TPCC : యువ సంఘర్షణ సభ Photo Gallery మరియు…

హైదరాబాద్‌‌ : ఆ మధ్య వరంగల్‌‌లో రాహుల్​గాంధీ సమక్షంలో రైతు డిక్లరేషన్‌‌ ప్రకటించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోమవారం ప్రియాంకా సమక్షంలో హైదరాబాద్‌‌ కేంద్రంగా ‘యూత్ డిక్లరేషన్’ ప్రకటించింది. అమరవీరులు, ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకుంటామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని అందులో హామీ ఇచ్చింది.

యూత్‌‌ డిక్లరేషన్​ను పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి ప్రకటించగా… ప్రియాంకా తన ప్రసంగంలోనూ డిక్లరేషన్‌‌లోని అం శాలను ప్రస్తావించారు. డిక్లరేషన్‌‌లో ప్రకటించిన ప్రతి అంశాన్ని అమలు చేసి తీరుతామని, లేకపోతే అధికారం నుంచి దించేయాలని ఆమె అన్నారు.

-తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలో ప్రాణాలర్పించిన యువతీ, యువకులను ఉద్య మ అమరవీరులుగా, స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించడం. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం. 
-వారి కుటుంబ సభ్యుల్లో తల్లి/తండ్రి/భార్యకు నెలకు రూ. 25వేల  అమరవీరుల గౌరవ పెన్షన్  అందజేయడం.
-తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువతపై నమోదైన కేసులను ఎత్తివేయడంతో పాటు, జూ న్ 2న వారికి తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు అందజేయడం.
-కాంగ్రెస్‌‌ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. ఏటా జూన్​ 2న జాబ్​ క్యాలెండర్. సెప్టెంబర్​ 17 లోపు నియామకాలు.
-నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతి నెలా రూ.4వేలు.
-నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సెంట్రలైజ్డ్ ఆన్‌‌లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏర్పాటు చేసి, 7 జోన్లలో ఎంప్లాయ్​మెంట్ ఎక్స్చేంజ్‌‌, ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పడం.
-ప్రత్యేక గల్ఫ్ విభాగం ఏర్పాటుతో గల్ఫ్ ఏజెంట్ల నియంత్రణ, గల్ఫ్ దేశాల్లో మెరుగైన ఉపాధి కల్పనకు చర్యలు.
-పాలమూరు, తెలంగాణ, మహాత్మా గాంధీ, శాతవాహన యూనివర్సిటీలను ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలుగా మార్చడంతో పాటు, ఆదిలాబాద్, ఖమ్మం,  మెదక్ జిల్లాల్లో  నూతన ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీల ఏర్పాటు.
-బాసరలోని రాజీవ్ గాంధీ ట్రిబుల్‌‌ ఐటీ తరహాలో కొత్తగా 4 ట్రిబుల్‌‌ ఐటీల ఏర్పాటు.
-అమెరికాలోని ఐఎంజీ అకాడమీ తరహాలో అన్ని వసతులతో కూడిన ప్రపంచస్థాయి క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి, గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం.
-పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం వరంగల్, హైదరాబాద్​లో 2 విద్యాలయాలను ఏర్పాటు చేసి, 6వ తరగతి నుంచి పట్టభద్రులయ్యేవరకు నాణ్యమైన విద్యను అందించడం.
-18  ఏండ్లు పైబడిన చదువుకునే  ప్రతీ యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లను అందజేయడం.

‘తెలంగాణ మీకు నేల కాదు, తల్లి వంటిది’

హైదరాబాద్ : తెలంగాణ మీకు నేల కాదు.. తల్లి వంటిందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. సరూర్నగర్లో కాంగ్రెస్ యువ సంఘర్షణ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీ హాజరయ్యారు. జైబోలో తెలంగాణ అని ఆమె ప్రసంగం ప్రారంభించారు. ‘తెలంగాణ మీకు నేల కాదు.. తల్లి వంటిది’ అని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. సరూర్నగర్లో కాంగ్రెస్ నిర్వహించిన ‘ యువ సంఘర్షణ సభ’కు ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ‘ జైబోలో తెలంగాణ’ అని తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

‘‘తెలంగాణ మీకు తల్లి వంటిది. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ కోసం ఎందరో ఆత్మ బలిదానాలు చేశారు. మా కుటుంబం కూడా ఎన్నో త్యాగాలు చేసింది. ఆ బాధ ఏంటో మాకు తెలుసు. తెలంగాణ ఇవ్వాలనే నిర్ణయం అంత ఈజీగా చేసింది కాదు. తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రత్యేక రాష్ట్రం ఇవ్వలేదు.

ప్రజల ఆకాంక్షల మేరకే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. సోనియా తెలంగాణ ఇచ్చి 9 ఏళ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేర లేదు. ఆత్మబలిదానాలు వృధా కావద్దని సోనియా తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ కోసం అన్ని వర్గాలవారు పోరాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోంది. బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ తమ జాగీరులా భావిస్తున్నారు’’ అని ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు.

తెలంగాణ ఏర్పడ్డాక 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ప్రియాంక అన్నారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామన్నారు.. ఇప్పుడు ఏమైంది? అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు రూ. 4 వేలు భృతి ఇస్తామని ప్రకటించారు. యువతకు రూ. 10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

ఉద్యోగాలు లేక లక్షలాది మంది నిరుద్యోగులు అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరో పక్క పరీక్షల పేపర్లు లీక్ అవుతున్నాయని, పేపర్‌ లీక్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. 9 ఏళ్లలో ప్రభుత్వం ఒక్క యూనివర్సిటీ ఏర్పాటు చేయలేదని, ప్రైవేట్ యూనివర్సిటీలకు మాత్రం అనుమతులు ఇస్తున్నారని దుయ్యబట్టారు. బడ్జెట్‌లో విద్యకు కేటాయింపులు తగ్గించారని ధ్వజమెత్తారు. ప్రతి వ్యక్తిపై రూ.వేల అప్పులు మోపారని, కాంగ్రెస్ అబద్ధపు వాగ్ధానాలు చేయను.. ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తామని ప్రియాంకగాంధీ ప్రకటించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X