సిఎం కెసిఆర్ పాలనలోనే మహిళలకు మహర్దశ
మహిళల సాధికారత కోసమే అనేక పథకాలు
మహిళా దినోత్సవ కానుకగా రాష్ట్రంలో ఆరోగ్య మహిళ పథకం
అభయ హస్తం నిధులు వాపస్ ఇవ్వడానికి ఏర్పాట్లు
అభయ హస్తం మహిళల్లో అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు
మహిళల అభివృద్ధితోనే దేశ ప్రగతి
దేశలో ఎక్కడా లేని విధంగా డ్వాక్రా సంఘాల బలోపేతం
స్త్రీ నిధి ద్వారా 18వేల కోట్ల రుణాలు
కెటిఆర్ చేతుల మీదుగా కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కుట్టు మిషన్లు, సర్టిఫికేట్ల పంపిణీ
నియోజకవర్గంలో మహిళలను కాపాడుకునే బాధ్యత నాదే
ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో తొర్రూరులో ఘనంగా మహిళా దినోత్సవం
తొర్రూరు : సిఎం కెసిఆర్ పాలనలోనే మహిళలకు మహర్దశ వచ్చింది. మహిళల సాధికారత కోసం సిఎం కెసిఆర్ గారు అనేక పథకాలు అమలు చేస్తున్నారు. మహిళా దినోత్సవ కానుకగా రాష్ట్రంలో మహిళా ఆరోగ్య పథకాన్ని తెస్తున్నారు. అభయ హస్తం నిధులను మహిళలకే మిత్తీతో సహా వాపస్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అభయ హస్తం మహిళల్లో అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం, తొర్రూరు పట్టణ కేంద్రంలో ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో ఆ ట్రస్టు చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు అధ్యక్షతన మందస్తుగా ఘనంగా మహిళా దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లికి భారీ ఎత్తున తరలి వచ్చిన మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. మేళ తాళాలు, బాణా సంచాలు, బతుకమ్మలతో ఎదురేగి, పూలు చల్లుతూ ఊరేగింపుగా సమావేశ స్థలానికి తీసుకెళ్ళారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… మహిళల అభివృద్ధితోనే దేశ ప్రగతి, పురోగతి జరుగుతుంది. దేశలో ఎక్కడా లేని విధంగా డ్వాక్రా సంఘాల బలోపేతం మన రాష్ట్రంలోనే జరిగింది. స్త్రీ నిధి ద్వారా 18వేల కోట్ల రుణాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీన తొర్రూరుకు వస్తున్న మంత్రి, బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చేతుల మీదుగా కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న 500 మందికి కుట్టు మిషన్లు, సర్టిఫికేట్ల పంపిణీ చేస్తామన్నారు. అలాగే తనను ఇంతగా ఆదరించి, గెలిపిస్తూ వస్తున్న, నియోజకవర్గంలో మహిళలను కాపాడుకునే బాధ్యత నాదేనని మంత్రి అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్…
మహిళలందరికీ ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!
అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలకు అభినందనలు!
మహిళలకు అసలైన ఆత్మ బంధువు సీఎం కెసిఆర్
సిఎం కేసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో మహిళలకు అగ్ర స్థానం
తెలంగాణ ఉద్యమంలోనే కాదు, అభివృద్ధిలో మహిళల పాత్ర కీలక0
అందుకే అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు
మహిళలను మనమంతా మనతో సమానంగా గుర్తించాలి
అవకాశాలు అందిపుచ్చుకోవడం లో మహిళలు ఎవరికీ తీసిపోరు
మహిళలు అసమాన ప్రతిభావంతులు
ముఖ్యమంత్రి కేసిఆర్ గారు తెలంగాణలో మహిళలకు స్థానిక సంస్థల్లో, మార్కెట్ కమిటీల్లో 50% రిజర్వేషన్లు కల్పించారు.
అనేక అవకాశాలు కల్పిస్తూ మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు.
ఇందుకు ప్రతిగా మహిళలతో పాటు మనమంతా కెసిఅర్ కు కృతజ్ణతలు తెలుపుకోవాలే
జిహెచ్ఎంసీ, GWMC చరిత్రలో మొదటి సారిగా మేయర్, డిప్యూటీ మేయర్ల పదవులను మహిళలకు కట్టబెట్టి ఈ ప్రభుత్వంలో మహిళా ప్రాధాన్యతను సీఎం. చాటారు
2014 సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తూ వివిధ రంగాల్లో రాణించిన మహిళలను సత్కరిస్తున్నది.
