హైదరాబాద్ : తెలంగాణ టీచర్స్ యూనియన్ మహబూబ్ నగర్ జిల్లా శాఖ క్యాలెండర్ ను మహబూబ్నగర్ శాసన సభ్యులు యెన్నెం శ్రీనివాస్ రెడ్డి, ముడా చైర్మన్ లక్షమన్ యాదవ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎం ఎల్ ఎ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొంటూ, ఉపాద్యాయులు పదవ తరగతి ఫలితాలలో జిల్లాని ముందు వరుసలో ఉండే విధంగా ప్రయత్నం చేయాలి పేర్కొన్నారు.
Also Read-
ఈ కార్యక్రమంలో టి టి యు జిల్లా అధ్యక్షులు జుర్రు నారాయణ యాదవ్, ప్రధాన కార్యదర్శి గుడిసె యాదయ్య, అసోసియేట్ అధ్యక్షులు జనార్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షులు రవికుమార్, జిల్లా కోశాధికారి విజయ్ మోహన్, జిల్లా కార్యదర్శులు బురాన్, నిరంజన్
ప్రచార కార్యదర్శి హన్మంతు, కార్యదర్శి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.