… इसीलिए तीन बकरियों की सुपारी देकर पत्नी ने कर दी पति की हत्या

हैदराबाद : जडचार्ला शहर में पत्नी ने अपने पति की तीन बकरियां सुफारी देकर हत्या करवाई है। क्योंकि वह बेटी के प्यार में बाधा बन गया था। जडचर्ला पुलिस ने शनिवार को जडचर्ला शहर के राजीव नगर कॉलोनी में बकरी चरवाहे आंजनेयुलु की हत्या के मामले को सुलझा लिया। पुलिस ने बताया कि बेटी के प्रेम प्रसंग का खुलासा होने के बाद पत्नी ने इस बात से नाराज होकर पति की हत्या कर दी कि वह अक्सर बेटी और उसे प्रताड़ित करता था।

जडचर्ला टाउन सीआई आदिरेड्डी ने बताया कि जडचार्ला नगरपालिका के नौवें वार्ड में राजीव नगर कॉलोनी के निवासी मेकम आंजनेयुलु (42) पेशे से बकरी चराकर अपना जीवन यापन कर रहा था। आंजनेयुलु को पत्नी मेकम भाग्यलक्ष्मी, तीन बेटियां और एक बेटा है। सबसे बड़ी बेटी इंटरमीडिएट तक पढ़ाई की और घर पर ही रह रही है। हाल ही में बेटी के इंस्टाग्राम पर हैदराबाद के पांडु नाम के एक व्यक्ति का परिचय हुआ। मृतक आंजनेयुलु ने देखा कि उसकी बेटी अक्सर पांडु से फोन पर बात कर रही है।

यह देख ने आंजनेयुलु ने बेटी को पांडु से फोन पर बात करना बंद कर देने की चेतावनी दी। फिर भी उसकी बेटी फोन पर पांडु से बात करती रही। इसके चलते वह बेटी को गाली देता था और मारता था। पत्नी भाग्यलक्ष्मी पति को रोकने की कोशिश करती थी, वह उसे भी गाली देता और मारता था। इसके चलते वह मानता था कि पत्नी भी अपनी बेटी का समर्थन करती है। इसके चलते आंजनेयुलु अक्सर दोनों को गालियां देता और मारता था। साथ ही बेटी के साथ अभद्र व्यवहार करता था।

यह भी पढ़ें-

भाग्यलक्ष्मी ने सोचा कि आंजनेयुलु को बेटी के प्यार में बाधा डाल रहा हैं। इसलिए भाग्यलक्ष्मी ने फैसला किया किसी भी तरह अपने पति को ख़त्म कर दिया जाये। उसने मैसम्मा नामक महिला से समझौता किया कि यदि वह उसके पति को मार देती है तो वह तीन बकरियों को सुफारी के रूप में दे देगी। योजना के मुताबिक 21 तारीख की रात को भाग्यलक्ष्मी ने अपने पति को खूब शराब पिलाई और उसे बकरी की शेड में सुला दिया। इसके बाद भाग्यलक्ष्मी ने मैसम्मा को फोन करने बताया कि उसके पति आंजनेयुलु को खत्म कर दें। इतना कहकर वह वहां से चली गई।

सीआई आदिरेड्डी ने आगे बताया कि इसके बाद मैसम्मा ने मुत्यालम्मा और अपने प्रेमी नरसिम्हा को बकरी की शेड में ले गई। मैसम्मा व मुत्यालम्मा ने आंजनेयुलु के पैर और हाथ दबाकर पकड़ लिए और नरसिम्हा ने तेज हथियार से गला काटकर हत्या कर दी। बाद में खून से सने कपड़ों को शहर के कोशागुट्टा में फेंकर फरार हो गये। भाग्यलक्ष्मी के मोबाइल फोन के आधार पर आरोपी की पहचान की गई। मृतक की पत्नी भाग्यलक्ष्मी ए1, मैसम्मा ए2, नरसिम्हा ए3 और माला मुत्यालम्मा ए4 को कोर्ट में पेश किया। कोर्ट ने चारों को न्यायिक हिरासत में भेज दिया। डीएसपी वेंकटेश्वरलु ने 48 घंटे के भीतर हत्या के मामले को सुलझाने के लिए जडचार्ला पुलिस को बधाई दी है।

కూతురు ప్రేమకు అడ్డుగా ఉన్నాడని భర్తను మూడు మేకలను సుఫారీ ఇచ్చి హత్య చేయించిన భార్య

