Subject: Loan waiver, call to action on KCR’s anti-farmer policies
It is said that when the farmer suffers, the kingdom does not progress. In Telangana, the death knell is constantly ringing in the houses of farmers. The farmer is getting stuck in the swamp of debt. The farmer’s corpse is hanging on the gallows in the heart of the village. The sight of the farmer lying lifeless next to the pesticide can on field bund is heart-wrenching.
Let us ask about the loan waiver:
Farmer brothers… If the actual situation is like this, BRS is out to play politics with the farmer. The party, which has kept farmers’ platforms as ornamental for years, has now decided to turn them into political platforms. BRS promised farm loan waiver of Rs 1 lakh if it comes to power in 2018, the farmer has been cheated as the government did not keep the promise. We have been waiting for the farmer loan waiver for many years.
As the last budget has also been introduced, it has become clear that there will be no more loan waiver. The number of farmers eligible for loan waiver in the state is literally 31 lakh till now. The government, which was supposed to waive off loans of Rs.20,000 crore, has cheated the farmers. Our farmer brothers who were fooled by KCR’s words and got stuck in the mire of debt are committing suicide in a state of disorientation.
Let us question about the payment of arrears for grain procurements:
You know that the KCR government, which boasts of buying every grain, has also opened the grain buying centers very late. Even though grain was brought to the centres after several hardships, it was not weighed for week. We have seen cases where many of our fellow farmers fell down on piles of grain and died of heart failure. In the name of Tarugu Talu, there was looting of 5 to 10 kilos, but the government did not respond. As tarpaulins were not even set up in the grain centres, we saw the suffering of famers’ tears due to rain. Even after weighing it, they made a delay in the name of shortage of lorries. The orders issued to deposit money in farmers’ accounts within 48 hours of grain collection were limited to papers. As on June 15, there are outstanding balances of Rs.6,800 crore.
Let’s question about Podu lands:
In the last nine years across the state, the government has grabbed lakhs of acres of assigned land from the poor, but has not been able to give land to the poor tribal and Dalit families. As the elections are approaching, the KCR government has started a rush on the Podu land pattas. While it was found that 11.50 lakh adivasis across the state were eligible for pattas, only four lakhs were given the pattas.
Farmer being cheated at every stage:
Farmer friends… these are only some instances of frauds committed by KCR to the farmer world. The farmers of the state were promised free fertilisers but that was not fulfilled. Farmers are promised that they will give 24 hours of free electricity but they are not giving even 10 hours. The log book at the sub stations is proof of this. We have seen incidents where the government has brought back the log books in all the sub-stations when the Congress party exposed this evidence. Crops are not given a support price. Money is not given on time for the given price.
The central and state governments are playing stealthy on grain purchases. KCR supported anti-farmer laws. The aid of Rs.10,000 per acre promised for the damaged crop in the recent hailstorm is not fulfilled even today. No crop insurance. If the farmer dies, he will be given compensation. But no effort is made to save the farmers. The agriculture minister himself claims to have given compensation to 80,000 people who died. According to NCRB records, Telangana ranks second in farmer suicides in the country. If the list has to be elaborated, KCR holds the all-time record for cheating farmers.
Let’s ask questions and lets confront them
BRS leaders are using the Rythu Vedikas as the platform for their politics. This is an opportunity to teach the traitors of farmers a befitting lesson. Be prepared to confront and ask questions on our issues in these meetings. Ask when the farmer loan waiver will be implemented. Ask when the money for the purchased grain will be deposited. Ask when the Podu land pattas will be given. Question why the assigned lands were taken back by the government. Question about the promise of free fertiliser supply. The last budget is also presented. If not confronted now, KCR and Co will not be found again.
That’s why… I am calling the Telangana farming community….Question BRS public representatives who come to Rythu Vedikas. Let them go only after taking written assurances from them about the solution for the problem. Let’s resolve that either the problems will be solved or BRS will be voted out of power. Let’s bring down this traitorous farmer government. I call upon the entire Telangana farming community to prepare for it. The Congress Party will be with you. Wake up farmer.
A. Revanth Reddy,
TPCC President,
MP – Malkajgiri
తెలంగాణ రైతు లోకానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
విషయం : రుణమాఫీ, కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలపై కార్యాచరణకు పిలుపు
ఎద్దు ఏడ్చిన ఎవుసం… రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదంటారు. తెలంగాణలో నిత్యం రైతుల ఇళ్లల్లో చావు డప్పులు మోగుతున్నాయి. అప్పుల ఊబిలో చిక్కి రైతు శల్యమవుతున్నాడు. ఊరి నడిబొడ్డున రైతు శవం ఉరికొయ్యకు వేలాడుతోంది. పొలంగట్టు పై పురుగుల మందు డబ్బా పక్కన రైతు నిర్జీవంగా పడి ఉన్న దృశ్యాలు మనసును కలచి వేస్తున్నాయి.
