हैदराबाद: मालूम हो कि तेलंगाना के विकास और सीएम केसीआर के कल्याणकारी शासन को देखकर महाराष्ट्र से कई राजनीतिक दल, विभिन्न व्यवसायों के बुद्धिजीवी, सार्वजनिक संघ पहले से ही बीआरएस पार्टी में शामिल हो रहे हैं। इसी कड़ी में विभिन्न दलों की गतिशील महिला नेता बीआरएस पार्टी में शामिल होने के लिए आगे आ रही हैं।
హైదరాబాద్: మహారాష్ట్ర నుంచి ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు, వివిధ వృత్తులకు చెందిన మేధావి వర్గాలు, ప్రజాసంఘాలు, తెలంగాణ అభివృద్ధిని, సీఎం కేసీఆర్ ప్రజాసంక్షేమ పాలనను చూసి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సంగతి తెల్సిందే. ఇదే పరంపరలో చైతన్యవంతులైన పలు పార్టీలకు చెందిన మహిళా నేతలు బిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారు.
ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన పలు రాజకీయ పార్టీలకు చెందిన పలువురు మహిళా రాజకీయ నేతలు సహా ఇతర ముఖ్య నేతలు మంగళవారం నాడు బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా సంక్షేమం, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, మహిళా సాధికారత దిశగా ప్రభుత్వ పథకాలల్లో సింహభాగం మహిళలకే ప్రాధాన్యత కల్పించడం ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత దార్శనికతకు నిదర్శనమని మహారాష్ట్ర మహిళా నేతలు స్పష్టం చేశారు.
బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో… కారంజా కార్పోరేటర్ మాలతై సరోదే, మంగళాతాయి అడ్వికర్, బిజెపి మహిళా అఘాడి చీఫ్ సరికాతై ఠాకరే, శివసేన మహిళా అఘాడి అధ్యక్షురాలు వనితా తై ఢోక్, ఆశి తాలుకా అధ్యక్షురాలు ఆశాతాయి రావుత్, బిఎస్పీ పార్టీ సభ్యులు శిలాతై మెహరే , బెలోరా గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ చాండతై జాకే, కాంగ్రెస్ పార్టీ సభ్యులు లీలతై మన్హోర్, వాంఖడే గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ చాందతై, బిజెపి పార్టీ సభ్యులు తలతై కోరలే, గ్రామపంచాయతీ సభ్యులు మోనికా దిగ్రేస్, బచత్ గట్ అధ్యక్షులు ప్రగతి తాయడే, పార్డీ గ్రామపంచాయతీ సర్పంచ్ ప్రేమతాయి శిరకార్,
పార్డీ గ్రామపంచాయతీ శివసేన పార్ట ఉప సర్పంచ్ అంజుతాయి తిరడ్ కర్, భిషణ్ పూర్ సర్పంచ్ జ్యోతితాయి ధూదాత్, ఆష్టి డిఆర్ఎపి ప్రెసిడెంట్ జయశ్రీ ఫండే, బిజెపి సభ్యులు హర్షతాయి పాటిల్, సిఆర్పి గట్ 150 మహిళా అధ్యక్షురాలు సరళ ఫాట్ కర్, వడాళ్ళ గ్రామపంచాయతీ శివసేన పార్టీ సర్పంచ్ సీమాతాయి, మహిళా అఘాడీ అధ్యక్షురాలు ఆశాబాయి కాంగలే, మహిళా అఘాడీ సభ్యురాలు వర్షాతాయి మడావీ, కార్జా నగరపంచాయతీ కార్పోరేటర్ మాలాతాయి సరోదే తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాణిక్ కదం..తదితరులు పాల్గొన్నారు.
కాపుల సంక్షేమానికి భారాస పెద్దపీట: భారాస ఎపి అధ్యక్షులు డాక్టర్ తోట
ఇరుతెలుగు రాష్ట్రాల్లో అత్యధిక శాతం జనాభా ఉన్న కాపులు అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైయ్యారని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్ర శేఖర్ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని భారాస ఎపి క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తోట మాట్లాడుతూ వివిధ రాజాకీయపార్టిలు తెలగ, బలిజ, కాపు, ఒంటరిలనున్ తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని వదిలేస్తూ వారి సంక్షేమాన్ని విస్మరించాయని ఆవేదన వ్యక్తం చేసారు. టిడిపి, వైసిపి పార్టీలకు కాపులు కేవలం ఎన్నికల సమయంలోనే గుర్తుకోస్తారని ఎద్దేవా చేసారు. ఓటుబ్యాంక్ రాజాకీయాలకు పాల్పడే వారికి చెల్లు చీటీ పలకాలని కాపులకు పిలుపునిచ్చారు.
కాపుల సామాజిక,ఆర్ధిక, రాజకీయ రంగాల్లో పురోభి వృద్ది సాధించేందుకు భారాస కృషి చేస్తోందని స్పష్టం చేసారు. అన్ని వర్గాల సంక్షేమం భారాసతోనే సాధ్యమౌతోందని నొక్కి వక్కాణించారు. రానున్న ఎన్నికల్లో ఎపి లో భారాసా అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటి చేస్తోందని చెప్పారు. తెలంగాణ మోడల్ అభివృద్ధి ఎపిలో జరగాలంటే ప్రజలు భారాస నాయకత్వాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు. తొలుత కాపు సంఘాల సంక్షేమ సమితి అధ్యక్షులు మిరియాల చిన్న రాఘవులు తోట ను కలసి రంగారెడ్డి జిల్లా సేర్లింగంపల్లి లో కాపు సంక్షేమ భవన్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం తరపు నుండి ఐదు ఎకరాల స్థలం మంజూరయ్యేలా సహకరించాలని తోట చంద్ర శేఖర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం, మచిలీపట్టణం కు చెందిన మిరియాల చిన్న రాఘవులు గుంటూరు కు చెందిన మెహబూబ్ బాష, నూర్ ఖాన్ , అయ్యప్ప రెడ్డి , ఒంగోలు నుండి జాని ,శ్రీకాకుళం నుండి చంద్రశేఖర్ , పలు జిల్లాలకు చెందిన నేతలు తోట సమక్షంలో భారాస పార్టిలో చేరారు.