TGSRTC: 2024 సంవత్సరానికి రవాణా శాఖ ఎన్నో విజయాలతో ముగింపు

ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ, స్క్రాప్ పాలసీ లాంటి సంస్కరణలు

రోడ్డు నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు డ్రైవింగ్ లైసెన్స్ ల రద్దు

ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో మహిళా సాధికారత

ఇప్పటి వరకు 125.50 కోట్ల మంది మహిళలు, 4225 కోట్ల రూపాయల విలువైన ఉచిత ప్రయాణం చేసిన రికార్డు

ఆర్టీసీ లో ఎన్నో సంస్కరణలు కొత్త బస్సుల కొనుగోలు ..ఎలక్ట్రిక్ బస్సులకు ప్రాధాన్యత

హైదరాబాద్ : 2024 లో ప్రజా పాలన లో రవాణా శాఖ అత్యుత్తమ ప్రదర్శన కబర్చింది మంత్రి పొన్నం ప్రభాకర్ నిరంతర కృషి తో రవాణా శాఖ అన్ని రంగాల్లో విజయం సాధించింది. ఇక ఆర్టీసీ లో మహిళలకు ఉచితంగా ప్రయాణం రాష్ట్రం మహిళల ఆర్థిక వృద్ధి సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

రవాణా శాఖ నోటిఫై చేసిన ఉద్యోగాలు 113 AMVI పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వబడింది, అందులో 112 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు మరియు 97 మంది అభ్యర్థులకు నియామకాలు జారీ చేయబడ్డాయి. 15 పోస్ట్‌లు ధృవీకరణలో ఉన్నాయి. TSLPRB ద్వారా 63 ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబడింది. అందులో 54 మంది అభ్యర్థులు ఇప్పటికే ఫిబ్రవరి, 2024లో డిపార్ట్‌మెంట్‌లో చేరారు. TGPSC గ్రూప్-IV కేడర్ ద్వారా నవంబర్, 2024లో 10 మంది జూనియర్ అసిస్టెంట్లు ఎంపికయ్యారు. మార్చి 15, 2024 న, తెలంగాణ వాహనాల కోసం వాహన రిజిస్ట్రేషన్ కోడ్‌లో “TS” నుండి “TG”కి మార్పును రవాణా శాఖ ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో నమోదైన వాహనాలకు ప్రత్యేక గుర్తింపును కల్పించేందుకు ఈ మార్పును అమలు చేశారు. ఇప్పటివరకు 8,04,255 వాహనాలు Tg లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి.

ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ లో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏటా సగటున 5 లక్షల వాహనాలు చేరడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ వచ్చిన తరువాత నవంబర్ 16 నుండి డిసెంబర్ 30 వరకు 8497 ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయబడ్డాయి.ఒక రోజులో వాహనాలు ప్రయాణించే కిలోమీటర్ల సంఖ్య కూడా పెరుగుతూ ఏటా 6-8% అదనపు కార్బన్ ఫుట్ ప్రింట్‌కు దారి తీస్తోంది. ఇంధన వినియోగం కూడా సంవత్సరానికి 8-10% పెరుగుతూ అధిక నలుసు పదార్థం మరియు కార్బన్ డయాక్సైడ్‌కు దారి తీస్తుంది. వాహనాల నుంచి వెలువడే పర్టిక్యులేట్ మ్యాటర్ మరియు శబ్ద కాలుష్యం వల్ల వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి మరియు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి, తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసిన మరియు రిజిస్టర్ చేయబడిన వివిధ రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు 100% రోడ్డు పన్ను మరియు రిజిస్ట్రేషన్ ఫీజులను మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2సంవత్సరాల ప్రారంభ కాలానికి తెలంగాణలో 31.12.2026 వరకు ఈ పాలసీ అమలులో ఉండనుంది.సాధారణ పెట్రోల్/డీజిల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు వినియోగంపై సంవత్సరానికి నిర్వహణ మరియు ఇంధన వ్యయంలో మొత్తం అంచనా పొదుపు సంవత్సరానికి రూ.1,00,000 వరకు ఉంటుంది. రవాణా శాఖకు ఇప్పటి వరకు ప్రత్యేక లోగో లేదు. రవాణా శాఖకు ప్రత్యేకంగా కొత్త లోగోను మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో ప్రభుత్వం ఆమోదించింది.

