तेलंगाना भू भारती पोर्टल लॉन्च, मुख्यमंत्री ने जिलाधीशों को दी यह सलाह, తెలంగాణ “భూభారతి” పోర్టల్ ప్రారంభం

हैदराबाद: तेलंगाना सरकार की ओर से बड़ी महत्वाकांक्षाओं की “भूभारती” पोर्टल लॉन्च किया गया है। सीएम रेवंत रेड्डी ने हैदराबाद में शिल्पकला वेदिका में इस पोर्टल को लॉन्च किया। इस कार्यक्रम में डिप्टी सीएम भट्टी विक्रमार्क, मंत्री पोंगुलेटी श्रीनिवास रेड्डी और कई अन्य नेता शामिल थे।

प्रारंभ में इस पोर्टल को 3 मंडलों (सागर, तिरुमलगिरी और कीसरा) में पायलट आधार पर लागू किया जाएगा। 2 जून से इसे पूरे प्रदेश में तरह लागू कर दिया जाएगा। सीएम ने अधिकारियों को इस पोर्टल पर जनता से सुझाव लेने और आवश्यक संशोधन करने के निर्देश जारी किए हैं। मुख्यमंत्री ने पहले ही सभी जिलाधीशों को सलाह दी है कि हर जिलाधीश को भूभारती पोर्टल के बारे में जानकारी होनी चाहिए।

यह भी पढ़ें-

తెలంగాణ “భూభారతి” పోర్టల్ ప్రారంభం, ప్రతి జిల్లా కలెక్టర్ భూభారతి పోర్టల్ పై అవగాహన కలిగి ఉండాలి

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెడుతున్న “భూభారతి” పోర్టల్ ప్రారంభం అయింది. హైదరాబాద్ లోని శిల్పాకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పోర్టల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సహ పలువురు నేతలు పాల్గొన్నారు.

తొలుత ఈ పోర్టల్ ను 3 మండలాల్లో(సాగర్, తిరుమలగిరి, కీసరలో) ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు. ఈ పోర్టల్ పై ప్రజల నుంచి వచ్చే సూచనలు తీసుకొని, అవసరమైన సవరణలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రతి జిల్లా కలెక్టర్ భూభారతి పోర్టల్ పై అవగాహన కలిగి ఉండాలని ఇదివరకే సీఎం అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు.

ధరణి పోర్టల్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతి మండ‌లంలో స‌ద‌స్సు నిర్వహించాల‌ని, ప్రతి క‌లెక్టర్ మండ‌ల స్థాయి స‌ద‌స్సుల‌కు హాజ‌రై అక్కడ రైతులు, ప్రజ‌లు లేవ‌నెత్తే సందేహాల‌కు వారికి అర్ధమ‌య్యే భాష‌లో వివ‌రించి ప‌రిష్కారం చూపాల‌ని  సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రైతుల భూ స‌మ‌స్యల శాశ్వత ప‌రిష్కార‌మే ధ్యేయంగా ఎంతో అధ్యయ‌నంతో తీసుకొచ్చిన భూ భార‌తి చ‌ట్టాన్ని క్షేత్ర స్థాయికి స‌మర్థంగా తీసుకెళ్లాల‌ని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆయన నిర్ధేశించారు.

సోమవారం హైద‌రాబాద్‌లోని మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి సంస్థలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భూ భార‌తి, ఇందిర‌మ్మ ఇండ్లు, వేస‌వి తాగు నీటి ప్రణాళిక‌లపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. భూ భార‌తి, ఇందిర‌మ్మ ఇండ్లను తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామ‌ని, ఈ రెండింటిని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లడంలో క‌లెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాల‌ని ఆదేశించారు. భూ భార‌తి చ‌ట్టాన్ని క‌లెక్టర్లు స‌మ‌గ్రంగా అధ్యయ‌నం చేయాల‌ని, గ‌తంలో రెవెన్యూ స‌మ‌స్యల ప‌రిష్కారాన్ని ప‌ట్టించుకోకుండా రైతుల‌ను న్యాయ‌స్థానాల‌కు పంపార‌ని, భూభార‌తి చ‌ట్టంలో రెవెన్యూ యంత్రాగ‌మే ఆయా స‌మ‌స్యల ప‌రిష్కారానికి కృషి చేస్తుంద‌ని, అప్పీల్ వ్యవ‌స్థ ఉన్న విష‌యాన్ని రైతులు, ప్రజ‌ల‌కు వెల్లడించాల‌ని  తెలిపారు.

