हैदराबाद : संक्रांति के मौके पर टीजाएसआरटीसी ने इस महीने 9 से 14 तारीख तक 6,000 स्पेशल बसें चलाईं। छह दिनों में करीब 2.4 करोड़ लोगों ने हैदराबाद से आंध्र प्रदेश और दूसरे राज्यों के साथ-साथ यात्रा की है। अधिकारियों ने बताया कि टीजीएसआरटीसी को करीब 100 करोड़ रुपये की इनकम हुई। इस बार एपीएसआरटीसी ने संक्रांति पर हैदराबाद के लिए बसें नहीं चलाईं। पिछले साल आंध्र प्रदेश से तेलंगाना के लिए 2,540 बसें चलाई गई थीं, लेकिन इस बार यह 200 बसों तक ही सीमित रहीं।

इसके साथ ही टीजीएसआरटीसी ने पिछले साल एपी के लिए 5,400 बसें चलाई थीं। इस बार 6,431 बसें चलाईं हैं। ध्यान देने वाली बात यह है कि उसने पिछले साल की तुलना में एक हजार से ज़्यादा एक्स्ट्रा बसें चलाईं। अधिकारियों का कहा है कि इस बार आय बढ़ी है। वहीं, संक्रांति के त्योहार पर अपने होमटाउन गए लोग रविवार और सोमवार को बड़ी संख्या में लौटेंगे। आरटीसी अधिकारियों ने बताया है कि इस महीने की 18 और 19 तारीख को भी स्पेशल बसें चलाई जाएंगी। इस बीच आरटीसी मैनेजमेंट ने एक बयान में कर्मचारियों को बधाई दी जिन्होंने यात्रियों को बिना किसी परेशानी के बसें चलाईं।
Also Read-
సంక్రాంతి స్పెషల్ బస్సులతో ఆర్టీసీకి రూ.100 కోట్ల ఆదాయం
హైదరాబాద్ : సంక్రాంతి సందర్భంగా ఈ నెల 9 నుంచి 14 వరకు తెలంగాణ ఆర్టీసీ 6 వేల స్పెషల్ బస్సులు నడిపింది. హైదరాబాద్ నుంచి ఏపీ, ఇతర రాష్ట్రాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆరు రోజుల పాటు సుమారు 2 కోట్ల 40 లక్షల మంది ప్రయాణించారు. తద్వారా సుమారు. రూ. 100 కోట్ల వరకు ఆర్టీసీకి ఆదాయం సమకూరినట్టు అధికారులు వెల్లడించారు. ఈసారి సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ హైదరాబాద్ కు బస్సులు నడపలేదు. గతేడాది ఏపీ నుంచి తెలంగాణకు 2,540 బస్సులు నడపగా, ఈసారి 200 బస్సులకే పరిమితమైంది.
దీంతో గతేడాది ఏపీకి 5,400 బస్సులు నడిపిన టీజీఆర్టీసీ ఈసారి 6, 431 బస్సులు నడిపింది. అంటే, గతేడాది కన్నా వెయ్యికి పైగా అదనపు బస్సులు నడపడం విశేషం. దీని ద్వారానే ఈసారి ఆదాయం పెరిగినట్లు అధికారులు చెప్తున్నారు. మరోవైపు సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లినవారు ఆది, సోమవారాల్లో పెద్దసంఖ్యలో తిరిగి రానున్నారు. దీంతో ఈ నెల 18, 19 తేదీల్లో కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. కాగా, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బస్సులను నడిపిన సిబ్బందిని యాజమాన్యం ఒక ప్రకటనలో అభినందించింది. (ఏజెన్సీలు)
