హైదరాబాద్ : ఈరోజు ఉదయం అంబర్పెట్ లోని ఫీవర్ హాస్పిటల్ చౌరస్తా లో హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోత రోహిత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి యూత్ కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి లు సురిభి గారి, ఖలీద్ అహ్మద్ గారి సమక్షంలో జెండా ను ఆవిష్కరించిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి.
అనంతరం అంబర్పేట్ లోని కె ఎస్ కె ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన యూత్ జోడో బూత్ జోడో సమావేశానికి భారీ ర్యాలీగా వెళ్లి పాల్గొన్నారు. హైదరాబాద్ లో బూత్ వారీగా యువకులను చైతన్య పరచాలని హైదరాబద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోత రోహిత్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో దశ దిశ నిర్దేశించిన రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో రాకేష్ యాదవ్, హరిధర్, ఎస్.వెంకట్, బి. నరేష్, ఎస్. సాయి తేజ్, సునీల్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.