हैदराबाद: तेलंगाना में सूरज आग बरसा रहा है। चिलचिलाती धूप से लोग तिलमिला रहे हैं। चिलचिलाती धूप और भीषण गर्मी से लोगों का दम घुट रहा है। सुबह 7 बजे से शाम 5 बजे तक सूरज अपना उग्र रूप दिखा रहे हैं। इस समय लोग बाहर निकलने के लिए डर रहे हैं। दोपहर के समय सभी सड़कें खाली दिखाई दे रहे हैं।
सोमवार को नलगोंडा जिले के त्रिपुराराम मंडल के माटूर में सबसे अधिक तापमान 45.5 डिग्री सेल्सियस दर्ज किया गया। मुलुगु जिले के मंगपेट में 45.1 डिग्री सेल्सियस, नलगोंडा जिले के दामरचेर्ला मंडल के तिम्मापुरम में 45.1 डिग्री सेल्सियस, मडुगुलपल्ली में 45 डिग्री और त्रिपुराराम मंडल के कामारेड्डीगुडेम में 44.9 डिग्री सेल्सियस दर्ज किया गया। खम्मम, गदवाल, निज़ामाबाद, मंचिरयाला, सूर्यापेट, जगित्याला और महबूबाबाद जिलों में तापमान 44 डिग्री से ऊपर दर्ज किया गया।
मौसम विभाग ने चेतावनी जारी की है कि आज से अगले महीने की 3 तारीख तक तेलंगाना में तेज धूप रहेगी और कई जिलों में गरम हवाओं का खतरा है। मुख्य रूप से महबूबनगर, खम्मम, करीमनगर, वरंगल, निज़ामाबाद और नलगोंडा के संयुक्त जिलों में गरम हवाएं चेलगी। इन जिलों के लिए येलो अलर्ट जारी किया गया है। तेलंगाना में शुष्क मौसम बनने से धूप की तीव्रता जारी रहने के आसार हैं।
संबंधित खबर:
तेज धूप के कारण लू लगने से एक ही दिन में पांच लोगों की मौत हो गई। मुलुगु जिले के बूटारम गांव के रामगिरी प्रेमलीला (70), कुमुराम भीम जिले के एल्कापल्ली गांव के चौधरी रवि (23), कागजनगर रेलवे स्टेशन के दूसरे प्लेटफॉर्म पर एक अज्ञात बूढ़ा व्यक्ति और शमशाबाद में भीख मांगने वाले अज्ञात व्यक्ति (42) की मौत हो गई। नलगोंडा जिले के अजमापुरा के कौशिक (12) की लू लगने से जान चली गई।
నిప్పులు కురిపిస్తున్న భానుడు
హైదరాబాద్ : తెలంగాణలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. భగ భగ మండే ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మండుతున్న ఎండలతో పాటు తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఈ సమయంలో బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
సోమవారం నల్గొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరులో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ములుగు జిల్లా మంగపేటలో 45.1 డిగ్రీల సెల్సియస్, నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం తిమ్మాపురంలో 45.1 డిగ్రీల సెల్సియస్, మాడుగులపల్లిలో 45 డిగ్రీలు, త్రిపురారం మండలం కామారెడ్డిగూడెంలో 44.9 డిగ్రీలు ఎండతీవ్రత నమోదైంది. ఖమ్మం, గద్వాల, నిజామాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, జగిత్యాల, మహబూబాబాద్ జిల్లాల్లో 44 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణలో నేటి నుంచి వచ్చే నెల 3 వరకు ఎండలు కొనసాగుతాయని, పలు జిల్లాలకు వడగాలుల ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని సూచించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడటంతో ఎండల తీవ్రత కొనసాగే అవకాశాలు ఉన్నాయని సూచించింది.
ఇక తీవ్రమెన ఎండలతో వడదెబ్బకు గురై ఒక్కరోజే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ములుగు జిల్లా బూటారం గ్రామానికి చెందిన రామగిరి ప్రేమలీల(70), కుమురం భీం జిల్లా ఎల్కపల్లి గ్రామానికిచెందిన చౌధరి రవి(23), కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్‌లోని రెండో ప్లాట్‌ఫాంపై గుర్తుతెలియని వృద్ధుడు, శంషాబాద్‌లో భిక్షాటన చేస్తూ జీవించే 45 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందారు. నల్గొండ జిల్లా అజ్మాపురానికి చెందిన కౌషిక్(12) వడ దెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. (ఏజెన్సీలు)