हैदराबाद : देश ऑनलाइन बेटिंग वेबसाइट्स शैतान से परेशान है। केंद्र सरकार ने गैर-कानूनी ऑनलाइन बेटिंग और सट्टा नेटवर्क को खत्म करने के लिए अपनी कार्रवाई तेज कर दी है। केंद्रीय इलेक्ट्रॉनिक्स और सूचना प्रौद्योगिकी मंत्रालय ने हाल ही में उन वेबसाइटों पर कार्रवाई की है जो युवाओं को गुमराह कर रही हैं और आर्थिक बर्बादी का कारण बन रही हैं।
शुक्रवार को केंद्र ने 242 गैर-कानूनी बेटिंग वेबसाइट्स और उनके एफिलिएट लिंक्स को ब्लॉक कर दिया है। अब तक देश में करीब 7,800 से 8,000 गैर-कानूनी गेमिंग प्लेटफॉर्म बंद किए जा चुके हैं। अक्टूबर 2025 से लागू हुए ‘ऑनलाइन गेमिंग एक्ट’ के मुताबिक के चलते ताजा 242 और वेबसाइटों को ब्लॉक कर दी है।

गौरतलब है कि बेटिंग ऐप्स खास तौर पर स्टूडेंट्स और बेरोज़गार युवाओं को टारगेट कर रहे हैं और आसानी से पैसे दिलाने का वादा करके कर्ज़ में डुबो रहे हैं। हालांकि ये सभी वेबसाइट विदेश से चलाई जाती हैं, लेकिन इनसे होने वाली इनकम बिना टैक्स के विदेश में ट्रांसफर की जा रही है। यह पता चला है कि केंद्र सरकार बेटिंग वेबसाइट और ऐप्स के प्रति बहुत सख्त रवैया अपना रही है क्योंकि बेटिंग में पैसे हारने की वजह से पैसे की तंगी के कारण आत्महत्या करने वालों की संख्या बढ़ रही है।
Also Read-
ఆన్‌లైన్ బెట్టింగ్ 242 సైట్లు బ్లాక్
హైదరాబాద్ : దేశాన్ని బెట్టింగ్ భూతం పట్టి పీడిస్తోంది. అక్రమంగా కొనసాగుతున్న ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ నెట్‌వర్క్‌లను తుదముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను మరింత ఉధృతం చేసింది. యువతను తప్పుదోవ పట్టిస్తూ, ఆర్థికంగా చితికిపోయేలా చేస్తున్న వెబ్‌సైట్లపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తాజాగా కొరఢా ఝళిపించింది.
ఇవాళ ఒక్కరోజే కేంద్రం 242 అక్రమ బెట్టింగ్ వెబ్‌సైట్లతో పాటు వాటి అనుబంధ లింకులను కూడా బ్లాక్ చేసింది. దేశంలో ఇప్పటి వరకు దాదాపు 7,800 నుంచి 8 వేల వరకు అక్రమ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లను నిలిపివేశారు. అక్టోబర్ 2025 నుంచి అమలులోకి వచ్చిన ‘ఆన్‌లైన్ గేమింగ్ చట్టం’ ప్రకారం తాజాగా మరో 242 వెబ్‌సైట్లను బ్లాక్ చేస్తూ చర్యలకు ఉపక్రమించారు.
కాగా, ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ విద్యార్థులు, నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని ఈజీ మనీ ఆశ చూపిస్తూ వారిని అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. సదరు వెబ్‌సైటలు అన్ని విదేశాల నుంచి నిర్వహిస్తుండగా.. వాటి ద్వారా వచ్చే ఆదాయం పన్ను పరిధిలోకి రాకుండా విదేశాలకు తరలిపోతోంది. బెట్టింగ్‌లో డబ్బు కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు పెరుగుతుండటంతో బెట్టింగ్ వెబ్‌సైట్లు, యాప్స్ పట్ల కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. (ఏజెన్సీలు)