హైదరాబాద్ : జడ్చర్ల పట్టణలో కూతురు ప్రేమకు అడ్డుగా ఉన్నాడని మూడు మేకలను సుఫారీగా ఇచ్చి భర్తను హత్య చేయించింది భార్య. శనివారం జడ్చర్ల పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో వెలుగు చేసిన మేకల కాపరి ఆంజనేయులు హత్య కేసును రెండు రోజుల వ్యవధిలోనే జడ్చర్ల పోలీసులు చేదించారు. కూతురి ప్రేమ వ్యవహారం బయటపడడంతో తరచుగా కూతుర్ని వేధిస్తున్నాడని కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తు వేధిస్తున్నాడనే కోపంతో భర్తను భార్య హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు.

జడ్చర్ల పట్టణ సీఐ ఆదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదవ వార్డులో గల రాజీవ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న మెకం ఆంజనేయులు (42) వృత్తిరీత్యా మేకల కాపరిగా జీవనం కొనసాగిస్తున్నాడు. ఆంజనేయులకు భార్య మేకం భాగ్యలక్ష్మి ముగ్గురు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. ఇందులో పెద్ద కూతురు ఇంటర్మీడియట్ వరకు చదివి ఇంట్లో ఉంటుంది. గత కొంతకాలంగా కూతురి ఇంస్టాగ్రామ్ లో హైదరాబాద్ కు చెందిన పాండు అనే వ్యక్తి పరిచయం అయ్యాడని, తరచుగా పాండు తో ఫోన్లో మాట్లాడుతుండగా చూసిన మృతుడు ఆంజనేయులు ఫోన్లో పాండుతో మాట్లాడడం మానుకోవాలని బెదిరించాడని, అయిన వినకుండా కూతురు పాండుతో మాట్లాడుతుండటంతో ఆంజనేయులు తన కూతురిని కొడుతుండేవాడు.

భార్య భాగ్యలక్ష్మి అడ్డుకోవడంతో ఆమెను కూడా కొట్టాడని భార్య కూతురుకు సపోర్ట్ చేస్తుందని తరచుగా దుర్భాషలాడుతూ కొట్టేవాడని కూతురు తో అసభ్యంగా ప్రవర్తిస్తుండేవాడని దీంతో తన కూతురి ప్రేమకి ఆంజనేయులు అడ్డు వస్తున్నాడని తరచుగా వేధిస్తున్నాడని కోపం పెంచుకున్న భార్య భాగ్యలక్ష్మి ఎలాగైనా తన భర్తను అంతమొందించాలని నిర్ణయించుకుంది. అదే కాలానికి చెందిన మైసమ్మ వద్ద పథకం పన్ని తన భర్తను చంపితే తన మూడు మేకలను సుఫారీగా ముద్దాయిలకు ఇస్తానని ఒప్పందం చేసుకుందని 21వ తేదీ మధ్య రాత్రి భాగ్యలక్ష్మి తన భర్తకు మద్యం తాపీ మేకల షెడ్డు వద్దకు తీసుకెళ్లి పడుకోబెట్టింది.
తన భర్తను చంపమని మైసమ్మకు చెప్పి భాగ్యలక్ష్మి వెళ్ళిపోయింది.

దీంతో మైసమ్మ ముత్యాలమ్మను తన ప్రియుడైన నర్సింహులను వెంటబెట్టుకొని షెడ్డు వద్దకు తీసుకెళ్లి మద్యం మత్తులో పడుకున్న ఆంజనేయులును మైసమ్మ ముత్యాలమ్మ కాళ్లు చేతులు పట్టుకుని నరసింహ గొంతు కోసి చంపారు. అనంతరం రక్తంతో తడిసిన బట్టలను పట్టణంలోని కోశా గుట్ట వద్ద వదిలేసి ఫరార్ అయ్యారు. భాగ్యలక్ష్మి మొబైల్ ఫోన్ ఆధారంగా నిందితులను గుర్తించాము. సోమవారం మృతుడి భార్య ఏ1 భాగ్యలక్ష్మి, ఎ2 మైసమ్మ, ఏ3 నరసింహ, ఏ 4 మాల ముత్యాలమ్మ ను, రిమాండ్ కు పంపినట్లు సిఐ ఆదిరెడ్డి తెలిపారు. 48 గంటలు గడవకముందే హత్యకేసును జడ్చర్ల పోలీసులు చేదించడంతో డీఎస్పీ వెంకటేశ్వర్లు వారిని అభినందించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X