హైదరాబాద్ : బొగ్గుల కుంటలోని సారస్వత పరిషత్ భవన్ తెలంగాణ దారి దీపాలు సంపుటి -1 ని ఆవిష్కరించిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ప్రముఖ పారిశ్రామికవేత్త కీర్తిశేషులు సమ్మిడి వీరారెడ్డి గారి కోడలు, మాజీ కేంద్రమంత్రి, దివంగత నేత జైపాల్ రెడ్డి గారి కుమార్తె అరుణ గారికి మొదటి సంపుటి అందజేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి గారు.
ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ…
“తెలంగాణ రాష్ట్రములో సాహిత్య రంగం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు విశేషమైన కృషి చేశారు. ముఖ్యమంత్రి గారికి సాహిత్యం పైన ప్రత్యేక శ్రద్ధ ఉంది.ఆయన కొన్ని వేల పుస్తకాలు చదివారు.మేము కలిసిన ప్రతి సారి ఏదో ఒక విషయం మాకు చెబుతారు. మేము చాలా శ్రద్ధగా వింటాము.
తెలంగాణ రాష్ట్రములో జన్మించిన కవులు దాశరథీ, రావి నారాయణ రెడ్డి,సురవరం, ఇంకా ఎందరో ప్రపంచ ఖ్యాతిని పొందారు. రాష్ట్రములో ఉన్న కవులను వెలుగులోకి తీసుకువచ్చే విధంగ, అందరిని ఒక మార్గంలోకి తీసుకువచ్చేలా తెలంగాణ దారి దీపాలు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జలెండర్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను. ప్రస్తుత పరిస్థితులు అర్ధం చేసుకుని ప్రజలను చైతన్య పరిచే, రాష్టానికి మేలు చేసే రచనలు చేయాలని కవులను కోరుతున్నాం.
ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ప్రముఖ రచయిత అమ్మంగి వేణుగోపాల్ ,ఏం.వి గోన రెడ్డి (ప్రముఖ విద్యావేత్త), ఏం. మధుసూదన్ రెడ్డి(ప్రముఖ విద్యావేత్త),పోరెడ్డి రంగయ్య ,తేజ సాహిత్య సేవా సంస్థ అధ్యక్షుడు,గంట జలందర్ రెడ్డి,అధ్యక్షుడు, (తెలంగాణ భాష సాంస్కృతిక మండలి). తదితరులు పాల్గొన్నారు.”