Hyderabad: తెలంగాణ ఉద్యమ కాలంలో వందలాది మంది విద్యార్థులు అమరులు అవ్వడానికి కారణమైన ఆంధ్రా కుట్రదారుల సంతానం ఇవాళ అమరవీరులను స్మరించుకోవడం, స్థూపానికి నివాళులు అర్పించడం, ఉద్యమ కుటుంబంపై మకిలి జల్లడం అత్యంత హేయమైన చర్యగా భావించి అమరవీరుల స్థూపాన్ని పసుపునీళ్లతో శుద్ధి చేసి పాలాభిషేకం చేసిన TRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందు.
ఇదే విధానం ఇంకా కొనసాగితే భవిష్యత్ లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అమరుల కుటుంబాలను ఆదుకున్నది, వారికి తగిన గుర్తింపునిచ్చింది KCR మాత్రమేనని, తెలంగాణ ఉద్యమకారులపట్ల, విద్యార్థులు, అమరుల పట్ల అత్యంత నిబద్ధత కలిగిన నాయకుడు కేసీఆర్ మాత్రమేనని ఇవన్నీ గుర్తించకుండా అవాకులు చవాకులు పేలితే గతంలో మానుకోట జరిగిన సంఘట పునరావృతం అవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శేషు, కృష్ణ, బొల్లు నాగరాజు, జంగయ్య మదన్, తరుణ్ సందీప్, కుమార్, తదితరులు పాల్గొన్నారు.