హైదరాబాద్: శుక్రవారం రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించినారు.ఈ కార్యక్రమాని కన్నా ముందు సీనియర్ వాకర్ సభ్యుడు వేముల వీరస్వామి గారు జాతీయ పతాకాన్ని ఎగురవేసినారు. తెలంగాణ అమరవీరులకు జోహార్లు అంటూ. అమరవీరుల ఆశయ సాధన కొరకు పోరాడుదామని పెద్ద పెట్టున నినాదాలు చేసినారు. అమరవీరుల ఆత్మ శాంతించాలని 2 నిమిషాలు మౌనం పాటించారు.
సామాజిక తెలంగాణ కోసం మనమందరం మరో పోరాటం చేయాలని ప్రజలందరికి పిలుపిచ్చినారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు ప్రముఖ అడ్వకేట్ కర్రే లచ్చన్నను, M.S. పాషా, లకు పూల పూకే అందజేసి శాలువాతో ఘనంగా సన్మానము చేసినారు. ప్రజలందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో వాకర్ సభ్యుడు తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య వాకర్స్ నాయకులు తిరుపతి, N.R. శ్యామ్, పోటు సుధాకర్ రెడ్డి, చింతకింది రమేష్, జి సత్యనారాయణ మూర్తి, చంద్రయ్య, రామ్ రెడ్డి, ఆర్ రాజేష్, Ch. రాజేశ్వరరావు రాజేందర్ రెడ్డి, R. రాజేశం రాజయ్య, రహూఫ్, శ్రీరామ్, K.V. కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.