భూ భార‌తి పైలెట్ ప్రాజెక్టు స‌ద‌స్సుల‌ను నారాయ‌ణ‌పేట జిల్లా మ‌ద్దూర్‌, ఖ‌మ్మం జిల్లా నేల‌కొండ‌ప‌ల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట‌, ములుగు జిల్లా వెంక‌టాపూర్ మండ‌లాల్లో నిర్వహిస్తార‌ని, ఆయా మండ‌ల కేంద్రాల్లో స‌ద‌స్సుల‌కు క‌లెక్టర్లు క‌చ్చితంగా హాజ‌రుకావాల‌ని, ఆయా మండ‌లాల్లో ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బందితో స‌ద‌స్సులు నిర్వహించాల‌ని ఆదేశించారు. ఆయా స‌ద‌స్సుల‌కు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి , ఇత‌ర మంత్రులు హాజ‌రువుతార‌ని తెలిపారు. 

ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున గ్రామ స్థాయిలో ఇందిర‌మ్మ ఇండ్ల క‌మిటీలు ఆమోదం పొందిన జాబితాను మండ‌ల స్థాయి క‌మిటీలు ప‌రిశీలించాల‌ని సీఎం సూచించారు. ఆ క‌మిటీల ప‌రిశీల‌న అనంత‌రం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రికి పంపాల‌ని.. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆమోదించాకే ఇండ్ల  జాబితా ఖ‌రార‌వుతుంద‌ని స్పష్టం చేశారు. ఈ వ్యవ‌హారం స‌క్రమ ప‌ర్యవేక్షణ‌కు ప్రతి నియోజ‌క‌వ‌ర్గానికి ప్రత్యేక అధికారిని నియ‌మించాల‌ని ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శిని ఆదేశించారు. ఈ ప్రత్యేకాధికారి ఇందిర‌మ్మ క‌మిటీలు, మండ‌ల క‌మిటీలు, క‌లెక్టర్లు, ఇన్‌ఛార్జి మంత్రి మ‌ధ్య స‌మ‌న్వయ‌క‌ర్తగా ఉంటార‌ని చెప్పారు. 

వేస‌వి కాలంలో ఎక్కడా తాగు నీటి స‌మ‌స్య త‌లెత్తకుండా క‌లెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాల‌ని సూచించారు. తాగునీటి స‌ర‌ఫ‌రా విష‌యంలో నీటి పారుద‌ల శాఖ‌, తాగు నీటి స‌ర‌ఫ‌రా శాఖ‌, విద్యుత్ శాఖ స‌మ‌న్వయంతో ప‌ని చేయాల‌ని చెప్పారు. ప్రతి గ్రామంలో తాగునీటి వనరులు, సరఫరాపై పర్యవేక్షించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రివర్గ సహచరులు, ప్రభుత్వ సలహాదారులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ధరణి రాష్ట్ర రైతులకు ఒక పీడ కల లాంటిదని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ధరణి పోర్టల్‎తోనే తహసీల్దార్‎పై పెట్రోల్ పోసి హత్య చేసే పరిస్థితి తలెత్తిందన్నారు. గత 65 ఏండ్లుగా భూములకు సంబంధించిన వివరాలను రెవిన్యూ సిబ్బందే కాపాడారు.. కానీ గత బీఆర్ఎస్ పాలకులకు ధరణి వచ్చాకే రెవిన్యూ సిబ్బంది దొంగలుగా కనిపించారా అని ప్రశ్నించారు. 

