हैदराबाद: टीपीसीसी के अध्यक्ष रेवंत रेड्डी ने कहा कि किसानों की मदद के लिए पहली बार कांग्रेस के घोषणापत्र के हिस्से के रूप में Warangal Declaration की गई है। परिवर्तन पदयात्रा यात्रा (Yatra For Change) के अंतर्गत निजामाबाद संसद निर्वाचन क्षेत्र के कमरपल्ली में किसानों के साथ आयोजित मिलन एवं अभिनंदन कार्यक्रम में यह बात कही।
హైదరాబాద్ : రైతులను ఆదుకునేందుకు మొదటిసారిగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో భాగంగా వరంగల్ డిక్లరేషన్ ప్రకటించిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని కమ్మర్ పల్లిలో రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
వరంగల్ డిక్లరేషన్ అమలు చేయించే బాధ్యత తనదని రాహుల్ హామీ ఇచ్చారు అని ఆయన పేర్కొన్నారు. ఆర్మూర్ రైతుల ఆత్మగౌరవం అయిన కండువాను వేసుకుని రాహుల్ మాట ఇచ్చారు. రైతులకు రూ.2లక్షల రుణ మాఫీ చేస్తామని కాంగ్రెస్ డిక్లరేషన్ ఇచ్చింది. ఇందిరమ్మ రైతు భరోసా కింద భూమి లేని రైతులకు కూడా రూ. 12వేలు అందిస్తాం. ప్రత్యేక పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం. చక్కెర ఫ్యాక్టరీని అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లో ఫ్యాక్టరీని తెరిపిస్తాం. రైతులకు రైతు బీమా పథకాన్ని కాంగ్రెస్ అమలు చేస్తుంది.
రైతు ఆత్మగౌరవంతో బతికేలా పంటల బీమా పథకం అమలు చేస్తాం. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నాటకాలాడి పంట బీమా అందించడంలేదు. పంట బీమా ఇవ్వని ప్రభుత్వం… రైతు చనిపోతే బీమా ఇస్తామంతున్నారు. రైతు చావును కోరుకుంటున్న ప్రభుత్వ చర్య దుర్మార్గమైనది. మహిళా, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ కమిషన్ లా.. రైతుల కోసం రైతు కమిషన్ ఏర్పాటు చేస్తాం. రైతు సమస్యలను రైతు కమిషన్ ద్వారా పరిష్కరిస్తాం. వరి వేస్తే ఉరి అని ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటిస్తోంది.
ప్రభుత్వం వ్యవసాయాన్ని కార్పొరేట్ కు కట్టబెట్టే కుట్ర చేస్తోంది. రైతులను ఆదుకునేందుకు కాంగ్రెస్ స్పష్టమైన విధానంతో మీ ముందుకు వస్తోంది. మోడీ, అమిత్ షా దేశాన్ని అమ్మేస్తున్నారు. ఆదానీ, అంబానీ దేశాన్ని కొంటున్నారు. ఇద్దరు గుజరాతి పెట్టుబడిదారులకు దేశాన్ని అమ్ముతున్నారు. గుజరాత్ మోడల్ అంటే ఇదేనా? రాష్ట్రంలో 3వేల వైన్ షాపులు.. 6వేల బెల్టు షాపులున్నాయి. ఇదేనా కేసీఆర్ తెలంగాణ మోడల్..? పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ ఇచ్చిన అరవింద్… మాట తప్పారు.
పసుపు బోర్డు అడిగితే స్పైస్ బోర్డు తెచ్చినం అని చెబుతున్నారు. కేసీఆర్ పై కోపంతో బీజేపీ వైపు చూస్తే.. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే. 2014 నుంచి 2023 వరకు రైతులు ఎలా మోసపోయారో ఒకసారి ఆలోచించండి. ఆర్మూర్ రైతు దీక్ష నన్ను రాజకీయంగా ఒక మెట్టు ఎక్కేలా చేసింది. రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. 2024, జనవరి 1వ కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. అధికారంలోకి రాగానే ప్రతీ పేదవాడికి ఇళ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు అందిస్తాం.
ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. పేదలకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. ఏడాదిలోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. పంటలకు వరంగల్ డిక్లరేషన్ లో ప్రకటించిన విధంగా మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చత్తీస్ ఘడ్ మోడల్ అమలు చేస్తాం. చత్తీస్ ఘడ్ లో వరి ధాన్యాన్ని రూ. 2660 కి ప్రభుత్వం కొంటోందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ తల్లికి బంధ విముక్తి కలిగించేందుకే ఈ పాదయాత్ర.భీంగల్ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి దర్శనం తర్వాత మీడీయాతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
భీంగల్ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామివారిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఆయనకు వేదపండితులు పూర్ణకుంభంతో పలికారు. తర్వాత రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజరులు వేద ఆశీర్వచనాలు అందించారు. తర్వాత మీడియా మాట్లాడారు. చారిత్రక లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ తల్లికి బంధ విముక్తి కలిగించేందుకే ఈ పాదయాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. స్వయంపాలనతో కూడిన సామాజిక తెలంగాణ కాంగ్రెస్ లక్ష్యమన్నారు.
తెలంగాణ వచ్చినా ఇక్కడి రైతులను ప్రభుత్వం ఆదుకుందా? నరసింహ స్వామి సాక్షిగా నేను ప్రశ్నిస్తున్నా…కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. కానీ తెలంగాణలో నిరుద్యోగుల జీవితాల్లో మార్పు రాలేదు. తెలంగాణ వచ్చినా ప్రజల కష్టాలు తీరలేదు. పోరాటంలో, పట్టుదలలో, పౌరుషంలో నిజామాబాద్ రైతులు హర్యానా రైతులకు తక్కువేం కాదు. కేసీఆర్ కుడి భుజం అని చెప్పుకునే మంత్రి ప్రశాంత్ రెడ్డిని అడుగుతున్నా.
