हैदराबाद : दुबई में तेलंगाना के दो लोगों की निर्मम हत्या कर दी गई, जबकि एक अन्य गंभीर रूप से घायल हो गया। यह हत्या एक पाकिस्तानी नागरिक ने की है। दुबई में हुई इस वारदात के बाद पीड़ितों के परिवार ने कहा कि पाकिस्तानी नागरिक ने धार्मिक नारे लगाते हुए हमला किया। पीड़ित दुबई में एक बेकरी में काम करते थे।

मृतक अष्टपु प्रेमसागर और श्रीनिवास
केंद्रीय मंत्री जी किशन रेड्डी और बंडी संजय ने हत्याओं पर दुख व्यक्त करते हुए कहा कि उन्होंने विदेश मंत्री एस जयशंकर से बात की है और उनके पार्थिव शरीर को भारत लाने में मदद मांगी है। परिजनों ने बताया कि तीनों लोगों पर 11 अप्रैल को बेकरी में तलवार से हमला किया गया। इसमें निर्मल जिले के सोन गांव के अष्टपु प्रेमसागर अष्टपु प्रेमसागर और निजामाबाद के श्रीनिवास की मौत हो गई।

घायल देगाम सागर
श्रीनिवास को पत्नी मंजुला के दो बेटे- चंदू और सूर्या हैं। निजामाबाद के ही रहने वाले देगाम सागर नामक तीसरा व्यक्ति घायल हुआ है, जिसे उस्पताल में भर्ती कराया गया है। इस बीच उन्होंने कहा कि विदेश मंत्री ने उन्हें मदद का भरोसा दिया है। उन्होंने कहा कि विदेश मंत्रालय भी इस मामले में शीघ्र न्याय सुनिश्चित करने के लिए काम करेगा।
దుబాయ్‌లో తెలంగాణ వాసుల దారుణ హత్య
హైదరాబాద్ : బతుకుదెరువు కోసం దుబాయ్ కి వెళ్లిన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట కు చెందిన శ్రీనివాస్ తో పాటు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రేమ్ సాగర్ దారుణంగా హత్యకు గురయ్యారు. దుబాయ్ లో ఉన్న జిల్లా వాసుల సమాచారం మేరకు… జగిత్యాల జిల్లా ధర్మపురి కి చెందిన స్వర్గం శ్రీనివాస్ తో పాటు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రేమ్ సాగర్ దుబాయ్ లోని బేకరీలో పాకిస్తాన్ కు చెందిన యువకులతో కలిసి పని చేస్తున్నారు. నిజామాబాద్ నివాసి అయిన దెగాం సాగర్ అనే మూడవ వ్యక్తి గాయపడి ఆసుపత్రిలో చేరాడు.

ఈ క్రమంలో గత శుక్రవారం పాకిస్తాన్ చెందిన యువకుడు మతపరమైన నినాదాలు చేస్తూ కత్తితో భారతీయులపై దాడికి దిగాడు. ఈ దాడిలో శ్రీనివాస్, ప్రేమ్ సాగర్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడువగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడికి పాల్పడిన నిందితుడిని దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. కాగా శ్రీనివాస్ మృతితో స్వగ్రామమైన దమ్మన్నపేట లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా శ్రీనివాస్ కు భార్య మంజుల ఇద్దరు కొడుకులు చందు, సూర్యలు ఉన్నారు.
నిర్మల్ జిల్లా సోన్ మండలానికి చెందిన ప్రేమ్‌సాగర్ ఇరవై ఏళ్లుగా గల్ఫ్‌లో పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం దుబాయ్‌లోని మోడర్న్ బేకరీలో యంత్రం ఆపరేట్ చేసే పనిలో చేరాడు. ప్రేమ్‌సాగర్‌కు తల్లి లక్ష్మి, భార్య ప్రమీల (35), కూతుళ్లు విజ్ఞశ్రీ (9), సహస్ర(2) ఉన్నారు. పదిరోజుల క్రితమే ప్రేమ్‌సాగర్ నాన్నమ్మ ముత్తమ్మ (90) చనిపోయారు. ఆమె పెద్దకర్మ చేసిన శుక్రవారం రోజే ప్రేమ్‌సాగర్ హత్యకు గురయ్యాడు. ప్రేమ్‌సాగర్ మృతి వార్తను ఆయన కుటుంబసభ్యులకు చెప్పలేదు.
ప్రేమ్‌సాగర్ తన చిన్నకూతురు సహస్ర తల్లి కడుపులో ఉన్నప్పుడే దుబాయ్ వెళ్లాడు. తను పుట్టినప్పటి నుంచి గ్రామానికి రాలేదు. బిడ్డను చూడకుండానే ఆయన తనువు చాలించడం స్థానికులను కలచివేస్తోంది. కాగా, దుబాయ్‌లో మరణించిన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన స్వర్గం శ్రీనివాస్ (42)కు భార్య మంజుల, ఇద్దరు కుమారులు, తల్లి ఉన్నారు.
కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ హత్యలపై విచారం వ్యక్తం చేశారు మరియు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో మాట్లాడి వారి మృతదేహాలను భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి సహాయం కోరినట్లు చెప్పారు. ఏప్రిల్ 11న బేకరీలో ముగ్గురిపై కత్తితో దాడి జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.