బీఆర్ఎస్ ప్రభుత్వం రెవెన్యూ సిబ్బందిని దొంగలుగా చూపి వేలాది ఎకరాలను కొల్లగొట్టిందని ఆరోపించారు.  కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన భూచట్టాలను ఉన్నఫళంగా తొలగించి.. ధరణి పోర్టల్ తీసుకొచ్చారని.. ధరణితో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని అన్నారు. ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి పోర్టల్‎ను మాదాపూర్ శిల్పవేదికలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14) రోజున భూభారతి చట్టాన్ని 69 లక్షల కుటుంబాలకు అంకితం చేస్తున్నామని అన్నారు. తెలంగాణలో 100 ఏళ్లు భూముల కోసమే పోరాటం జరిగిందని.. నిజాంకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య పోరాటం చేశారని గుర్తు చేశారు. 

పాదయాత్ర సమయంలో రాష్ట్రంలోని భూసమస్యలు తెలుసుకున్నానని.. అప్పుడే ధరణి స్థానంలో కొత్త వ్యవస్థ తీసుకురావాలని నిర్ణయించుకున్నామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చాక ధరణిని బంగళాఖాతంలో వేస్తామని అనాడే చెప్పాం.. చెప్పినట్లుగానే అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‎ను తీసేసి దాని స్థానంలో భూభారతి తీసుకొచ్చామన్నారు. వివిధ రాష్ట్రాల్లో భూచట్టాలను పరిశీలించాకే భూభారతి చట్టం రూపొందించామని తెలిపారు. అన్ని వర్గాల నుంచి సలహాలు తీసుకున్నాకే పోర్టల్‎ను ప్రారంభించామన్నారు. 

పైలెట్ ప్రాజెక్ట్‎గా 4 మండలాలను తీసుకున్నామన్నారు. ప్రతీ గ్రామంలో రెవెన్యూ అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే రెవెన్యూ సిబ్బంది ముఖ్యం. రెవెన్యూ సిబ్బందిని మా ప్రభుత్వం 100 శాతం నమ్ముతుందని పేర్కొన్నారు. తాము చేసే తప్పులకు రెవెన్యూ సిబ్బందిని బలి చేసే సంస్కృతికి మేం వ్యతిరేకమని స్పష్టం చేశారు. గత సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖను ఎలా దూషించారో చూశాం. ఎలుక దూరిందని ఇల్లు తగలబెట్టే వ్యవహారం చేశారు. కానీ రెవెన్యూ సిబ్బంది ఆత్మగౌరవమే మా ఆత్మగౌరవమని అన్నారు. 

69 లక్షల మందికి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం, రెవెన్యూ శాఖ రెండు కళ్లలాంటివన్నారు. మనుషులకు ఆధార్ మాదిరిగా భూములకు భూదార్ అని అన్నారు. భూమి హద్దులు నిర్ణయించేంది రెవెన్యూ సిబ్బందేనని.. భవిష్యత్‎లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా రెవెన్యూ  సిబ్బంది చూసుకోవాలని సూచించారు. రైతులు పిలిచి భోజనం పెట్టి మాట్లాడేలా రెవెన్యూ సిబ్బంది తీరు ఉండాలని పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు ప్రతి మండలంలో పర్యటించాల్సిదేనన్నారు.

ఏప్రిల్ 14 తెలంగాణకు చారిత్రాత్మకమైన రోజు: భట్టి విక్రమార్క

ఏప్రిల్ 14 తెలంగాణకు చారిత్రాత్మకమైన రోజు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భూభూరతి పోర్టల్ ప్రారంభోత్సవంలో మాట్లాడిన భట్టి.. బాబా సాహెబ్ ఆలోచనలకు అనుగుణంగా భూభారతి తెచ్చామన్నారు. సామాన్య రైతులకు అర్తమయ్యేలా భూభారతి తీసుకొచ్చామన్నారు.  

