తెలంగాణ బడ్జెట్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందన- “దున్నపోతుకు పాలు పిండినట్లుంది రాష్ట్ర బడ్జెట్”

Also Read-

  • అంచనాలు భారీ.. కేటాయింపులు, అమల్లో మాత్రం సారీ అని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
  • ఇదీ రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం
  • అట్టహాసంగా ప్రకటించిన గ్యారెంటీల అమలుపై ప్రజలు ఆశలు వదులుకునేలా పద్దుల రూపకల్పన.
  • అంకెల గారడీతో తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసింది.
  • పదేళ్లపాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అఖాతంలోకి నెట్టేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు రాష్ట్రాన్ని పెనంపైనుంచి పొయ్యిలోకి పడేసినట్లు చేసింది.
  • గతేడాది బడ్జెట్ పెట్టినపుడు.. తొలి ఏడాదే కదా అని తప్పించుకున్నారు. మరి 15 నెలలపాటు పాలించిన తర్వాత కూడా 6 గ్యారెంటీలు, 420 వాగ్దానాల అమలును పూర్తిగా విస్మరించారు.
  • వివిధ ప్రాజెక్టులకు భారీగా ప్రకటనలు చేసినా.. కేటాయింపులు, ఆచరణ శూన్యమని ఈ బడ్జెట్ ద్వారా స్పష్టమైంది.
  • అంకెల గారడీ ద్వారా మరోసారి తెలంగాణ ప్రజలను నిట్టనిలువునా మోసం చేసిన బడ్జెట్ ఇది.
  • ఎన్నికల హామీలపై ప్రజలు ఆశలు వదులుకోవాలని తెలంగాణ బడ్జెట్ నిరూపించింది.
  • ప్రభుత్వ ఆదాయం, రాబడిపై కనీస అవగాహన లేకుండా అంచనాలు రూపొందించారు.
  • 2024-25 బడ్జెట్ లో జీఎస్టీ ఆదాయాన్ని రూ.58,594 కోట్లుగా చూపించారు. కానీ సవరించిన అంచనాల్లో.. రూ.5వేల కోట్లు తగ్గించి.. రూ.53,665 కోట్లుగా వెల్లడించారు.
  • అంటే దాదాపు 8.5% శాతం జీఎస్టీ వసూళ్లు తగ్గాయి. దీనికి కారణాలు రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి.
  • 2025-26 సంవత్సరానికి గానూ రూ.59,704 కోట్ల జీఎస్టీ వసూళ్లు ఉంటాయని బడ్జెట్లో పేర్కొన్నారు. ఇందులో లెక్కలు పెంచి ఎంత రాశారో అర్థం కావడం లేదు.
  • రాష్ట్ర ప్రభుత్వం అంచనాలను మించి అత్యుత్సాహంతో లెక్కలను ప్రకటించింది.
  • రాష్ట్రంలో మద్యం వినియోగాన్ని పెంచి దాని ద్వారా ఆదాయం పెంచుకోవడంపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టడం దురదృష్టకరం.
  • 2024-25లో ఎక్సైజ్ టాక్స్ ద్వారా రూ.25,617 కోట్ల అంచనాలు ప్రకటించిన సర్కారుకు.. ఈసారి బడ్జెట్‌లో.. రూ.27,623 కోట్ల ఆదాయాన్ని ఎక్సైజ్ ద్వారా రావొచ్చని అంచనా వేస్తోంది.
  • తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రజలను మద్యానికి బానిసలు చేసి ప్రజల ఆర్థిక వనరులను కొల్లగొట్టాలనేది కాంగ్రెస్ సర్కారు ఆలోచన స్పష్టంగా కనబడుతోంది.
  • ఇలా ప్రతిచోటా అంచనాలను పెంచి రాష్ట్ర ఆదాయాన్ని దాదాపు 12% ఎక్కువగా చూపిస్తున్నారు.
  • రైతులను, యువతను, విద్యార్థులను, మహిళలను, వృద్ధులను, ఉద్యోగులను ఇలా ప్రతి వర్గాన్ని అత్యంత దారుణంగా మోసం చేస్తూనే ఉన్నారు.
  • నిరుద్యోగ భృతి గురించి మొత్తం బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా పేరుకైనా లేదు.
  • గత బడ్జెట్‌లో 60వేల కోట్ల అప్పులు తీసుకుంటామని చెప్పి.. లక్షన్నర కోట్ల అప్పులు తీసుకున్నారు. (స్పెషల్ పర్పస్ వెహికల్స్ పేరుతో తీసుకున్న రుణాలు కలుపుకుని)
  • ఇప్పుడు 74 వేల కోట్లు అని చెప్పారు. అంటే ఇది 2.25 లక్షల కోట్లు దాటిపోతుంది.