తెలంగాణ ప్రభుత్వం వెహికల్ ఫ్లీట్ ఆధునీకరణ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో రిజిస్టర్డ్ వెహికల్స్ స్క్రాపింగ్ ఫెసిలిటీస్ (RVSF) మరియు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్ (ATS) అమలు ఉంటుంది. ఈ చొరవ జీవితాంతం-జీవిత వాహనాలను దశలవారీగా తొలగించడం, రహదారి భద్రతను మెరుగుపరచడం మరియు పరిశుభ్రమైన వాతావరణాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం ₹296 కోట్ల బడ్జెట్‌తో రాష్ట్రవ్యాప్తంగా ముప్పై-ఏడు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్‌లు (ATS) సౌకర్యాలు ఆమోదించబడ్డాయి, ఇది మన రహదారులపై పర్యావరణ సుస్థిరత మరియు భద్రత దిశగా ఒక ప్రధాన అడుగు. పాఠశాలల్లో పిల్లల ట్రాఫిక్ అవేర్‌నెస్ పార్కులు చిన్నవయసులోనే పిల్లలకు ట్రాఫిక్, రోడ్డు భద్రతా జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు విద్యాశాఖ సమన్వయంతో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్‌నెస్ పార్కులను ఏర్పాటు చేయాలని డిపార్ట్‌మెంట్ నిర్ణయించింది. చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్‌నెస్ పార్కుల ఏర్పాటుకు 52 పాఠశాలలు ముందుకు వచ్చాయి.పొల్యూషన్ టెస్టింగ్ స్టేషన్ల నెట్‌వర్కింగ్ – కాలుష్య పరీక్షా స్టేషన్ల ఆన్‌లైన్ నెట్‌వర్కింగ్ కొనసాగుతుంది మరియు స్టేషన్ల ద్వారా జారీ చేయబడిన PUC సర్టిఫికేట్లు RTA m-వాలెట్ అప్లికేషన్‌లో అందుబాటులో ఉన్నాయి మరియు డిసెంబర్-2023 నుండి 5,40,756 ఆన్‌లైన్ PUC సర్టిఫికెట్లు జారీ చేయబడ్డాయి.

వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ – మహిళా ప్రయాణీకుల భద్రత మరియు భద్రతను నిర్ధారించడానికి తెలంగాణలో వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ అమలు చేయబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్‌పోర్ట్ & నాన్ ట్రాన్స్‌పోర్ట్ ఆటో డ్రైవర్లు/ హోంగార్డులు/ వర్కింగ్ జర్నలిస్ట్‌లు” కోసం సామాజిక భద్రతా పథకం రూ. 5,00,000/- మాత్రమే (రూ. ఐదు లక్షలు మాత్రమే).ప్రమాద మరణ బీమా పథకం రూ. 5,00,000/- 13,11,072 ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్లు/ఆటో డ్రైవర్లను కవర్ చేస్తుంది. ఏప్రిల్ 1 నుండి ఇప్పటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్,రోడ్డు నిబంధనలు పాటించని వాహనదారులకు 4577 డ్రైవింగ్ లైసెన్స్‌లు సస్పెండ్ చేయబడ్డాయి. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు సులభంగా చేరుకోవడానికి ఇబ్రహీంపట్నం మరియు మణికొండలో రెండు కొత్త కార్యాలయాలు నిర్మించబడ్డాయి.

Also Read-

ఇక ఆర్టీసీ లో ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం జరిగింది.మ‌హిళల సాధికారిక‌తే లక్ష్యంగా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన ఈ ప‌థ‌కాన్ని పెద్ద ఎత్తున మహిళలు వినియోగించుకుంటున్నారు.ఇప్పటి వరకు 125.50 కోట్ల మంది మహిళామణులు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. రూ.4225.00 కోట్ల రవాణా ఖర్చులను ఆదా చేసుకున్నారు. మహాలక్ష్మి- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ స్కీంను విజయవంతంగా అమలు చేయడంలో ఆర్టీసీ ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారు. నిబద్దత, అంకితభావంతో పనిచేస్తూ.. ప్రశాంత వాతావరణంలో ఈ స్కీంను ఆర్టీసీ సిబ్బంది అమలు చేస్తున్నారు.

