हैदराबाद: तेलंगाना सरकार ने भारतीय पत्रकार संघ (आईजेयू) के अध्यक्ष और प्रजापक्षम के संपादक के श्रीनिवास रेड्डी को तेलंगाना मीडिया अकादमी का अध्यक्ष नियुक्त किया है। इस संबंध में सूचना एवं जनसंपर्क विशेष सचिव एम. हनुमंत राव ने रविवार को एक आदेश जारी किया। वह दो साल तक इस पद पर बने रहेंगे। श्रीनिवास रेड्डी ने पहले विशालांध्रा और ‘मन तेलंगाना’ पत्रिकाओं के संपादक के रूप में काम किया है।
वर्तमान में वह प्रजापक्षम पत्रिका के संपादक हैं। श्रीनिवास रेड्डी का जन्म 7 सितंबर 1949 को नलगोंडा जिले के पल्लेपहाड़ गांव में हुआ। उनके पिता ने तेलंगाना सशस्त्र संघर्ष में भाग लिया था। एक छात्र के रूप में श्रीनिवास रेड्डी हैदराबाद छात्र संघ (एचएसयू) और बाद में ऑल इंडिया स्टूडेंट्स फेडरेशन (एआईएसएफ) में सक्रिय रहे हैं। इस बीच, जब संयुक्त आंध्र प्रदेश में पहली बार प्रेस अकादमी का गठन हुआ, तब के. श्रीनिवास रेड्डी ने पहले अध्यक्ष के रूप में कार्य किया।
తెలంగాణ మీడియా అకాడమీ అధ్యక్షుడు కె శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడు, ప్రజాపక్షం ఎడిటర్ కె.శ్రీనివాస్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఐ అండ్ పీఆర్ స్పెషల్ సెక్రటరీ ఎం.హనుమంతరావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండేండ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. గతంలో విశాలాంధ్ర, ‘మన తెలంగాణ’ పత్రికలకు శ్రీనివాస్ రెడ్డి ఎడిటర్‌గా పనిచేశారు.
ప్రస్తుతం ప్రజా పక్షం పత్రికకు ఎడిటర్‌గా ఉన్నారు. 1949, సెప్టెంబర్ 7న శ్రీనివాస్ రెడ్డి నల్గొండ జిల్లాలోని పల్లెపహాడ్ గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. విద్యార్థి దశలోనే శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ (హెచ్‌ఎస్‌యూ), ఆ తర్వాత ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్‌ఎఫ్)లో చురుకుగా పనిచేశారు. కాగా, ఉమ్మడి ఏపీలో తొలిసారిగా ప్రెస్ అకాడమీ ఏర్పడినప్పుడు మొదటి చైర్మన్‌గా కె.శ్రీనివాస్ రెడ్డి సేవలందించారు. (ఏజెన్సీలు)