డా. బి. ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీ రిటైర్డ్ అధ్యాపకుల వార్షిక సర్వసభ్య సమావేశం
హైదరాబాద్ : విశ్వవిద్యాలయ సర్వతోముఖాభివృద్ధికి విశ్రాంత అధ్యాపకుల సూచనలు, సలహాలు చాలా అవసరమని, వారి అమూల్యమైన అనుభవాన్ని ఉపయోగించుకోవాలని యూనివర్సిటీ భావిస్తోందని డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. శనివారం యూనివర్సిటీలో విశ్రాంత అధ్యాపకుల వార్షిక సర్వ సభ్య సమావేశం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయం అనేక అభివృద్ధి కార్యక్రమాలాను చేపట్టిందని, యూనివర్సిటీ సర్వతోముఖాభివృద్ధికి రిటైర్డ్ టీచర్స్, గతంలో పాలనా అనుభవం ఉన్న వారి సలహాలు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. విశ్రాంత అధ్యాపకులకు ప్రత్యేకంగా యూనివర్సిటీలో ఓ ప్రత్యేక లాంజ్ ఏర్పాటు చేయనున్నట్లు, పరిశోధకులకు గైడ్ చేయడానికి, యూనివర్సిటీ పని పైన వచ్చే రిటైర్డ్ టీచర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా విశ్రాంత అధ్యాపకుల సంక్షేమ సంఘం విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అంబేద్కర్ విశ్వవిద్యాలయ మాజీ ఉప కులపతి ప్రొ. వి. ఎస్. ప్రసాద్; అసోసియేషన్ అధ్యక్షుడు ప్రొ. ఎస్. వి. రాజశేఖర్ రెడ్డి; కార్యదర్శి ప్రొ. సి. వెంకటయ్య; మాజీ రెక్టార్ ప్రొ. కుప్పుస్వామి రావు, మాజీ రిజిస్ట్రార్లు డా. జి. లక్ష్మా రెడ్డి; డా. పి. కృష్ణారావు; మాజీ డైరెక్టర్లు ప్రొ. రామయ్య, డా. పి. విజయలక్ష్మి పండిట్, డా. బనోత్ లాల్; ప్రొ. ఎం. ఎస్. హయత్; ప్రొ. సరస్వతీ రావు, మల్లా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read-
BRAOU RETIRED TEACHERS FELICITATED TO V C PROF. GHANTA CHAKRAPANI
Hyderabad : The annual general body meeting of Retired Faculty Teachers Welfare Association of Dr. B. R. Ambedkar Open University was held at the university on Saturday. Prof. Ghanta Chakrapani, Vice-Chancellor attended as the chief guest for the program. Prof. Chakrapani stated that the university believes the suggestions and advice of retired faculty members are essential for its overall development, and that it intends to utilize their invaluable experience.

The university has undertaken several development programs and that the advice of retired teachers and those with previous administrative experience is crucial for the all-round development of the university. He announced that a special lounge would be set up for retired faculty members at the university and suggested that retired teachers who come to guide researchers and contribute to the university’s work should make good use of this opportunity. Retired Teachers’ Welfare Association felicitated Prof.Ghanta Chakrapani.
On this occasion, Prof. V. S.Prasad, Former Vice-Chancellor, BRAOU; Retired Teachers Association President Prof. S. V. Rajashekar Reddy, Secretary Prof. C. Venkataiah; former Rector Prof. Kuppuswamy Rao; Former Registrars; Dr. G. Laxma Reddy, Dr. P. Krishna Rao; Prof. Ramayya, Dr. P. Vijayalakshmi Pandit, Dr. Banoth Lal; Prof. M.S. Hayat; Prof. Saraswati Rao, Malla Reddy, and others participated in the program.
