हैदराबाद: जुबली हिल्स उपचुनाव में वोट ख़रीद शुरू हो गई है। प्रचार खत्म होने से पहले ही पार्टियों ने बूथवार मतदाताओं को पैसे बाँटने शुरू कर दिए हैं। सोचने की बात यह है कि एक प्रमुख पार्टी 3 हज़ार रुपये प्रति वोट बाँट रही है। कुछ समय पहले तक एक प्रमुख पार्टी के बूथ प्रभारी ने 2 हज़ार रुपये प्रति वोट देने का वादा किया था। लेकिन, इसकी जानकारी मिलने के बाद, एक अन्य प्रमुख पार्टी के बूथ प्रभारी ने इसमें 1000 रुपये की बढ़ोतरी कर दी है और 3 हज़ार रुपये प्रति वोट बाँट रहे हैं। आमतौर पर चुनाव प्रचार खत्म होने के बाद राजनीतिक दल बिना किसी गोपनीयता के मतदाताओं को पैसे और शराब बाँटते हैं। लेकिन इस बार उन्होंने यह पहले ही शुरू कर दिया है।
ऐसा लगता है कि चुनाव प्रचार खत्म होने के बाद पैसे बाँटने में रुकावटें आएंगी यह सोचकर पहले पैसे बांटने के लिए तैयार हो गये। एक तरफ़ पुलिस आने-जाने वालों की जांच कर रही है, तो दूसरी तरफ़ चुनाव दस्ते भी संबंधित पार्टियों के प्रमुख नेताओं के घरों की तलाशी ले रहे हैं। इसी बीच प्रचार के दौरान पैसे बाँटे जा रहे हैं। इसके लिए बूथवार कमेटियाँ पहले ही बना ली गई हैं। इन कमेटियों में स्थानीय कार्यकर्ताओं और ज़िलों के कार्यकर्ताओं के समन्वय के लिए प्रभारी नियुक्त किए गए हैं। इनके ज़रिए बूथवार संबंधित इलाकों, अपार्टमेंट और घरों में मतदाता पहचान प्रक्रिया शुरू की गई है। बूथ कमेटियों के सहयोग से संबंधित मतदाताओं को पैसे बाँटे जा रहे हैं। इसके साथ ही, चुनाव क्षेत्र में प्रचार अभियान और तेज़ हो गया है।
यूसुफगुडा की एक बस्ती में चार मंजिला इमारत में चार परिवार रहते थे, जिनमें से केवल दो परिवारों के ही एक बूथ पर वोट है। दो दिन पहले, एक प्रमुख पार्टी के बूथ प्रभारी ने परिवारों से मुलाकात की। उन्होंने मतदान से दो दिन पहले प्रति वोट 2,000 रुपये देने का वादा किया। उन्होंने ऑनलाइन यूपीआई भुगतान के लिए इस्तेमाल किए जा सकने वाले फ़ोन नंबर भी लिए। इसी बीच, शुक्रवार दोपहर एक अन्य प्रमुख पार्टी के बूथ प्रभारी ने परिवारों से मुलाकात की।
प्रत्येक मतदाता को 3,000 रुपये भी बाँटे गए। अगर किसी परिवार के चार वोट थे, तो उन्होंने 12,000 रुपये दिए है। अगर किसी दूसरे परिवार के दो वोट है, तो उन्होंने 6,000 रुपये दिए हैं। पैसे लेने के बाद उन्होंने नेताओं को आश्वासन दिया कि वे उनकी पार्टी को ही वोट देंगे। इस बीच, पता चला है कि उसी पार्टी की एक अन्य बूथ समिति ने रहमतनगर मंडल की एक बस्ती में प्रति वोट 2,500 रुपये दिए। इसके साथ ही, क्या मतदान से दो दिन पहले देने का वादा करने वाले एक अन्य दल के नेता 1,000 रुपये देंगे? जैसा कि उन्होंने पहले कहा था, क्या वे प्रति वोट 2,000 रुपये देंगे? क्या वे इसके ‘दर’ भी बढ़ाएँगे? यह देखना दिलचस्प हो गया है। ऐसा लगता है कि जो मतदाता शुरू में 2,000 रुपये देने का वादा करने वाली पार्टी की ओर झुके थे, अब जब दूसरी पार्टी 3,000 रुपये दे रही है, तो उन्होंने अपने वादे पर पुनर्विचार कर रही है। (तेलुगु दैनिक आंध्रज्योति से साभार)
Also Read-
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటుకు రూ.3 వేలు!
