హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా పిన్నవారివీధిలో ఓ అసహ్యకరమైన ఘటన వెలుగు చూసింది. సందీప్ అనే ఎనిమిదేళ్ల విద్యార్థి గొంతులో చాక్లెట్ ఇరుక్కుపోవడంతో మృతి చెందాడు.
అందిన సమాచారం ప్రకారం.. విద్యార్థి సందీప్ తండ్రి కందన్ సింగ్ ఇటీవల ఆస్ట్రేలియా నుంచి చాక్లెట్లు తీసుకొచ్చాడు. కొడుకు సందీప్‌కి ఒక చాక్లెట్ ఇచ్చాడు. ఆ చాక్లెట్‌ని స్కూల్‌కి తీసుకెళ్లి తిన్నాడు సందీప్. చాక్లెట్ తిన్న కొద్దిసేపటికే ఊపిరాడక స్పృహతప్పి కిందపడిపోయాడు. దీంతో పాఠశాల సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సందీప్ మృతి చెందాడు.
చాక్లెట్ గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కందన్ సింగ్‌కు భార్య గీత, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరంతా పిన్నవారివీధిలోని శారద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నారు. రైల్వే గేటు సమీపంలోని శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. సందీప్ మృతితో పాఠశాలలో, కుటుంబ సభ్యుల్లో విషాదఛాయలు అలముకున్నాయి. (Agencies)