ఆర్టీసీ బస్సుల్లో ప్రస్తుతం ప్రతి రోజు సగటున 58 ల‌క్ష‌ల‌ మంది ప్రయాణిస్తున్నారు. మహాలక్ష్మి స్కీం ప్రారంభించకముందు 45 ల‌క్ష‌ల మంది రాకపోకలు సాగించేవారు. మహాలక్ష్మి- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ స్కీంను అమలు చేయడం వల్ల ప్రతి రోజు సగటున దాదాపు 12 ల‌క్ష‌ల‌ మంది ప్రయాణికులు పెరిగారు. గతంతో పోల్చితే 27 శాతం మంది అదనంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. మహాలక్ష్మి అమలుకు ముందు 40 శాతం మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తే.. ఇప్పుడా సంఖ్య 65 శాతానికి పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం మహిళలతో పాటు ఆర్టీసీకి ఆర్థికంగా మేలు చేస్తోంది. రవాణా చార్జీలను మహిళలు ఆదా చేసుకుంటున్నారు. జీరో టికెట్ల నగదును ఆర్టీసీకి ప్రభుత్వం ఎప్పటికప్పుడు రీయంబర్స్ చేస్తుండటంతో ఆర్టీసీ నష్టాల నుంచి లాభాల బాటల్లోకి వెళ్లింది.

కొత్త బస్సుల కొనుగోలు మహాలక్ష్మి పథకం అమలు వల్ల ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. ఆ రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ కొత్త బస్సులను కొనుగోలు చేస్తోంది. ఏడాది కాలంగా 1389 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చింది. మొదటిసారిగా హైదరాబాద్- శ్రీశైలం మార్గంలో 10 రాజధాని ఏసీ బస్సులను ప్రవేశపెట్టడం జరిగింది. హైదరాబాద్ నుంచి పలు జిల్లా కేంద్రాలకు 75 డీలక్స్ బస్సులను వాడకంలోకి తెచ్చింది. అలాగే, రాజధాని హైదరాబాద్ లో 125 మెట్రో డీలక్స్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి.

పర్యావరణహితమైన ప్రయాణ అనుభూతిని కలిగించడంతో పాటు కాలుష్య నివారణకు హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ లలో 251 ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ ప్రారంభించింది. హైదరాబాద్ లో353, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, నల్లగొండ, సూర్యాపేటలో 446 ఎలక్ట్రిక్ బస్సులను 2025 మార్చి నాటికి అందుబాటులోకి రానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో కాలుష్య నివారణ కోసం సిటీలో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులను నడిపేలా ప్లాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది. దశల వారీగా 2400 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయి.ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత నిబద్దతతో పనిచేస్తూ ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తోన్న ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న 2017 పీఆర్సీని ప్రకటించడం జరిగింది. 21 శాతం ఫిట్ మెంట్ తో కూడిన వేతనాన్ని ఈ ఏడాది మే నెల నుంచి ఉద్యోగులకు సంస్థ అందజేస్తోంది. ఈ పీఆర్సీ వల్ల 42057 ఉద్యోగులకు, 11014 రిటైర్డ్ ఉద్యోగులకు లబ్దిచేకూరింది.
ఆర్పీఎస్-2013 బాండ్ల పెండింగ్ బకాయిలు రూ.280 కోట్లను విడుదల చేసి.. ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లోఆ నగదును సంస్థ జమచేసింది. ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు రూ.కోటి ప్రమాద బీమాను సంస్థ అందజేస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా విధుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన అధికారులు, ఉద్యోగులను గుర్తించి.. 440 మందిని అవార్డులతో సత్కరించడం జరిగింది.

