हैदराबाद: तेलंगाना EAMCET 2023 के नतीजे गुरुवार को जारी किए गए। मंत्री सबिता इंद्रा रेड्डी और उच्च शिक्षा परिषद के अध्यक्ष लिंबाद्री ने नतीजे जारी किए। JNTU फाइन आर्ट्स ऑडिटोरियम, मसाब टैंक में नतीजे जारी। एग्रीकल्चर और फार्मा में 86 फीसदी स्टूडेंट्स पास हुए हैं। जबकि इंजीनियरिंग विभाग में 80 फीसदी छात्र पास हुए हैं। The results will be available in the website https://eamcet.tsche.ac.in
पहले दस रैंक में तीन लड़कियां हैं। लड़कियों में वे 7वें, 8वें और 10वें स्थान पर रही हैं। रैंक पाने वालों में- सनपाला अनिरुद्ध (विशाखापट्टणम) ने पहला रैंक, मणिंधर रेड्डी (गुंटूर) ने दूसरा रैंक, उमेश वरुण (नंदीगाम) ने तीसरा रैंक, अभिनित मजेटी (हैदराबाद) ने चौथा रैंक, प्रमोद कुमार रेड्डी (ताडिपत्री) ने पांचवां रैंक, मरदना धीरज (विशाखापट्टणम) ने छठा रैंक, वड्डे शांविता (नलगोंडा) ने सातवां रैंक, बोइना संजना (श्रीकाकुलम) ने आठवां रैंक, नंद्याला प्रिंस ब्रनहम रेड्डी (नंद्याला) ने नौवां रैंक, मीसाला प्रणति श्रीजा (विजयनगरम) ने दसवां रैंक हासिल करने वालों में शामिल है।
कृषि व चिकित्सा में शीर्ष दस
इंजीनियरिंग टॉप टेन
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల, అగ్రికల్చర్, ఫార్మాలో 86 శాతం, ఇంజనీరింగ్ 80 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు గురువారం (మే 25న) రిలీజ్ చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. మాసబ్ ట్యాంకులోని జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ ఆడిటోరియంలో ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. అగ్రికల్చర్, ఫార్మాలో 86 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో 80 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. The results will be available in the website https://eamcet.tsche.ac.in
అగ్రికల్చర్ విభాగంలో 84 శాతం బాలురు, 87 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో బాలురు 79 శాతం, బాలికలు 82 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://eamcet.tsche.ac.in/లో చూడవచ్చు. అడ్మిషన్ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్‌ను త్వరలో విడుదలచేస్తామని మంత్రి చెప్పారు.
తొలి పది ర్యాంకుల్లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలో ఏడు, ఎనిమిది, పది ర్యాంకుల్లో నిలిచారు. సనపాల అనిరుధ్ (విశాఖపట్టణం) తొలి ర్యాంకు సాధించగా, మణింధర్ రెడ్డి(గుంటూరు) రెండో ర్యాంకు, ఉమేశ్ వరుణ్(నందిగామ) మూడో ర్యాంకు, అభిణిత్ మజేటి(హైదరాబాద్) నాలుగో ర్యాంకు, ప్రమోద్ కుమార్ రెడ్డి(తాడిపత్రి) ఐదో ర్యాంకు, మారదన ధీరజ్(విశాఖపట్టణం) ఆరో ర్యాంకు, వడ్డే శాన్విత(నల్లగొండ) ఏడో ర్యాంకు, బోయిన సంజన(శ్రీకాకుళం) ఎనిమిదో ర్యాంకు, నంద్యాల ప్రిన్స్ బ్రనహం రెడ్డి(నంద్యాల) తొమ్మిదో ర్యాంకు, మీసాల ప్రణతి శ్రీజ(విజయనగరం) పదో ర్యాంకు సాధించారు.
ఎంసెట్ పరీక్షలను ఈ నెల 10 నుంచి 14 వరకు నిర్వహించారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్‌కు 94.11 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంజినీరింగ్ పరీక్షకు 2,05,405 మంది దరఖాస్తు చేసుకోగా 1,95,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలకు 1,15,361 మంది అప్లయ్ చేసుకోగా 1,06,514 మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఇంజినీరింగ్ టాప్ టెన్ ర్యాంకర్లు
సనపాల అనిరుధ్ (విశాఖపట్టణం) తొలి ర్యాంకు సాధించగా, మణింధర్ రెడ్డి (గుంటూరు) రెండో ర్యాంకు, ఉమేశ్ వరుణ్ (నందిగామ) మూడో ర్యాంకు, అభిణిత్ మజేటి (హైదరాబాద్) నాలుగో ర్యాంకు, ప్రమోద్ కుమార్ రెడ్డి (తాడిపత్రి) ఐదో ర్యాంకు, మారదన ధీరజ్ (విశాఖపట్టణం) ఆరో ర్యాంకు, వడ్డే శాన్విత (నల్లగొండ) ఏడో ర్యాంకు, బోయిన సంజన (శ్రీకాకుళం) ఎనిమిదో ర్యాంకు, నంద్యాల ప్రిన్స్ బ్రనహం రెడ్డి (నంద్యాల) తొమ్మిదో ర్యాంకు, మీసాల ప్రణతి శ్రీజ (విజయనగరం) పదో ర్యాంకు సాధించారు.
అగ్రికల్చర్, మెడిసిన్ టాప్ టెన్ ర్యాంకర్లు
తొలి ర్యాంకు – బూరుగుపల్లి సత్య రాజ జశ్వంత్(ఈస్ట్ గోదావరి)
రెండో ర్యాంకు – నశిక వెంకట తేజ(చీరాల)
మూడో ర్యాంకు – సఫల్ లక్ష్మీ పసుపులేటి(రంగారెడ్డి)
నాలుగో ర్యాంకు – దుర్గంపూడి కార్తీకేయ రెడ్డి(గుంటూరు)
ఐదో ర్యాంకు – బోర వరుణ్ చక్రవర్తి(శ్రీకాకుళం)
ఆరో ర్యాంకు – దేవగుడి గురు శశిధర్ రెడ్డి(హైదరాబాద్)
ఏడో ర్యాంకు – వంగీపురం హర్షిల్ సాయి(నెల్లూరు)
ఎనిమిదో ర్యాంకు – దద్దనాల సాయి చిద్విలాస్ రెడ్డి(గుంటూరు)
తొమ్మిదో ర్యాంకు – గంధమనేని గిరి వర్షిత(అనంతపురం)
పదో ర్యాంకు – కోళ్లబత్తుల ప్రీతం సిద్ధార్థ్ (హైదరాబాద్) (ఏజెన్సీలు)