• బీఆర్ఎస్ నేతలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్
హైదరాబాద్ : ఇందిరమ్మ ఇండ్లు లేనిచోట మేము ఓట్లు అడగం.. డబుల్ బెడ్రూం ఇండ్లు లేనిచోట మీరు ఓట్లు అడగొద్దు అని బీఆర్ఎస్ నేతలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. హాత్ సే హాత్ జోడో యాత్ర అభియాన్ కార్యక్రమంలో భాగంగా కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని మద్దూరు, దౌల్తాబాద్, కొత్తపల్లి, గుండుమాల్, కోస్గి మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
हैदराबाद: टीपीसीसी के अध्यक्ष रेवंत रेड्डी ने बीआरएस नेताओं को चुनौती देते हुए कहा कि जहां इंदिरम्मा हाउस नहीं हैं वहां हम वोट नहीं मांगेंगे.. जहां डबल बेडरूम हाउस नहीं हैं वहां आपको वोट नहीं मांगना चाहिए। हाथ से हाथ जोड़ो यात्रा अभियान कार्यक्रम के तहत, उन्होंने कोडंगल निर्वाचन क्षेत्र के अंतर्गत मद्दुर, दौलताबाद, कोत्तापल्ली, गुंडूमाल और कोसगी मंडलों का दौरा किया। इस मौके पर उन्होंने पार्टी नेताओं और कार्यकर्ताओं को संबोधित किया।
“ఇందిరమ్మ ఇండ్లు లేనిచోట మేము ఓట్లు అడగం..ఏ ఊర్లో డబుల్ బెడ్రూం ఇవ్వలేదో ఆ ఊర్లో బీఆర్ఎస్ ఓట్లు అడగొద్దు. ఇందుకు డ్రామారావు సిద్ధమా అని సవాల్ విసురుతున్నా. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప.. ఈ ఐదేళ్లలో కొడంగల్ కు మీరు చేసిందేంటి? నాపై కోపంతో నారాయణపేట్ ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ పక్కన పెట్టారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే తప్ప కొడంగల్ కు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కొడంగల్ ప్రజలకు నా చేతనైన సాయం చేశాను. ఇప్పుడు కొడంగల్ లో పరిస్థితి మారింది. ఏ పంచాయితీ అయినా బీఆర్ఎస్ నేతలు లంచాలు వసూలు చేస్తున్నారు. ఎన్నికలప్పుడు కేసీఆర్ కాళ్లు మొక్కి అయినా సరే దౌల్తాబాద్ కు జూనియర్ కాలేజి తీసుకొస్తా అని హరీష్ రావు అన్నడు. మరి కాలేజీ ఎందుకు తెలీదు.. కేసీఆర్ కు కాళ్లు లేవా? పాలమూరు రంగారెడ్డి నీళ్లు ఇస్తానన్న కేసీఆర్ ఎనిమిదేళ్లుగా ఈ ప్రాంతానికి ఏమీ ఇవ్వలేదు. మాకెందుకు కృష్ణా నీళ్లు, రైల్వే లైను, జూనియర్ కాలేజీ రాలేదు. టీఆరెస్ కు ఓటు వేయడమే ఇక్కడి ప్రజలు చేసిన తప్పా?
కాంగ్రెస్ ను గెలిపించుకుందాం. కొడంగల్ ను అభివృద్ధి చేసుకుందాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొడంగల్ ను రెవెన్యూ డివిజన్ చేసుకుందాం. కొడంగల్ కు ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకుందాం. ప్రతీ పేదవాడికి డబుల్ బెడ్రూం ఇల్లు, దళితులకు మూడెకరాలు, ఇంటికో ఉద్యోగం, మైనారిటీ, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అని కేసీఆర్ ఎన్నో మాయమాటలు చెప్పి రెండు సార్లు అధికారంలోకి వచ్చాడు. బంగారు తెలంగాణ అని చెప్పి బొందలగడ్డ తెలంగాణ చేశాడు.
దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలు కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నాయి అని రేవంత్ రెడ్డి అన్నారు. “మోదీ, కేసీఆర్ పాలనలో ప్రజల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. ఎక్కడ చూసినా విద్యార్థులు, నిరుద్యోగుల ఆత్మహత్యలే. వారి పాలనలో మహిళలకు, మైనారిటీలకు రక్షణ లేదు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో దేశాన్ని ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. రాహుల్ సందేశాన్ని ప్రతీ గుండెకు, ప్రతీ ఇంటికి చేర్చేందుకు హాత్ సే హాత్ జోడో కార్యక్రమానికి ఏఐసీసీ పిలుపునిచింది. ఇంటింటికి కరపత్రాలు అందించి, హాత్ సే హాత్ జోడో స్టిక్కర్ అంటించి రాహుల్ సందేశాన్ని చేరవేయాలి” అని రేవంత్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపినిచ్చారు.