  • అప్పుల విషయంలో.. బీఆర్ఎస్ ప్రభుత్వం తీరును తలదన్నేలా.. కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది.
  • వ్యవసాయానికి 72,659 కోట్లు అని గత బడ్జెట్లో చెప్పారు. అందులోనే రైతు రుణమాఫీ యాడ్ చేశారు. కనీసం ఆ రుణమాఫీ కూడా పూర్తిగా అమలు చేయలేదు.
  • ఈసారి రుణమాఫీ ఊసు లేకుండానే.. వ్యవసాయ రంగానికి రూ.24,439 కోట్లు కేటాయించారు.
  • ఏ ఆకాంక్షలతోనైతే రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారో.. వారి ఆకాంక్షలను తుంగలో తొక్కారు.
  • కౌలు రైతులు, రైతు కూలీల సంగతి మరీ దారుణం. కౌలురైతులకు ఎకరానికి రూ.15వేలు, రైతు కూలీలకు ఎకరానికి రూ.12వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ తెలంగాణలో ఇంతవరకు ఏ ఒక్క రైతు కూలీకి, ఏ ఒక్క కౌలు రైతుకు.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
  • చెప్పింది చేయకుండా.. చేయనిది చేసినట్లు చెప్పుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు.
  • విద్యారంగానికి 2025-26 బడ్జెట్‌లో కేవలం.. 7.5% నిధులే (రూ.23,108 కోట్లు) కేటాయించారు.
  • కానీ ఎన్నికల మేనిఫెస్టోలో.. 15% నిధులు విద్యారంగానికి ఖర్చుచేస్తామనే హామీని అసెంబ్లీ సాక్షిగా తుంగలో తొక్కారు.
  • ఇది తెలంగాణ విద్యార్థులను నిట్టనిలువునా మోసం చేయడమే.
  • ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యాభరోసా కార్డు ఎక్కడకు పోయిందో బడ్జెట్ లో చెప్పలేదు.
  • ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కేటాయించే నిధుల్లోనూ కేటాయింపులు సగానికిపైగా తగ్గాయి.
  • హామీల్లో అన్నిరకాల పింఛన్లను రూ.4వేలకు పెంచి ఇస్తామని చెప్పి ఇంతవరకు కనీస పింఛన్లు కూడా ఇవ్వడం లేదు. ఈసారి కూడా వీటిపై ఊసులేదు. ఇది చాలా దారుణం.
  • రాష్ట్రంలో వైద్యం పడకేసింది. కనీస వసతుల్లేక గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయినా వైద్యరంగానికి బడ్జెట్ పెంచలేదు.
  • ఇది పేదలకు కనీస వైద్యం అందకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడటంగానే భావించాలి.
  • సమగ్ర సర్వే పేరిట.. బీసీల సంఖ్యను తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం.. బడ్జెట్ లోనూ వారిని నిట్టనిలువునా మోసం చేసింది.
  • ఏడాదికి 20వేల కోట్లతో ఐదేళ్లలో లక్షకోట్లు ఇస్తామని చెప్పినా.. అమలులో అతీగతీ లేదు.
  • వివిధ కార్పొరేషన్లకు కూడా నిధులను విడుదల చేయకుండా.. వాటిని పేరుగొప్ప ఊరు దిబ్బ అన్నట్లు మార్చారు.
  • మొత్తం 3 లక్షల 4 వేల కోట్ల బడ్జెట్‌లో..
  • 2.26 లక్షల కోట్ల బడ్జెట్ (74%) ఖర్చుగా.. (వేతనాలు, సబ్సిడీలు, ఇతర ఖర్చులు)
  • కేవలం రూ.36,504 కోట్లు (12%) మూలధన వ్యయంగా (మౌలికవసతులు, ఉద్యోగాలు, దీర్ఘకాల అభివృద్ధి ప్రాజెక్టుల మీద) ఖర్చు చేస్తున్నారు.
  • ఈ బడ్జెట్లో రాష్ట్రప్రభుత్వం 12% మాత్రమే అభివృద్ధికి కేటాయించడం శోచనీయం.
  • రాష్ట్ర అభివృద్ధి కుంటుపడితే, రాష్ట్ర ఆదాయం తగ్గుతుంది. ఆదాయం తగ్గితే రాష్ట్రం నష్టపోతోంది. దీని ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటాయి. రాష్ట్ర అభివృద్ధికి ఆగిపోతోంది.
  • గత బడ్జెట్ లో రెవెన్యూ అంచనాలకు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులకు ఏమాత్రం సంబంధం లేదని బడ్జెట్ నిరూపించింది.
  • అమలుకు నోచుకోని హామీలు ఇచ్చి, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. వాటిని అమలు చేయకుండా తప్పించుకుటోంది.
  • ప్రజాసంక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధిని విస్మరించిన ఈ బడ్జెట్ ను బీజేపీ పూర్తిగా ఖండిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X