हैदराबाद : तेलंगाना कैबिनेट की बैठक का समय तय हो गया है. इस महीने की 18 तारीख को मुख्यमंत्री रेवंत रेड्डी की अध्यक्षता में सचिवालय में मंत्रिमंडल की बैठक होगी। चूंकि राज्य के बंटवारे की समयसीमा 2 जून को खत्म हो जाएगी। इस बैठक में मुख्य रूप से उन मुद्दों पर चर्चा होगी जो आंध्र प्रदेश और तेलंगाना के बीच दस साल से अनसुलझे हैं।
चुनाव के बाद 2 लाख रुपये किसानों की कर्जमाफी लागू करने पर चर्चा की जाएगा। यह भी खबर है कि सीएम रेवंत रेड्डी ने कैबिनेट बैठक में अगली खरीफ फसल योजना पर चर्चा करने का फैसला किया है। लोकसभा चुनाव प्रक्रिया समाप्त होने के साथ ही मुख्यमंत्री ने सार्वजनिक प्रशासन पर ध्यान केंद्रित किया।
बुधवार को मुख्यमंत्री ने मंत्री उत्तम कुमार रेड्डी और पोंगुलेटी श्रीनिवास रेड्डी के साथ विभिन्न विभागों के अधिकारियों से बात की। उन्होंने अनाज खरीदी की प्रक्रिया की जानकारी ली। उन्होंने किसानों की बिना किसी परेशानी के सुचारू खरीद सुनिश्चित करने के लिए कदम उठाने का आदेश दिया।
తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఫిక్స్
హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 18వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రి మండలి సమావేశం కానుంది. జూన్ రెండవ తేదీతో రాష్ట్ర విభజన డెడ్ లైన్ ముగియనుండటంతో పదేళ్ల పాటు ఏపీ, తెలంగాణ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.
ఎన్నికలు ముగియడంతో 2 లక్షల రైతు రుణమాఫీ అమలుపై చర్చించనున్నట్లు టాక్. వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపైన కేబినెట్ భేటీలో చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. కాగా, రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియటంతో ముఖ్యమంత్రి ప్రజా పాలనపై దృష్టి కేంద్రీకరించారు.
బుధవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. (ఏజెన్సీలు)