేసీఆర్

“ఆలయాన్ని ప్రతీ ఏటా 100 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తానని కేసీఆర్ మాట తప్పాడు. అభివృద్ధి సంగతి దేవుడెరుగు.. తాగు నీటి సమస్యను కూడా తీర్చలేకపోయాడు” అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా ఆదివారం వేములవాడ నియోజకవర్గం పరిధిలోని సంకెపల్లి గ్రామం నుంచి వేములవాడ వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో ప్రసంగించారు. రాజన్న ఆలయాన్ని ప్రతీ ఏటా 100 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తానని కేసీఆర్ మాట తప్పాడు. అభివృద్ధి సంగతి దేవుడెరుగు.. తాగు నీటి సమస్యను కూడా తీర్చలేకపోయాడు.

2018లో చెన్నమనేని రమేష్ ఒడిపోతాడనే భయంతో సూరమ్మ ప్రాజెక్ట్ కు శిలాఫలకం వేశారు. 43 వేల100 ఎకరాలకు నీళ్లు అందిస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచారు. ఇన్నేళ్లయినా తట్ట మట్టి కూడా తీయలేదు. ఈ ప్రాంతంపై కేసీఆర్ వివక్ష చూపుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన వివక్షనే.. కేసీఆర్ పాలనలో కొనసాగుతోంది. 40ఏళ్ల కింద తనకు ఇక్కడే తనకు పెళ్లి జరిగిందని… ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని కేసీఆర్ చెప్పిండు. 40 ఏళ్ల కింద కేసీఆర్ కు ఇక్కడ లగ్గం అయిందో లేదో తెలియదుకానీ… వేములవాడ ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆయన లగ్గం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. గుడిని, గుడిలో లింగాన్ని దిగమింగే ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతోంది.

ఇక్కడి ఎమ్మెల్యేను కలవాలంటే జర్మనీకి పోవాల్సిన ఖర్మ పట్టింది. ఈ ప్రజలపై ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు ప్రేమ లేదు. అందుకే ఇక్కడి పౌరసత్వం వదులుకున్నారు. ప్రజలతో బంధం తెంచుకున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే.. ఈ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలి.. మిడ్ మానేరు బాధితులు గా కేసీఆర్ కుటుంబం ఆర్ అండ్ ప్యాకేజీ తీసుకున్నారు. కానీ పెళ్లైన గిరిజన ఆడ బిడ్డలకు మాత్రం ఇవ్వనంటున్నారు.. మీ కుటుంబానికి ఒక న్యాయం… మా గిరిజన బిడ్డలకు ఒక న్యాయమా? కేసీఆర్ కు కొంచెమైనా బాధ్యత ఉందా? వేలకోట్లు ఉన్న మీ కుటుంబం.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ తీసుకుని పేదల పొట్ట కొడతారా? తెలంగాణ తెచ్చిన అన్న వారికి రెండుసార్లు అవకాశం ఇచ్చారు.

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి.ఒక్క అవకాశం ఇస్తే… ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ. 5లక్షలు సాయం అందిస్తాం.రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తాం. ప్రతీ పేద రైతులు రూ.2లక్షల రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటాం. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. ప్రతీ పేద ఆడబిడ్డకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. కళికోట సూరమ్మ ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తి చేసి 43వేల ఎకరాలకు నీరందిస్తాం. గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఆదుకుంటాం.

రాజన్నను దర్శనం చేసుకున్న రేవంత్ రెడ్డి

పాదయాత్ర కంటే ముందు ఆదివారం ఉదయం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదాశీర్వచనాలు అందజేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. భక్తుల కోరికలు తీర్చే రాజన్నను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. వేములవాడ రాజన్నను కూడా కేసీఆర్ మోసం చేశారు.

ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మాట తప్పారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే ఆలయ అభివృద్ధి జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భక్తుల అవసరాలకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వం మిడ్ మానేరు బాధితులకు పరిహారం విషయంలో కొర్రీలు పెడుతోంది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా నిధులు తెచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. పెళ్ళైన ఆడపిల్లలకు వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వడం లేదు.

కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఇచ్చి గిరిజనులకు ఎందుకు ఇవ్వడం లేదు. దొరలకు ఒక నీతి… గిరిజనులకు ఒక నీతా? మిడ్ మానేరు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి. బాధితుల పోరాటానికి కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తుంది. విదేశాల్లో ఉండే వారికి బుద్ది చెప్పి అభివృద్దిని కాంక్షించే స్థానికుడిని ప్రజలు గెలిపించాలి. కాంగ్రెస్ ను గెలిపించి ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలి అని రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X