हैदराबाद : नलगोंडा-खम्मम-वरंगल एमएलसी मतदान शुरू हो गया है। मतदान सुबह आठ बजे से शाम चार बजे तक जारी रहेगा। 5 जून को स्नातक एमएलसी कोटा के नतीजे आएंगे।
बीआरएस विधायक के रूप में चुने गए पल्लाराजेश्वर रेड्डी के इस्तीफे के बाद एमएलसी उपचुनाव अपरिहार्य हो गया। कांग्रेस से तीनमार मल्लन्ना, बीआरएस से राकेश रेड्डी और बीजेपी से प्रेमेंदर रेड्डी चुनाव लड़ रहे हैं। एमएलसी उपचुनाव में कुल 52 उम्मीदवार हैं।
तीन संयुक्त जिलों के 34 विधानसभा क्षेत्रों में एमएलसी उपचुनाव जारी है। एमएलसी उपचुनाव के लिए 605 मतदान केंद्र बनाए गए हैं। उपचुनाव में 4,63,839 स्नातक अपने मताधिकार का प्रयोग करेंगे।
यह भी पढ़ें-
नक्सल प्रभावित इलाकों में कड़ी सुरक्षा व्यवस्था की गयी है। पुलिस ने महाराष्ट्र, तेलंगाना और छत्तीसगढ़ की सीमाओं पर जगह-जगह तलाशी ले रही है। खम्मम, नलगोंडा और वरंगल के संयुक्त जिलों में रात 8 बजे तक धारा 144 लागू रहेगी।
పట్టభద్రుల MLC ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభం
హైదరాబాద్ : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రారంభం అయింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. జూన్ 5న పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలు రానున్నాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లారాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డిలు బరిలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో మొత్తం 52 మంది ఉన్నారు.
మూడు ఉమ్మడి జిల్లాలో 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతోంది. ఎమ్మెల్సీ ఉపఎన్నిక కోసం 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉప ఎన్నికలో 4,63,839 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పోలీసులు విస్తత తనిఖీలు చేపట్టారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉండనుంది. (ఏజెన్సీలు)