డిసెంబర్ 2 లోపు వికలాంగుల సంక్షేమ శాఖ విలీనం రద్దు చేయాలి: వీరయ్య ముత్తినేని
మాట మరచిన ప్రభుత్వం, మానవత్వం లేని పరిపాలన
వీరయ్య ముత్తినేని రాష్ట్ర చైర్మన్ కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం & స్టీరింగ్ కమిటీ చైర్మన్ వికలాంగుల జేఏసీ
హైదరాబూద్: వీరయ్య ముత్తి నేని మాట్లడతూ… ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల కలెక్టరేట్ ల ఎదుట వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వికలాంగుల సంక్షేమ శాఖ విలీనం రద్దు కోరుతూ దర్నా నిర్వహించి ఆయా కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించాము. 1981 నుండి స్వతంత్రంగా ఉన్న వికలాంగుల సంక్షేమ శాఖని 2016లో అన్యాక్రాంతంగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ లో విలీనం చేశారు.
ఇదీ వికలాంగుల హక్కుల చట్టం కి వ్యతిరేకం, హక్కుల ఉల్లంఘన అప్పటి నుండి గత సంవత్సరం వరకు కాంగ్రెస్ వికలాంగుల విభాగం , వికలాంగుల జేఏసీ అనేక ఉద్యమాలు చెప్పట్టి గత సంవత్సరం లో కమిషనరేట్ ముందు అర్ద నగ్న ధర్నా చేసిన సందర్భం లో ఆ శాఖ కమీషనర్ విలీనం రద్దు కీ హామీ ఇచ్చారు ఇప్పుడు మరిచారు.
శాఖా మంత్రి త్వరలోనే క్యాబినెట్ మీటింగ్ పెట్టీ రద్దు చేస్తామని పేపర్లో ప్రగల్బాలు పలికారు. ఆ మాటను తుంగలో తొక్కారు మేము అడుగుతున్నాం. మంత్రి గారు మా శాఖను ఎప్పుడు విలినము రద్దు చేస్తారు లేకపోతే రాష్ట్రాన్ని ఉద్యమాల తో అగ్ని గుండం చేస్తాం.