హైదరాబాద్: శాంతి, ఐక్యత, మతసామరస్యాలకు భాగ్యనగరం చిన్నంగా నిలుస్తుందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి మరియు ట్రిబ్యునల్ కోర్టు చైర్మన్ న్యాయమూర్తి జస్టిస్ వామన్ రావు అన్నారు. గురువారం సుబేదార్ అమీర్ అలీ ఖాన్ గ్లోబల్ పీస్ ఫౌండేషన్ అండ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ శాంతి దినోత్సవం పురస్కరించుకొని బొగ్గులుకుంటలోని తెలంగాణ సార్వతక పరిషత్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సదస్సులో ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.
సర్వమత ప్రజలు నివసిస్తున్న నగరం ప్రపంచ దేశాలకు ఆదర్శమని ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు మనందరికీ గర్వకారణం అన్నారు. అన్ని మతాలు శాంతి, సమైక్యతను బోధిస్తాయని శాంతి అహింస మార్గంలో గాంధీజీ ముందుకు సాగినట్లు గుర్తు చేశారు. అదే మార్గంలో నేటి యువత ముందు సాగాలన్నారు.
ప్రముఖ పర్యావరణ వేత్త ప్రొఫెసర్ కే. పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో శాంతి అభివృద్ధికి ఇచ్చే ప్రధాన్యం మరే అంశానికి ఇవ్వలేరని అన్నారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ ఫారుఖలిఖాన్, చైర్మను స్వాగత ఉపన్యాసం చేశారు .ఈ సందర్భంగా డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్, డాక్టర్ మేజర్ డి. జయసుధా, డాక్టర్ అత్తర్ అలీ, డాక్టర్ రవితేజ మరియు ప్రముఖ విద్యావేత్త శ్రీమతి జక్కుల విజ్ఞత తదితరులు పాల్గొని ప్రసంగించారు.
సదస్సులో శ్రీమతి రుమీల సీతారాం కుమార్, సయ్యద్ ఫరూక్ కమల్, డాక్టర్ చిన్మయి తమ్మారెడ్డి, శ్రీ వింజమురి వెంకటాచారి, మేజర్ ఎన్. సుప్రియ, మహమ్మద్ పర్వీజ్, షేక్ సయ్యద్అహ్మద్ తదితరులకు ఈ ఏడాది గ్లోబల్ పీస్ అవార్డు 2023 ను శాలువా, పూలమాల, ప్రశంసా పత్రం, జ్ఞాపకతో ముఖ్యఅతిథి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సెయింట్ ఫ్రాన్సిస్ డిగ్రీ అండ్ పీజీ మహిళా కళాశాల, సరోజినీ నాయుడు వనిత మహా విద్యాలయ, కస్తూరిబా గాంధీ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా కళాశాల, రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ ఎన్సిసి విద్యార్థినిలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆవుతులను అలరించాయి.