రుణమాఫీ ఏదని ప్రశ్నిద్దాం :
రైతు సోదరులారా… వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే, రైతుతో రాజకీయం చేయడానికి బీఆర్ఎస్ బయలు దేరింది. రైతు వేదికలను ఇన్నాళ్లు అలంకార ప్రాయంగా ఉంచిన ఆ పార్టీ ఇప్పుడు వాటిని రాజకీయ వేదికలుగా మార్చడానికి బరితెగించింది. 2018 లో అధికారంలోకి వస్తే రైతుకు రు. లక్ష రుణమాఫీ చేస్తామన్న కేసీఆర్ ప్రభుత్వం చివరికి మొండి చేయి చూపిన విషయం మీకు తెలుసు. రైతు రుణ మాఫీ కోసం ఇన్నాళ్లు మనం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశాం. చివరి బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టడం అయిపోయింది కనుక ఇక రుణమాఫీ చేయబోదన్న విషయం స్పష్టత వచ్చేసింది. రాష్ట్రంలో రుణమాఫీకి అర్హులైన రైతుల సంఖ్య ఇప్పటికి అక్షరాలా 31 లక్షల మంది. రూ.20 వేల కోట్ల మేర రుణాలు మాఫీ చేయాల్సిన ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసింది. కేసీఆర్ మాటలకు మోసపోయి అప్పుల ఊబిలో చిక్కిన మన సహచరులు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు.
ధాన్యం కొనుగోళ్ల బకాయిలు ఎప్పుడని ప్రశ్నిద్దాం :
ప్రతి గింజా కొంటామని ప్రగల్భాలు పలికే కేసీఆర్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను సైతం చాలా ఆలస్యంగా తెరిచిన విషయం మీకు తెలుసు. అష్టకష్టాలకోర్చి కేంద్రాలకు ధాన్యం తెచ్చినా వారం రోజుల వరకు కాంటా వేయలేదు. మన సహచర రైతులు చాలా మంది ధాన్యం కుప్పలపై పడిగాపులు పడి గుండె ఆగి చనిపోయిన సందర్బాలు చూశాం. తరుగు తాలు పేరుతో ఐదు నుండి పది కిలోల మేర దోపిడీ జరిగినా ప్రభుత్వం స్పందించలేదు. ధాన్యం కేంద్రాల్లో టార్పాలిన్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో వర్షానికి పంట నీళ్ల పాలైన కన్నీటి బాధలు చూశాం. తూకం వేసినా లారీల కొరత పేరుతో కాలయాపన చేశారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని జారీ చేసిన ఆదేశాలు కాగితాలకే పరిమితం అయ్యాయి. జూన్ 15 నాటికి రూ.6,800 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి.
పోడు భూముల పట్టాలపై ప్రశ్నిద్దాం :
రాష్ట్ర వ్యాప్తంగా గత తొమ్మిదేళ్లలో లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పేదల నుండి లాక్కున్న ప్రభుత్వం పేద గిరిజన, దళిత బిడ్డలకు భూములు ఇవ్వడానికి మాత్రం చేతులు రాలేదు. ఎన్నికలు సమీపిస్తుండటంతో పోడు భూముల పట్టాలపై కేసీఆర్ ప్రభుత్వం హడావుడి మొదలు పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 11.50 లక్షల మంది ఆదివాసీలు పోడు పట్టాలకు అర్హులని తేలితే కేవలం నాలుగు లక్షల మందికి పట్టాలు ఇచ్చినట్టు చేసి చేతులు దులుపుకుంది.
అన్నదాతకు అడుగడుగునా మోసమే :
రైతు మిత్రులారా… కేసీఆర్ రైతు లోకానికి చేసిన మోసాలలో ఇవి కొన్ని మాత్రమే. రాష్ట్రంలోని రైతులు అందరికి ఎరువులు ఫ్రీగా ఇస్తానని మాట తప్పారు. రైతుకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి కేవలం 10 గంటలు కూడా ఇవ్వడం లేదు. సబ్ స్టేషన్లలో లాగ్ బుక్ లే దీనికి సాక్ష్యం. కాంగ్రెస్ పార్టీ ఈ ఆధారాలను బయటపెట్టడంతో ఉలిక్కి పడిన ప్రభుత్వం అన్ని సబ్ స్టేషన్లలో లాగ్ బక్ లను వెనక్కు తెప్పించిన సంఘటనలు మనం చూశాం. పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వరు. ఇచ్చిన ధరకు డబ్బులు సకాలంలో ఇవ్వరు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర –రాష్ట్ర ప్రభుత్వాలు దొంగాట ఆడుతున్నాయి. రైతు వ్యతిరేక చట్టాలకు కేసీఆర్ మద్ధతిచ్చారు.