ఈ ప్రాంతంలో చెరుకు పరిశ్రమను ఎందుకు మూసివేశారు? ఎందుకు ఇక్కడి రైతులను ఆదుకోవడంలేదని ప్రశ్నిస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాల్సిన అవసరం లేదా? చైతన్యం కలిగిన రైతులు ఒక్కసారి ఆలోచన చేయండి అని విజ్ఞప్తి చేశారు. సుదర్శన్ రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు వంటి గొప్ప నాయకులు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉండి ఈ ప్రాంతం గౌరవాన్ని పెంచారు. కానీ ఇప్పుడున్న బీఆరెస్ ఎమ్మెల్యేలు ఈ జిల్లా పరువు తీస్తున్నారు. ఇక్కడ ఏ దోపిడీ చూసినా ప్రశాంత్ రెడ్డి, గణేష్, జీవన్ రెడ్డి పేర్లే వినిపిస్తున్నాయి. ఇసుక దోపిడీ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు.
Warangal Declaration to help the farmers: TPCC President Revanth Reddy in an interview with the farmers in Kammerpalli
Hyderabad : TPCC President Revanth Reddy said that the Warangal Declaration was announced as part of the Congress Manifesto for the first time to help the farmers. He was speaking at a meet-and-greet program organised with farmers at Kamar Palli under Nizamabad Parliament during the Yatra for Change Padayatra.
Revant Reddy mentioned that Rahul had promised to ensure that the Warangal Declaration was implemented. Rahul pledged his word by donning the scarf which was a gesture of self respect of the Armoor farmers. The Congress Party has declared that the farmers will be provided a loan waiver of Rs 2 lakhs.
Under Indiramma Rythu Bharosa, we will also provide Rs.12 thousand to landless farmers. A separate Turmeric Board will be set up. We will reopen the sugar factory within six months of coming to power. The Congress Party will implement the Rythu Bhima scheme for farmers.
We will implement the crop insurance scheme so that the farmers live with self-respect. The State and Central Governments are not serious about providing crop insurance to the farmers. The government which does not provide crop insurance to the farmers claims it will give insurance if the farmer dies. This is a cruel intention on the part of the Government in wanting farmer’s death.
On the lines of Women, SC, ST, Minority, BC Commission, we will set up the Rythu Commission for farmers. The farmers’ problems will be resolved through the Farmers’ Commission. The government is declaring a crop holiday saying that if you plant rice, you will be hanged. The government is conspiring to hand over agriculture to the corporates.
For helping the farmers, the Congress Party is coming up with a clear policy. Modi and Amit Shah are selling the country. Adani and Ambani are buying the country. Selling the country to two Gujarati investors. Is this the Gujarat model? There are 3 thousand wine shops and 6 thousand belt shops in the state. Is this KCR’s Telangana model? BJP MP Arvind who has given an assurance on bond paper to bring the Turmeric Board… failed to keep his promise. When asked about the Turmeric Board, they say they have brought the Spice Board.
If you look at BJP because of your anger against KCR.. it is like falling from the frying pan into the fire. Think about how the farmers were cheated from 2014 to 2023. Armor Rythu Diksha made me take a step up politically. Congress party takes the responsibility of supporting the farmers.
Congress party will be in power in the new year 2024, January 1. Once in power, we will provide Rs.5 lakh to build houses for every poor person. Through Arogyashree, the government will bear medical expenses up to Rs.5 lakhs. We will provide a gas cylinder for Rs.500 to the poor. We will fill 2 lakh government job vacancies within the first year. We will purchase the crops at the support price as announced in the Warangal Declaration. If Congress comes to power, we will implement the Chhattisgarh Model. The government is buying paddy for Rs 2660 in Chhattisgarh, Revanth Reddy commented during the meeting. This padayatra is to liberate the mother of Telangana
TPCC President Revanth Reddy with the media after visiting Bhingal Limbadri Lakshmi Narasimhaswamy temple
TPCC president Revanth Reddy visited Bhingal Limbadri Lakshmi Narasimhaswamy on Sunday. Vedic scholars welcomed him with Purnakumbham after which Revanth Reddy performed special pooja. The temple priests showered blessings on him following which Revant spoke to the media. He said he was happy to visit the historical Limbadri Lakshmi Narasimhaswamy. He said this padayatra was undertaken to free Telangana Talli. Self-governing Telangana with social equity is the goal.
Even after Telangana was achieved, has the government supported the farmers here? As a witness of Narasimha Swamy, I am questioning…everyone in KCR’s family got jobs. But there was no change in the lives of the unemployed in Telangana. Telangana did not end people’s problems. The farmers of Nizamabad are no less than the farmers of Haryana in fighting, perseverance and manliness. Minister Prashanth Reddy, who claims to be KCR’s right hand man, is asked why the sugarcane industry was closed in this area.
I am questioning why they are not supporting the farmers here. Is there no need for change in Telangana state? I appeal to the conscious farmers to think once. Great leaders like Sudarshan Reddy and Mandava Venkateswara Rao became MLAs and Ministers and raised the prestige of this region. But the current BRS MLAs are destroying the reputation of the district.
The names of BRS MLAs Prashanth Reddy, Ganesh, Jeevan Reddy names are heard whenever there is a robbery. They are earning crores through sand mare heard here whenever we see any robbery. They are earning crores by illegal sand mining. There was never such a bad situation in the past.