हैदराबाद: संपूर्ण चंद्र ग्रहण के चलते तेलंगाना के मंदिर बंद कर दिये गये हैं। वेमुलावाड़ा राजराजेश्वर स्वामी, यादगिरिगुट्टा लक्ष्मीनरसिंहस्वामी, भद्राद्री सीतारामचंद्र स्वामी मंदिर सहित तेलंगाना के सभी मंदिरों को नियमित कैंकर्य पूजा के बाद बंद कर दिये गये। ग्रहण दोपहर 2.39 से शाम 6.27 बजे तक जारी रहेगा। इसी क्रम में सुबह संबंधित मंदिरों के कपाट खोल दिए गए और नियमित कैंकर्य पूजा की गईं।
अधिकारियों ने ग्रहण के कारण अलसुबह 5.30 बजे वेमुलावाड़ा राजराजेश्वर स्वामी मंदिर को बंद कर दिया। इससे पहले, सुबह सुप्रभात सेवा और प्रथम काल पूजा के बाद मंदिर के द्वार बंद कर दिये। शाम को 6.18 बजे मंदिर फिर से खुल जाएगा और पूजा के बाद भक्तों को स्वामी के दर्शन करने की अनुमति दी जाएगी। मंदिर के अधिकारियों ने कहा कि कार्तिक पूर्णिमा के अवसर पर मंदिर परिसर में मशाल जलाई जाएगी और भगवान की महापूजा की जाएगी।
साल का आखिरी चंद्र ग्रहण अब से कुछ देर बाद शुरू होने वाला है। यह ग्रहण दोपहर 02 बजकर 39 मिनट से प्रारंभ हो जाएगा लेकिन देश में दिन होने के कारण चंद्र ग्रहण दिखाई नहीं देगा। भारतीय समय के अनुसार जैसे ही शाम को चंद्रोदय होगा ग्रहण दिखाई देने लगेगा। भारत में यह चंद्र ग्रहण शाम 05 बजकर 32 मिनट से शुरू होकर 06 बजकर 19 मिनट तक रहेगा। भारत में सबसे पहले पूर्वोत्तर राज्यों में पूर्ण चंद्र ग्रहण देखने को मिलेगा।
आज भारत में जब चंद्रमा उदित होगा तो ग्रहण लगा हुआ ही चंद्रमा उदित होगा। इससे पहले ग्रहण लगा हुआ चंद्रमा 31 जनवरी 2018 को दिखा था। यानि 4 साल 10 महीने बाद भारत में ग्रहण लगा चंद्रमा उदित होगा। भारत से अगला पूर्ण चंद्र ग्रहण 7 सितंबर 2025 को नजर आएगा। हालांकि इससे पहले अक्टूबर 2023 में, भारत में एक छोटा आंशिक ग्रहण भी देखा जा सकता है।
గ్రహణం కారణంగా వేకువ జామున ఉదయం 5.30 గంటలకు రాజన్న ఆలయాన్ని అధికారులు మూసివేశారు. అంతకు ముందు స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, ప్రాతః కాలపూజ అనంతరం ద్వారాలను మూసివేయగా.. సాయంత్రం 6.18 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరిచి పుణ్యహవచనం, సంప్రోక్షణ, నివేదన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా రాత్రి ఆలయ ఆవరణలో జ్వాలాతోరణం నిర్వహించడంతో పాటు స్వామివారి మహాపూజ నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ ఆలయ ద్వార బంధనం
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ప్రధాన ఆలయాన్ని మంగళవారం ఉదయం 8 గంటల 16 నిమిషాలకు అర్చకులు, అధికారులు నడుమ ద్వార బంధనం నిర్వహించారు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 3 గంటల 30 నిమిషాలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వయంభులకు నిజాభిషేకం, నిత్య కైంకర్యాలు, చేపట్టారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా జరుపబడే అన్నకూటోత్సవాన్ని అంతరంగీకంగా నిర్వహించి ఆలయ సాంప్రదాయబద్ధంగా ద్వారాన్ని మూసివేశారు.
భద్రాద్రి రామయ్య ఆలయం మూసివేత
గ్రహణం కారణంగా భద్రాద్రి సీతారామ చంద్రస్వామి ఆలయాన్ని అధికారులు, అర్చకులు మంగళవారం ఉదయం మూసివేశారు. అంతకు ముందు మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి 7.30 గంటల వరకు మూసే ఉంచనున్నారు. గ్రహణం అనంతరం ద్వారాలు తెరిచి సంప్రోక్షణ చేయనున్నారు. ఆ తర్వాత దేవతామూర్తులకు అభిషేకం నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం సుప్రభాత సేవ నుంచి భక్తులను దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
కాళేశ్వర ముకేశ్వర ఆలయం..
భూపాపల్లి జిల్లా కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాన్ని ఉదయం అధికారులు మూసివేశారు. అలాగే అనుబంధ ఆలయాల్లోనూ ద్వారబంధనం నిర్వహించారు. స్వామివారికి నిత్య కైంకర్యాల అనంతరం ఆలయాన్ని మూసివేశారు. బుధవారం సంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. మరో వైపు కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరిలో భక్తులు పుణ్య స్నానాలు చేశారు. అనంతరం గోదావరిలో కార్తీక దీపాలను వదిలారు. సుబ్రహ్మణేశ్వరస్వామి వారికి మొక్కులు చెల్లించారు.
బాసర జ్ఞాన సరస్వతీ ఆలయం..
చంద్రగ్రహణం సందర్భంగా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. గ్రహణం పూర్తయిన అనంతరం.. సాయంత్రం 7 గంటలకు ఆలయం తెరచి మహాసంపోక్షణ చేయనున్నారు. గ్రహణం సందర్భంగా అన్ని సేవలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు అధికారులు పేర్కొన్నారు. అంతకు ముందు వేకువ జామున ఆలయంలో అమ్మవారికి నిత్యపూజలు నిర్వహించారు.