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓట్ల కొనుగోలు మొదలైంది. ప్రచార పర్వం ముగియక ముందే పార్టీలు బూత్‌ల వారీగా ఓటర్లకు డబ్బు పంపిణీ ప్రారంభించాయి. ఓ ప్రధాన పార్టీ ఏకంగా ఓటుకు రూ.3 వేల చొప్పున పంపిణీ చేస్తుండడం గమనార్హం. మొన్నటి వరకు ఓటుకు రూ.2 వేల చొప్పున ఇస్తామంటూ ఓ ప్రధాన పార్టీకి చెందిన బూత్ ఇన్చార్జి హామీ ఇచ్చారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మరో ప్రధాన పార్టీ బూత్ ఇన్చార్జి దానికి రూ.వెయ్యి పెంచి రూ.3 వేల చొప్పున పంచుతున్నారు. సాధారణంగా ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత రాజకీయ పార్టీలు గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లను కలిసి డబ్బు, మందు పంపిణీ చేస్తుంటాయి. కానీ, ఈసారి మాత్రం ముందుగానే మొదలుపెట్టేశాయి.
ప్రచారం ముగిశాక డబ్బు పంపిణీకి అడ్డంకులు వస్తాయనే ఉద్దేశంతో ముందుగానే అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఓవైపు పోలీసుల తనిఖీలు, మరోవైపు ఎన్నికల స్వ్కాడ్లు ఆయా పార్టీల ముఖ్యనేతల ఇళ్లలో సైతం సోదాలు చేస్తున్నాయి. దీంతో ప్రచా రం సాగుతుండగానే డబ్బు పంపిణీ కూడా కానిచ్చేస్తున్నారు. ఇందుకోసం బూత్‌ల వారీగా ఇప్పటికే కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో స్థానిక కార్యకర్తలతోపాటు జిల్లాల నుంచి వచ్చినవారు సమన్వయం చేసేలా ఇన్చార్జులను నియమించారు. వీరి ద్వారా బూత్‌ల వారీగా ఆయా ప్రాంతా ల్లో, అపార్ట్మెంట్లలో, ఇళ్లలో ఓటర్ల గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. బూత్ కమిటీలతో కలిసి ఆయా ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో ప్రచారం మరింత హీటెక్కింది.

యూసు్‌ఫగూడలోని ఓ బస్తీలో నాలుగంతస్తుల భవనంలో నాలుగు కుటుంబాలు ఉండగా, అందులో రెండు కుటుంబాలకు మాత్రమే ఓ బూత్‌లో ఓట్లున్నాయి. రెండు రోజుల క్రితం ఓ ప్రధాన పార్టీకి చెందిన బూత్ ఇన్చార్జి ఆ కుటుంబాలను కలిశారు. ఓటు కు రూ.2 వేల చొప్పున పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఇస్తామని మాట ఇచ్చారు. ఆన్లైన్లో యూపీఐ పేమెంట్‌కు అవకాశం కలిగిన ఫోన్ నంబర్లు సైతం తీసుకున్నారు. ఈలోపు శుక్రవారం మధ్యాహ్నం మరో ప్రధాన పార్టీకి చెందిన బూత్ ఇన్చార్జి ఆ కుటుంబాలను కలిశారు.
ఒక్కో ఓటరుకు రూ.3 వేల చొప్పున పంపిణీ కూడా చేశారు. ఒక కుటుంబంలో నాలుగు ఓట్లు ఉండగా రూ.12 వేలు ఇచ్చారు. మరో కుటుంబంలో రెండు ఓట్లు ఉంటే రూ.6 వేలు చెల్లించారు. తమ పార్టీకే ఓటు వేయాలని వారి నుంచి హామీ పొందారు. కాగా, అదే పార్టీకి చెందిన మరో బూత్ కమిటీ.. రహమత్‌నగర్ డివిజన్లోని ఓ బస్తీలో ఓటుకు రూ.2500 చొప్పున చెల్లించినట్లు తెలిసింది. దీంతో పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఇస్తామన్న మరో పార్టీ నేతలు ముందు చెప్పినట్లుగా ఓటుకు రూ.2 వేలే ఇస్తారా? వారు కూడా ‘రేటు’ పెంచుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. కానీ, తొలుత రూ.2 వేలు ఇస్తామన్న పార్టీవైపు మొగ్గుచూపిన ఓటర్లు.. మరో పార్టీ రూ.3 వేలు ఇస్తుండడంతో పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. (తెలుగు దినపత్రిక ఆంధ్ర జ్యోతి సౌజన్యంతో)
