हैदराबाद: तेलंगाना राज्य परिवहन निगम (TSRTC) ने यात्रियों को खुशखबरी दी है। राजधानी बस के किराए से ही आप ई-गरुड़ में सफर कर सकते हैं। इन घटे हुए किरायों के साथ आपके पास एक महीने के लिए यात्रा करने की सुविधा है। मियापुर से विजयवाड़ा के लिए ई-गरुड़ का किराया 830 रुपये से घटाकर 760 रुपये और एमजीबीएस से विजयवाड़ा के लिए 780 रुपये से घटाकर 720 रुपये कर दिया गया है। मालूम हो कि हाल ही में टीएसआरटीसी ने वायु प्रदूषण को रोकने के लिए इलेक्ट्रिक एसी बसें शुरू की हैं।
ई इलेक्ट्रिक बसें हैदराबाद से विजयवाड़ा तक ई-गरुड़ के नाम से चल रही हैं। इस ऑफर की घोषणा नई बसों के लॉन्च के दौरान एक महीने के लिए की गई थी। मालूम हो कि मंगलवार को हैदराबाद-विजयवाड़ा रूट पर दस बसें चलाई गईं। टीएसआरटीसी ने इनमें से 50 बसों को चरणों में चलाने का फैसला किया है। बाकी बसों को इस साल के अंत तक लाने की योजना है। अगर सभी बसें सड़क पर आती हैं तो हर 20 मिनट में एक बस उपलब्ध हो जाएगी।
ई गरुड़ बसें हर दिन मियापुर से सुबह 6:25, 8:25, 10:25 है और फिर 18:05, 19:45, 21:45 बजे रवाा होगी। इसी क्रम में एमजीबीएस से 8:10, 10:10, 12:10, 19:50, 21:30, 23:30 बजे उपलब्ध रहेगी। दूसरी ओर विजयवाड़ा से 6:20, 8:00, 10:00, 18:40, 20:40, 22:40 बजे ई-गरुड़ बसें चलेगी।
पर्यावरण संरक्षण और प्रदूषण की रोकथाम के साथ-साथ लोगों को बेहतर और आरामदायक यात्रा उपलब्ध कराने के उद्देश्य से ‘ई-गरुड़’ बसों को लॉन्च किया गया है। ई इलेक्ट्रिक बसें 12 मीटर लंबी हैं और इनमें 41 सीटें उपलब्ध हैं। हर सीट के पास मोबाइल चार्जिंग की सुविधा उपलब्ध है। रीडिंग लैंप के साथ, व्हीकल ट्रैकिंग सिस्टम हर सीट के पास एक पैनिक बटन से लैस है। साथ ही इन बसों में तीन सीसीटीवी कैमरे भी लगाए गए हैं।
बस में सवार होने के बाद यात्रियों की गिनती के लिए एक स्वचालित यात्री काउंटर कैमरा भी उपलब्ध है। इस बस को रिवर्स करने में सक्षम बनाने के लिए एक रिवर्स पार्किंग असिस्टेंस कैमरा भी लगाया गया है। गंतव्यों के बारे में विवरण बस के आगे और पीछे एलईडी बोर्डों के साथ प्रदर्शित किए जाते हैं। बसों में फायर डिटेक्शन सप्रेशन सिस्टम भी है। एक सार्वजनिक उद्घोषणा प्रणाली भी है। ये बसें एक बार चार्ज करने पर 325 किलोमीटर तक का सफर तय कर सकती हैं।
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త, ఈ-గరుడ బస్సుల్లో ఛార్జీల తగ్గింపు
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రాజధాని బస్సు ఛార్జీతోనే ఈ-గరుడలో ప్రయాణించొచ్చని తెలిపింది. ఈ తగ్గించిన ఛార్జీలతో నెల రోజులపాటు ప్రయాణించే వెసులుబాటు ఉంది. మియాపూర్ నుంచి విజయవాడకు ఈ-గరుడ ఛార్జీని రూ.830 నుంచి రూ.760కి అలాగే ఎంజీబీఎస్ నుంచి విజయవాడకు రూ.780 నుంచి రూ.720కి తగ్గించినట్లు తెలిపారు. ఇటీవల తెలంగాణ ఆర్టీసీ వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ నుంచి విజయవాడకు ఈ-గరుడ పేరుతో ఈ ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నారు. కొత్త బస్సుల ప్రారంభం సందర్భంగా ఆ ఆఫర్‌ను నెల రోజులు ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్- విజయవాడ మార్గంలో పది బస్సులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ బస్సుల్ని దశలవారీగా 50 నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. మిగతా బస్సులను ఈ ఏడాది చివరి నాటికి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అన్ని బస్సులు రోడ్డెక్కితే వస్తే ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది.
ఈ గరుడ బస్సులు ప్రతి రోజూ మియాపూర్ నుంచి ఉదయం 6:25, 8:25, 10:25కు ఉన్నాయి ఆ తర్వాత 18:05, 19:45, 21:45 గంటలకు బయల్దేరతాయి అలాగే ఎంజీబీఎస్ నుంచి 8:10, 10:10, 12:10, 19:50, 21:30, 23:30 గంటలకు అందుబాటులో ఉన్నాయి. అటు విజయవాడ నుంచి చూస్తే.. 6:20, 8:00, 10:00, 18:40, 20:40, 22:40 గంటలకు ఈ-గరుడ బస్సులు నడుస్తాయి.
‘ఈ-గరుడ’ బస్సులతో పర్యావరణహితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించడమే లక్ష్యంగా ఈ బస్సుల్ని ప్రారంభించారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులు 12 మీటర్ల పొడవు ఉంటాయి 41 సీట్లు అందుబాటులో ఉంటాయి. ప్రతి సీటు దగ్గర మొబైల్ ఛార్జింగ్ సౌకర్యం ఉంటుంది. రీడింగ్ ల్యాంప్‌లతో పాటూ వెహికిల్ ట్రాకింగ్ సిస్టం ప్రతి సీటు దగ్గర పానిక్ బటన్ సదుపాయం ఉంది. అలాగే ఈ బస్సుల్లో మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
బస్సు ఎక్కిన తర్వాత ప్రయాణికులను లెక్కించేందేకు ఆటోమెటిక్ ప్యాసింజర్ కౌంటర్ కెమెరా కూడా అందుబాటులో ఉంటుంది. ఈ బస్సు రివర్స్ చేసేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఏర్పాటు చేశారు. బస్సుకు ముందు, వెనక ఎల్ఈడీ బోర్డులతో గమ్యస్థానాలకు సంబంధించి వివరాలు డిస్‌ప్లే అవుతాయి. బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం కూడా ఉంది. పబ్లిక్ అడ్రస్ సిస్టం కూడా ఉంది. ఇక ఈ బస్సులకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లొచ్చు. (ఏజెన్సీలు)