రాహుల్ గాంధీది దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం. ప్రాణాలకు తెగించి దేశ భవిష్యత్తు కోసం రాహుల్ పాదయాత్ర చేస్తున్నారు. కృష్ణా నదిపై రాహుల్ పాదయాత్రకు పాలమూరు బిడ్డలు స్వాగతం పలికిన విషయాన్ని గుర్తు చేశారు. రాహుల్ పాదయాత్ర ముగియడంతో మన బాధ్యత తీరలేదు. హాత్ సే హాత్ జోడో యాత్ర తో రాహుల్ సందేశాన్ని ప్రతీ ఇంటికి, ప్రతీ గుండెకు చేరవేయాలి. ఫిబ్రవరి 6 నుంచి టీపీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రం నలుమూలల పర్యటించడానికి సోనియా గాంధీ, ఖర్గే నాకు అవకాశం ఇచ్చారు. మీ ఆశీర్వాదం తీసుకుని పాదయాత్రకు వెళ్లడానికే ఇక్కడకు వచ్చా అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
We will not ask for votes where there are no Indiramma houses. You should don’t ask for votes where there are no double bedroom houses – TPCC president Revanth Reddy challenges BRS leaders
TPCC president Revanth Reddy challenged the BRS leaders that we will not ask for votes where there are no Indiramma houses. You should not ask for votes where there are no double bedroom houses. As part of Hath Se Hath Jodo Abhiyan program, the Congress leaders have visited Maddur, Daultabad, Kothapalli, Gundumal and Kosgi Mandals under Kodangal Constituency.
On this occasion he addressed party leaders and workers and said that “we will not ask for votes where there are no Indiramma houses.. and the BRS should not ask for votes in any town where there are no double bedroom houses. “I am challenging whether Drama Rao is ready for this.” He also recalled that apart from the development that happened when he was MLA, what has been done to Kodangal in these five years? He said that out of anger on him, KCR put aside the Narayanpet lift scheme and unless that project is completed, there will not be any water supply to Kodangal.
Revanth Reddy said that he did his best to help the people of Kodangal. Now the situation has changed in Kodangal. BRS leaders are collecting bribes in panchayats. Harish Rao during the elections said that he will bring a junior college to Daulatabad even by touching KCR’s feet. And why is there no college here? Does KCR have no legs? KCR who promised to give water to Palamuru Ranga Reddy has not given anything to this area for eight years. Why did we not get Krishna water, railway line, junior college? Is it the mistake of the people who votes for BRS? Let’s make Congress win and let’s develop Kodangal. Let’s make Kodangal a revenue division after Congress comes to power. Let’s bring an engineering college to Kodangal. He criticised that KCR came to power two times by giving many false promises like double bedroom house for every poor person, three acres for Dalits, job per household, 12 percent reservation for minorities and tribals. He promised of “Bangaru Telangana” (Golden Telangana) but made it Bondalagadda Telangana (Land of dead).
Revanth Reddy said that BJP and BRS parties in the country are creating rivalries between castes, religions and regions. As part of Hath Se Hath Jodo Abhiyan programme, they visited Maddur, Daultabad, Kothapally, Gundumal and Kosgi Mandals under Kodangal Constituency. On this occasion he addressed party leaders and workers and said that People’s lives have been destroyed under the rule of Modi and KCR. There are suicides of students and unemployed as seen everywhere. There is no protection for women and minorities under their rule. Rahul Gandhi undertook Bharat Jodo Yatra to bring the country together in such a dire situation. AICC has called for the Haath Se Haath Jodo program to bring Rahul’s message to every heart and every home. Revanth Reddy called upon the party workers to spread the message of Rahul by handing out pamphlets to every house and sticking a Hath Se Hath Jodo sticker.
Rahul Gandhi’s family sacrificed their lives for the country. Rahul is marching for the future of the country risking his life. He recalled that the children of Palamuru welcomed Rahul’s padayatra on the Krishna river. With the end of Rahul’s padayatra, our responsibility is not over. Rahul’s message should be taken to every home and every heart with Hath Se Hath Jodo Yatra. Sonia Gandhi and Kharge gave me an opportunity to tour all over the state as the president of TPCC from February 6. Revanth Reddy commented that he came here to take their blessings to initiate the padayatra.