ఆర్టీసీ సిబ్బంది ఆరోగ్య సంరక్ష‌ణ‌కు పెద్ద పీట వేస్తూ హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ ఆస్పత్రిలో పూర్తిస్థాయి ఎంఆర్ఐ, సిటీ స్కాన్ సౌకర్యంతో పాటు ఎమర్జెన్సీ వార్డు, 24 గంటల ఫార్మసీ, ఫిజియోథెరఫి యూనిట్ కొత్తగా ఏర్పాటు. ఆర్టీసీలోని ప్రతి ఒక్క ఉద్యోగికి గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ పేరుతో వైద్య ప‌రీక్ష‌ల‌ను నిర్వహించి.. వారి హెల్త్ ప్రొఫైల్స్ ను ఆర్టీసీ రూపొందించింది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కొత్తగా డిస్పెన్సరీని ఏర్పాటు చేయడంతో పాటు 15 డిస్పెన్సరీలను అప్ గ్రేడ్ చేయడం జరిగింది. ఆర్టీసీలో దాదాపు 12 ఏళ్ల తర్వాత 3038 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చింది. ఈ పోస్టులకు సంబంధించిన నియామక ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఆయా పోస్టులను వీలైనంత త్వరగా ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఏడాదిలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన, మెడికల్ అన్ ఫిట్ అయిన 557 వేల మంది ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద సంస్థ ఉపాధి కల్పించింది. రెండు కొత్త డిపోల ఏర్పాటు పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు ములుగు జిల్లా ఏటూరునాగారంలో డిపోల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ట్రంలోని బస్ స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగింది. బస్ స్టేషన్లలో ప్రయాణికులు కూర్చోవడానికి వీలుగా 1075 సీట్ల ఏర్పాటుతో పాటు 552 ఫ్యాన్లు, 25 వాటర్ కూలర్లు, 46 మహిళా టాయిలెట్స్ బ్లాక్స్ ని నిర్మించడం జరిగింది. హుస్నాబాద్ బస్ స్టేషన్ ని సుందరీకరించడంతో పాటు జనగామ బస్ స్టేషన్ ని విస్తరించడం జరిగింది.

ప్రయాణికులకు రాయితీలు హైదరాబాద్ లో మెట్రో ఎక్స్ ప్రెస్ జనరల్ పాస్ దారులకు ఏసీ సర్వీసుల్లో 10 శాతం రాయితీని ఇవ్వడం జరిగింది.ఎయిర్ పోర్ట్ మార్గంలో తిరిగే పుష్పక్ బస్సుల్లో ముగ్గురు అంత కన్నా ఎక్కువ మంది ఒకే సారి కలిసి ప్రయాణిస్తే టికెట్ లో 10 శాతం రాయితీని అందిస్తోంది.మెట్రో డీలక్స్ పాస్ ను పునరుద్దరించడం జరిగింది. పెళ్లిళ్లు, ముహుర్తాలు, విహారయాత్రల కోసం బస్సులను బుక్ చేసుకునే బస్ ఆన్ కాంట్రాక్ట్(అద్దెకు బస్సులు) చార్జీలను సంస్థ తగ్గించింది. ఇతర అంశాలు ఏడాదిలో బస్ ఆన్ కాంట్రాక్ట్ కింద 15171 బస్సులను పెళ్లిళ్లు, ముహుర్తాలు, విహారయాత్రల కోసం అద్దెకు ప్రజలు బుకింగ్ చేసుకున్నారు. కార్గో సేవలను మరింతగా విస్తరించడంలో భాగంగా రాజధాని హైదరాబాద్ లో పార్శిళ్ల హోం డెలివరీ సదుపాయాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సాంకేతికత ద్వారా ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను సంస్థ అందిస్తోంది. అందులోభాగంగా బస్సుల కదలికలను పసిగట్టేందుకు 9320 బస్సులకు ట్రాకింగ్ సదుపాయాన్ని సంస్థ ఏర్పాటు చేసింది. ఆ బస్సులను గమ్యం యాప్ నకు అనుసంధానం చేయడం జరిగింది. ప్రసిద్దమైన మేడారం జాతరకు భక్తుల సౌకర్యార్థం 3515 ప్రత్యేక బస్సులను సంస్థ నడిపింది. 19 ల‌క్ష‌ల మంది భక్తులను సుర‌క్షితంగా గమ్యస్థానాలకు చేరవేసింది. శ్రీ రామనవమి సందర్భంగా 47,092 మంది భక్తులకు భద్రాద్రి రాములోరి తలంబ్రాలను లాజిస్టిక్స్ విభాగం అందజేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X