గత బీఆర్ఎస్ సర్కార్ 24 లక్షల ఎకరాల హక్కులను  కాలరాసిందని ఆరోపించారు భట్టి.  ధరణి రైతుల పాలిటి శాపంగా మారింది.  రైతుల ఆత్మగౌరవాన్ని ధరణితో తాకట్టు పెట్టారు.   ధరణి సమస్యలను ప్రస్తావించినా గత ప్రభుత్వం పట్టించుకోలె. ధరణితో ఎంతో మంది రైతులు కన్నీళ్లు పెట్టారుధరణిని బంగాళాఖాతంలో వేస్తామని ఆనాడే చెప్పినం. భూమి అంటే నమ్మకం, ఆత్మ గౌరవం.  ప్రజలకు పనికొచ్చే చట్టం తెస్తామన్నాం..చెప్పినట్టు చేశాం. హక్కులు కోల్పోయిన రైతులకు హక్కులు కల్పించేందుకు భూ భారతి తెచ్చాం.  భూ భారతిని ప్రజలకు అంకితం చేస్తున్నం. 

పదేళ్లలో అసైన్ మెంట్ కమిటీలు లేవు. అసైన్ మెంట్ కమిటీని పునురుద్ధరిస్తాం.  ఏళ్లుగా సాగు చేసుకుంటున్న వారికి పట్టాలిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని ప్రజలు నమ్ముతున్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం చట్టాలు తెస్తుంది కానీ పాలకుల కోసం కాదు.  గత సర్కార్ హయాంలో తహసీల్దార్ పై పెట్రోల్ పోసి  రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.  భూమికి, రైతులకు విడదీయలేని  బంధం ఉంది ఆ బంధం అలాగే  ఉంచాలి.మొదటి సారి రైతులకు పట్టాలిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం  అని భట్టి అన్నారు.

దొరకు పొద్దున ఏ ఆలోచన వస్తే అదే రూల్: పొంగులేటి

దొరల కోసం నాడు కేసీఆర్ ధరణి తెచ్చారని మండిపడ్డారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. భూభారతి చట్టం పోర్టల్  ప్రారంభోత్సవం సందర్బంగా మాట్లాడిన ఆయన..  ధరణితో సామాన్యులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పారు. ఆనాటి దొరలు తెచ్చిన చట్టం వారి స్వార్థం కోసం తెచ్చారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్నం..వేశామన్నారు.  ధరణితో కంటిమీద కుణుకులేకుండా చేశారన్నారు. కేసీఆర్ పేరుకు ధరణి చట్టం తెచ్చారు కానీ రూల్స్ లేవన్నారు.  దొరకు తెల్లవారుజామున ఏ ఆలోచన వస్తే అదే రూల్ అని సెటైర్ వేశారు పొంగులేటి.  

వీఆర్వో, వీఆర్ ఏలు  చెప్పినట్టు వినలేదని కేసీఆర్  అందరినీ తొలగించారు. భూభారతి  చట్టంతో అధికారులు అహర్నిశలు కష్టపడ్డారు.  కలెక్టర్ల దగ్గరున్న కొన్ని పవర్స్ ను కింది అధికారులకు ఇచ్చాం. పలు రాష్ట్రాల్లో ఉన్న భూచట్టాలను  అధ్యయనం చేసి..చట్టాన్ని రూపొందించాం.  హరీశ్ రావులాంటి వాళ్లు ఇచ్చిన సలహాలు,సూచనలను కూడా భూభారతిలో  చేర్చాం. 2020 చట్టం చేయకుముందు రైతులు సంతోషంగా ఉన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్న రైతుల కోసం కష్టపడ్డాం. నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేస్తున్నాం. ఏప్రిల్ 17 నుంచి రెవెన్యూ అధికారులే మీ గ్రామాలకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తారు. మే మొదటి వారంలో ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా చేస్తాం. జూన్ 2 తర్వాత ప్రతి మండలానికి రెవెన్యూ అధికారులు మీ గ్రామాలకే వస్తారు. భూములున్న ఆసాములు,రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ చట్టం రూపొందించే అవకాశం వచ్చినందుకు నా జన్మ ధన్యమైంది. అని పొంగులేటి అన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X