हैदराबाद: तेलंगाना सरकार ने बीजेपी विधायक ईटेला राजेंदर की सुरक्षा को लेकर अहम फैसला लिया है। मालूम हो कि ईटेला राजेंदर और उनकी पत्नी जमुना ने बीआरएस एमएलसी कौशिक रेड्डी पर 20 करोड़ रुपये लेकर उनकी हत्या की साजिश रचने का आरोप लगाया है। इसके चलते तेलंगाना की राजनीति में हड़कंप मच गया है। इसके साथ ही तेलंगाना सरकार ने ईटेला राजेंदर को वाई-प्लस श्रेणी की सुरक्षा प्रदान करके एक महत्वपूर्ण निर्णय लिया है।
केसीआर सरकार ने ईटेला को बुलेट प्रूफ वाहन के साथ 16 सुरक्षाकर्मियों की नियुक्ति का आदेश जारी किया है। आदेश में कहा गया है कि यह सुरक्षा शनिवार से लागू होगी। इसके साथ ही ईटेला राजेंदर को कल से वाई-प्लस श्रेणी की सुरक्षा मिलेगी।
इस बीच ईटेला राजेंदर की हत्या की साजिश सामने आने के बाद केंद्र सरकार वाई-प्लस श्रेणी की सुरक्षा देने पर फोकस कर रही है। हालाँकि, तेलंगाना सरकार को लगा कि ईटेला को सुरक्षा प्रदान की जानी चाहिए। मामले की जानकारी मिलते ही मंत्री केटीआर ने डीजीपी को फोन किया और इस विषय पर खुद देखने को सुझाव दिया।
डीजीपी अंजनी कुमार ने तुरंत प्रतिक्रिया देते हुए मेडचल डीसीपी संदीप राव को ईटेला द्वारा लगाए गए आरोपों के बारे में विवरण इकट्ठा करने का निर्देश दिया। इस बीच, डीसीपी संदीप राव की टीम ईटेला के आवास पर गई और उनसे और उनकी पत्नी जमुना से इस मामले पर चर्चा की। ईटेला ने पुलिस को सभी घटनाओं के बारे में विस्तार से बताया। ईटेला ने बताया कि हुजूराबाद और अन्य जिलों की यात्रा के दौरान कई संदिग्ध कारें उनके आसपास घूमते पाये गये।
डीसीपी संदीप राव ने सारी जानकारी जुटाई और ईटेला राजेंदर की सुरक्षा पर सीलबंद लिफाफे में रिपोर्ट डीजीपी को सौंप दी। डीजीपी ने रिपोर्ट का अवलोकन किया और पुष्टि की कि ईटेला के जान को खतरा है। इसके साथ ही सरकार ने ईटेला को वाई-प्लस श्रेणी की सुरक्षा देने का फैसला किया है और इस संबंध में आदेश भी जारी कर दिया है।
ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు వై-ప్లస్ కేటగిరి భద్రత
హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భద్రతపై కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి రూ 20 కోట్లతో తన హత్యకు కుట్ర చేస్తున్నారని ఈటల రాజేందర్, ఆయన భార్య జమున ఆరోపణలు చేయటం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈటల రాజేందర్ భద్రతకు వై- ప్లస్ కేటగిరి భద్రత కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈటలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు 16 మంది సెక్యూరిటీ సిబ్బంది నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ సెక్యూరిటీ రేపటి నుంచే అమలు కానున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ఈటల రాజేందర్‌కు రేపటి నుంచి వై-ప్లస్ కేటగిరీ భద్రత ఉండనుంది.
ఇదిలా ఉంటే ఈటల రాజేందర్‌పై హత్యకు కుట్ర విషయం బయటికి రావటంతో కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని వై- ప్లస్ కేటగిరి సెక్యూరిటీ కల్పించనుందని వార్తలు బయటికి వచ్చాయి. అయితే ఈటలకు తెలంగాణ ప్రభుత్వమే సెక్యూరిటీ కల్పించాలని భావించింది. ఈ విషయం తెలియగానే మంత్రి కేటీఆర్ స్పందించి ఈ విషయాన్ని స్వయంగా పరిశీలించాలని డీజీపీకి ఫోన్ చేసి మరీ చెప్పారు.
వెంటనే స్పందించిన డీజీపీ అంజనీ కుమార్ ఈటల చేసిన ఆరోపణలపై ఈటలను కలిసి వివరాలు సేకరించాలని మేడ్చల్ డీసీపీ సందీప్ రావును ఆదేశించారు. కాగా ఈటల నివాసానికి వెళ్లిన డీసీపీ సందీప్ రావు బృందం ఆయనను, ఆయన భర్య జమునతో ఈ విషయమై చర్చించారు. ఈటలకు ఎదురైన సంఘటనలన్ని పోలీసులకు వివరించారు. హుజురాబాద్‌తో పాటు జిల్లాల పర్యటనల్లో ఉన్నప్పుడు పలు అనుమానాస్పద కార్లు తిరుగుతున్నాయని ఈటల వివరించారు.
అన్ని వివరాలు సేకరించిన డీసీపీ సందీప్ రావు ఈటల భద్రతపై సీల్డ్ కవర్‌లో డీజీపీకి రిపోర్ట్ అందజేశారు. నివేదికను గమనించిన డీజీపీ ఈటలకు ముప్పు పొంచి ఉందని నిర్ధారించారు. దీంతో ఈటలకు వై-ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. (ఏజెన్సీలు)