हैदराबाद : भारतीय क्रिकेट के इतिहास में 29 जून हमेशा याद किया जाएगा। टी20 वर्ल्ड कप 2024 के फाइनल मैच में भारत ने साउथ अफ्रीका को रोमांचक मुकाबल में हरा दिया। यह मैच बारबाडोस के ब्रिजटाउन में स्थित केन्सिंगटन ओवल में खेला गया। वहीं, भारतीय टीम ने 17 साल के बाद टी20 वर्ल्ड कप का खिताब जीता। बता दें, टीम इंडिया ने इससे पहले साल 2013 में आईसीसी ट्रॉफी जीती थी।
भारतीय क्रिकेट टीम की इस जीत पर प्रधानमंत्री नरेंद्र मोदी ने खुशी जताई और कहा, “चैंपियंस! हमारी टीम स्टाइल में टी20 विश्व कप घर लाती है! हमें भारतीय क्रिकेट टीम पर गर्व है। यह मैच ऐतिहासिक है।”
पीएम मोदी ने आगे कहा, “टीम इंडिया को इस भव्य जीत के लिए सभी देशवासियों की तरफ से बहुत-बहुत बधाई। आज 140 करोड़ देशवासी आपके शानदार प्रदर्शन के लिए गर्व महसूस कर रहे हैं। खेल के मैदान में आपने वर्ल्डकप जीता लेकिन हिंदुस्तान के हर गांव, गली और मोहल्ले में आपने कोटि-कोटि देशवासियों का दिल जीत लिया।”
यह भी पढ़ें-
पीएम ने कहा, “ये टूर्नामेंट एक विशेष कारण से भी याद रखा जाएगा। इतने सारे देश, इतनी सारी टीमें और आपने एक भी मैच हारा नहीं, ये छोटी उपलब्धि नहीं है। आपने क्रिकेट जगत के हर महारथी और बॉल को खेला और शानदार विजय हासिल की। इसने आपके हौसले को बुलंद किया और इस टूर्नामेंट को भी रोचक बना दिया। मैं आपको बहुत-बहुत बधाई और शुभकामनाएं देता हूं।” (एजेंसियां)
140 కోట్ల మంది ప్రజలు గర్విస్తున్నారు: ప్రధాని మోడీ శుభాభినందనలు
హైదరాబాద్ : 17 ఏళ్ల సుధీర్ఘ విరామం తరువాత ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్, సౌతాఫ్రికాను మట్టికరిపించి టైటిల్‌ను చేసుకుంది. అయితే, భారత్ విజయం సాధించడం పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు అటు సోషల్ మీడియాలో ఇటు ప్రత్యక్షంగా మీడియా ముందుకు వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే టీమిండియా విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రపంచ అత్యుత్తమ టోర్నీలో భారత్ విజేతగా అవతరించడం చారిత్రాత్మకం అని అన్నారు. జట్టు సమష్టి ఆడి విజయం సాధించడం పట్ల దేశ ప్రజలందరి తరఫున శుభాభినందనలు తెలుపుతున్నానని వెల్లడించారు. భారత ఆటగాళ్ల అద్భుత ప్రదర్శన చూసి దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు గర్విస్తున్నారని అన్నారు.
టీ20 ప్రపంచకప్ విజేతలపై పవన్ కల్యాణ్ అభినందనలు
మరోవైపు, రెండవసారి టీ20 ప్రపంచకప్ గెలుచుకుని విశ్వ విజేతగా నిలచిన భారత జట్టుకు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నిలబెడుతూ రోహిత్ సేన సాధించిన విజయం చరిత్రలో నిలచిపోతుందన్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన తుది పోరులో జట్టు మొత్తం సమష్టిగా రాణించిన తీరు అద్భుతమని పవన్ పొగిడారు. ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఒత్తిడిని జయంచి సగర్వంగా ప్రపంచకప్ సాధించి పెట్టిన భారత క్రికెటర్లకు పేరు పేరునా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. టీమిండియా విజయం భవిష్యత్ తరాలకు స్ఫూర్తి దాయకమని కొనియాడారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ క్రికెట్‌లో భారత్ మరిన్ని విజయాలు అందుకోవాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. (ఏజెన్సీలు)