ఇటీవల వడగండ్ల వానకు నష్టపోయిన పంటకు ఎకరాకు రూ.10 వేలు సాయానికి అతీగతీ లేదు. పంటల బీమా లేదు. రైతు చనిపోతే పరిహారం ఇస్తానంటున్నాడు. బతికించే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. 80 వేల మంది చనిపోతే పరిహారం ఇచ్చామని వ్యవసాయ శాఖ మంత్రే చెబుతున్నాడు. ఎన్సీఆర్బీ రికార్డుల ప్రకారం రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే రైతులను మోసం చేసిన విషయంలో కేసీఆర్ ది ఆల్ టైం రికార్డు.
నిలదీద్దాం –నిలువునా పాతరేద్దాం.
రైతు వేదికల సాక్షిగా రాజకీయానికి బీఆర్ఎస్ నేతలు వస్తున్నారు. ఆ రైతు ద్రోహులకు బుద్ధి చెప్పడానికి ఇదొక సదవకాశం. ఈ సమావేశాల్లో మన సమస్యలపై నిలదేసేందుకు సిద్ధం కండి. రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో ప్రశ్నించండి. ధాన్యం డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో ప్రశ్నించండి. పోడు భూములకు పట్టాలు ఎప్పుడు ఇస్తారో ప్రశ్నించండి. అసైన్డ్ భూములను ఎందుకు లాక్కున్నారో నిలదీయండి. ఎరువులు ఫ్రీ అన్న మాట ఏమైందో నిలదీయండి. చివరి బడ్జెట్ కూడా అయిపోయింది. ఇప్పుడు నిలదీయకపోతే కేసీఆర్ అండ్ కో మళ్లీ దొరకరు.
అందుకే… తెలంగాణ రైతు లోకానికి పిలుపునిస్తున్నాను. రైతు వేదికల వద్దకు వచ్చే బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను గల్లాలు పట్టుకుని ప్రశ్నించండి. సమస్యల పరిష్కార కార్యాచరణకు లిఖిత పూర్వక హామీలు తీసుకున్న తర్వాతనే వారిని వదిలి పెట్టండి. సమస్యలు పరిష్కరించుడో… బీఆర్ఎస్ ను బొంద పెట్టుడో తేల్చేద్దాం. ఈ రైతు ద్రోహి ప్రభుత్వాన్ని నిలువునా పాతరేద్దాం. దానికి యావత్ తెలంగాణ రైతు లోకం సిద్ధం కావాలని పిలుపునిస్తున్నాను. మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. జాగో రైతన్నా.
ఎ. రేవంత్ రెడ్డి,
టీపీసీసీ అధ్యక్షుడు,
ఎంపీ –మల్కాజ్ గిరి
——————
బోనాల పండుగ శుభాకాంక్షలు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సత్కరించిన ఆలయ కమిటీ
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిగారి పాయింట్స్..
రాష్ట్ర ప్రజలకు, భక్తులకు బోనాల పండుగ శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీర్వాదంతో కోవిడ్, వరదల నుంచి తెలంగాణ బయటపడింది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది. ఫలక్ నామా నుంచి ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో మార్గాన్ని పొడగించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి 60 శాతం ఆదాయం హైదరాబాద్ నగరం నుంచే వస్తుంది. మెట్రో నగరంగా హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ఎంతో కృషి చేసింది. ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందేందుకు కాంగ్రెస్ సహకారం సంపూర్ణంగా ఉంటుంది.
లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సిఎల్పీ నేత భట్టి విక్రమార్క దంపతులు
కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ పండితులు. సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షులు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు కుటుంబ సమేతంగా లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారిని ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేయించారు. అమ్మవారికి భట్టి దంపతులు తమ మొక్కులను చెల్లించుకున్నారు.
అనంతరం ఆశీర్వచనం చేసి అమ్మవారి పసుపు, కుంకుమ, ప్రసాదాన్ని ఆలయ పండితులు అందజేశారు. సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు భట్టి విక్రమార్క దంపతులకు ఆలయ వద్ద ఘనంగా స్వాగతం పలికి శాలువా కప్పి సత్కరించారు. ఆలయానికి వచ్చిన భట్టి విక్రమార్కను బందోబస్తు పర్యవేక్షణకు విచ్చేసిన అడిషనల్ డీజి సుధీర్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు.