కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా టెన్త్ విద్యార్థులకు సైకిళ్ల అందజేత
తొలిరోజు కరీంనగర్ టౌన్ టెన్త్ క్లాస్ విద్యార్ధినీ, విద్యార్థులందరికీ సైకిళ్లు అందజేయనున్న కేంద్ర మంత్రి
అంబేద్కర్ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు…
బండి సంజయ్ తోపాటు హాజరుకానున్న కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఉన్నతాధికారులు
నెలరోజుల్లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని టెన్త్ విద్యార్థులందరికీ సైకిళ్ల పంపిణీ పూర్తి
ప్రతి విద్యార్ధినీ, విద్యార్ధికి సైకిళ్లను అందజేసే బాధ్యత కలెక్టర్ ద్వారా విద్యాశాఖ అధికారులకు అప్పగింత
ప్రతి ఏటా బర్త్ డే సందర్భంగా విస్త్రత సేవా కార్యక్రమాలతో ప్రజాసేవకే అంకితమవుతున్న బండి సంజయ్
గతంలో ప్రభుత్వ ఆసుపత్రులకు మెడిసిన్స్, మెడికల్ ఎక్విప్ మెంట్స్, అంబులెన్స్, ఫ్రీజర్స్ సహా వైద్య పరికరాల అందజేత
రూ.కోట్ల విలువైన ఆధునాతన ఎక్విప్ మెంట్లను సైతం ఇటీవల అందించిన కేంద్ర మంత్రి
హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ వేదికగా మరో మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివే విద్యార్ధిని, విద్యార్థులందరికీ రేపటి నుండి ఉచితంగా సైకిళ్లను అందించనున్నారు. మొత్తం 20 వేల సైకిళ్లను పంపిణీ చేయాలని బండి సంజయ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు బ్రాండెడ్ సైకిల్ కంపెనీకి ఆర్డర్ కూడా ఇచ్చారు. సీఎస్సార్ (కార్పొరేట్ సోషల్ రెస్సాన్స్ బిలిటీ) ఫండ్స్ ను చెల్లించి ఈ మొత్తం సైకిళ్లను కొనుగోలు చేశారు. ఒక ప్రజా ప్రతినిధి తన నియోజకవర్గ పరిధిలో 20 వేల సైకిళ్లను పంపిణీ చేయడం ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదు. ఆ క్రెడిట్ బండి సంజయ్ కే దక్కబోతోంది.
ఈ సైకిళ్ల పంపిణీ ప్రారంభ కార్యక్రమానికి కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం వేదిక కాబోతోంది. ఇందుకోసం స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత కరీంనగర్ టౌన్ లో టెన్త్ చదువుతున్న విద్యార్ధిని, విద్యార్థులకు బండి సంజయ్ రేపు ఉదయం 11 గంటలకు తన చేతుల మీదుగా సైకిళ్లను అందజేయబోతున్నారు. మొత్తం 21 స్టాల్స్ ను ఏర్పాటు చేసి రంగు రంగుల బెలూన్లు, షామియానాలతో వాటిని అందంగా ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రితోపాటు జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, నగర పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంసహా పలువురు ఉన్నతాధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు హాజరుకానున్నారు.
మరోవైపు ప్రతి విద్యార్ధికి ఈ సైకిల్ ను అందించాలనే ఉద్దేశంతో సైకిళ్ల పంపిణీ బాధ్యతను జిల్లా కలెక్టర్ కు అప్పగించారు. కలెక్టర్ ద్వారా డీఈఓ, ఎంఈవో స్కూళ్ల వారీగా ఎంత మంది విద్యార్థులున్నారనే జాబతాను సిద్ధం చేసిన అధికారులు ఆ మేరకు సైకిళ్లను ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల వారీగా సైకిళ్లను పంపీణీ చేయనున్నారు. నెల రోజుల్లో ఈ సైకిళ్ల పంపిణీ పూర్తి చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ చదువుకునే ప్రతి విద్యార్ధినీ, విద్యార్ధికి ఈ సైకిల్ ను అందజేయాలని కలెక్టర్ ను కోరారు.
Also Read-
టెన్త్ విద్యార్థుల కష్టాలను తొలగించేందుకే సైకిళ్ల పంపిణీ…
ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పిల్లలు పేద కుటుంబం నుండి వచ్చిన వాళ్లే ఉంటారనే విషయం తెలిసిందే. తమ ఇంటి నుండి స్కూల్ దాకా వెళ్లడానికి తగిన రవాణా సౌకర్యాల్లేక, ఆటోలు, బస్సులు వెళ్లే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా టెన్త్ క్లాస్ విషయానికొచ్చే సరికి స్కూల్ వేళలు ముగిసిన తరువాత కూడా స్పెషల్ క్లాస్ లకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనివల్ల పొద్దుపోయేదాకా స్కూళ్లోనే ఉండాల్సి వస్తుంది. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని టెన్త్ బాలబాలికలకు రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారనే విషయం బండి సంజయ్ కుమార్ ద్రుష్టికి వచ్చింది. వేల రూపాయలు వెచ్చించి సైకిళ్లు కొనే స్తోమత ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలకు లేదని గ్రహించిన బండి సంజయ్ సీఎస్సార్ ఫండ్స్ ను సేకరించి 20 వేల సైకిళ్లను కొనుగోలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కానుక పేరుతో ప్రతి ఒక్కరినీ సైకిళ్లను పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు.
బండి రూట్ సపరేట్
వాస్తవానికి రాజకీయ నాయకులు తమ బర్త్ డే వస్తుందనగానే కేకులు కట్ చేయించడం, ఊరూవాడా సంబురాలు చేయడం, మందు పార్టీలు అరెంజ్ చేయడం నిత్యక్రుత్యంగా జరిగే తంతు. బండి సంజయ్ మాత్రం వీటికి భిన్నంగా గత కొన్నేళ్లుగా తన పుట్టిన రోజును సైతం పేద వర్గాలకు మరింత సేవ చేసేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా పేదలకు వైద్య, విద్యం అందని ద్రాక్షలా మారడంతో ఆయా రంగాల ద్వారా పేదలను ఆదుకునే విధంగా వైవిధ్యమైన సేవా కార్యక్రమాలను చేపడుతుండటం విశేషం.
ఏరియా ఆసుపత్రులకు రూ.5 కోట్ల విలువైన ఆధునాతన మెడికల్ ఎక్విప్ మెంట్స్ అందజేత
అట్లాగే ఇటీవల వేములవాడ, హుజూరాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట ఏరియా ఆసుపత్రుల్లో ఆధునాతన పరికరాల కొరతతో రోగులు ఇబ్బంది పడుతున్నారని, ఆర్దిక స్తోమత లేకపోవడంతో వివిధ రకాల టెస్ట్ ల కోసం ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించలేక తనువు చాలిస్తున్నారని తెలుసుకున్న బండి సంజయ్ దాదాపు రూ.5 కోట్ల రూపాయల సీఎస్సార్ ఫండ్స్ ను సేకరించి ఆయా ఆసుపత్రులకు అవసరమైన ఆధునాతనమైన మెడికల్ ఎక్విప్ మెంట్స్ ను అందించడం విశేషం.
వైద్య, విద్యా రంగాలపైనే ఫోకస్…
గతంలోనూ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోని ఆసుపత్రుల్లోనూ రోగులకు మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో తన సొంత ఖర్చుతో 2 కోట్ల విలువైన మెడికల్ ఎక్విప్ మెంట్ ను బండి సంజయ్ అందించారు. అంతకుముందు ‘సంజయ్ సురక్షా’ పేరుతో అంబులెన్స్ లను అందించారు. ఇవిగాకుండా మెడిసిన్స్, ఫ్రీజర్స్ సహా ఆసుపత్రులకు అవసరమైన మెడికల్ ఎక్విప్ మెంట్ ను సైతం అందించారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి రోగుల వద్దకు నేరుగా వెళ్లి పరామర్శించడమే కాకుండా అవసరమైన అన్ని రకాల మెడిసిన్స్, ఇంజక్షన్స్, గ్లౌజులు, మెడిసిన్స్ వంటివి అందించి అండగా తానున్నానంటూ భరోసా ఇస్తూ రోగులకు మనోధైర్యం నింపారు.