దేశంలో ఎక్కడా లేని విధంగా…మన రాష్ట్రంలో కుట్టు శిక్షణ చేపట్టిన0
పైలట్ ప్రాజెక్టుగా మన పాలకుర్తి నియోజకవర్గంలో మొదటి విడతగా 5 కోట్ల 10 లక్షల రూపాయల ఖర్చుతో 3వేల మందికి శిక్షణ ఇస్తున్నాం
త్వరలోనే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తారిస్తం
ఇంకా చాలా మందికి పాలకుర్తి నియోజకవర్గ మహిళలకు శిక్షణ ఇస్తాం
ఈ శిక్షణ తర్వాత ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను
నన్ను గెలిపించిన మీ రుణం తీర్చుకుంటాను
క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మహిళలను ఆదుకునేందుకు సేవా గృహాలు, స్టేట్ హోమ్స్, రెస్క్యూ హోమ్స్, వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్, వృద్ధాప్య గృహాలు, ప్రత్యేక పాలిటెక్నిక్, డిగ్రీ మహిళా రెసిడెన్షియల్ కాలేజీలు నిర్వహిస్తూ ఆడపిల్లలు, మహిళల సమగ్ర వికాసం, సంరక్షణ కోసం కృషి జరుగుతున్నది.
వీటితో పాటు దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళల భద్రతకు షీటీమ్స్, ఒంటరి, వృద్ధ, వితంతు, బీడి కార్మిక, బోధకాలు, నేత, గీత మహిళలకు పెన్షన్లు ఇస్తూ వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నా0
కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ ద్వారా పేద ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకుండా మేనమామగా సిఎం కేసిఆర్ గారు ఆదుకుంటున్నారు
దీనివల్ల గణనీయంగా బాల్యవివాహాలు తగ్గాయి.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఆశావర్కర్లు, అంగన్ వాడీ ఉద్యోగులు వేతనాలు పెంచుకున్నాo
కేసిఆర్ కిట్ ద్వారా మొదట 50 వేల చొప్పున, తర్వాత 75 వేల చొప్పున, ఆ తర్వాత 1 లక్ష 116 రూపాయలు అందిస్తున్నాం. ఇలా ఇప్పటి వరకు 10 లక్షల 32 వేల మందికి సురక్షిత ప్రసవాల కు భద్రత కల్పించా0
అమ్మ ఒడి, ఆరోగ్య లక్ష్మీ పథకం ద్వారా 21 లక్షల మందికి పోషకాహారా న్ని అందిస్తున్నా0
ఇందుకు యేటా 450 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం
ఏడాదికి 18,000 కోట్ల రూపాయల స్త్రీ నిధి రుణాలు అందచేస్తున్నాం
ఇలా అన్ని దశల్లో ఆడపిల్లలు, మహిళలను ఆదుకుని వారి సమగ్ర వికాసం, భద్రత కోసం ఈ ప్రభుత్వం అహర్నిశలు పాటుపడుతూ వారి సంక్షేమం, అభివృద్ధిలో నేడు దేశంలోనే ముందంజలో ఉంది
ప్రభుత్వం కల్పించే ప్రతి పథకంలో భాగస్వామ్యమై వాటిని విజయవంతం చేస్తూ ప్రభుత్వానికి నిరంతరం అండగా కొనసాగుతున్న మహిళలందరికీ మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!
ఎర్రబెల్లి ట్రస్టు చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు కామెంట్స్
మహిళలకు మందస్తుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
మహిళలు చదువులతోపాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల మీద దృష్టి పెట్టాలి
సొంత కాళ్ళపై నిలబడే విధంగా ఆర్థికంగా ఎదిగితే, ఆ కుటుంబం, రాష్ట్రం, దేశం బాగుపడుతుంది
కెసిఆర్ సిఎం అయ్యాక, మహిళల కోసం అనేక పథకాలు అమలు అవుతున్నాయి
అవన్నీ మహిళలను ఆర్థికంగా ఎదిగే విధంగా చేస్తున్నాయి.
మహిళలు ఎవరెవరో ఏదేదో చెబుతారు. అవన్నీ పట్టించుకోవద్దు
మనకు సేవ చేస్తున్న సీఎం కెసిఆర్ గారికి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి అండగానిలవాలి
ఈ కార్యక్రమంలో మహిళలు, మహిళా ప్రజాప్రతినిధులు, పార్టీ మహిళా విభాగం నేతలు, పలువురు మహిళలు, ఎర్రబెల్లి ట్రస్టు ప్రతినిధులు పాల్గొన్నారు.