దళిత, గిరిజనులకు కాంగ్రెస్ అండ. వారికి కాంగ్రెస్ వెన్నంటి ఉంది.. టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్.
హైదరాబాద్ : గాంధీ భవన్ లో ఈ రోజు టీపీసీసీ ఎస్టి సెల్, కిసాన్ కాంగ్రెస్, ఫిషర్ మెన్ కాంగ్రెస్ అనుబంద సంఘాల కార్యవర్గాల సమావేశాలు జరిగాయి. కిసాన్ కాంగ్రెస్ సమావేశం చైర్మన్ అన్వేష్ రెడ్డి అధ్యక్షతన, ఎస్టీ సెల్ సమావేశం చైర్మన్ జగన్ లాల్ నాయక్ అధ్యక్షతన, ఫిషేర్మెన్ కాంగ్రెస్ సమావేశం చైర్మన్ మెట్టు సాయి కుమార్ అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఉపాధ్యక్షులు మల్లు రవి, చామల కిరణ్ రెడ్డి, రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంతో కృషి చేశాయని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు చేసి బడుగు, బలహీన, దళిత, గిరిజన వర్గాలను అభివృద్ధి బాటలో నడిపించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలదని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయా వర్గాలకు వివరించి కాంగ్రెస్ కు మద్దతు కూడగట్టాలని ఆయన పిలుపునిచ్చారు.