కోహెడ మార్కెట్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, 199 ఎకరాలలో నిర్మాణం

Hyderabad: కోహెడ మార్కెట్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అలగే కోహెడ మార్కెట్ నిర్మాణానికి తుది ప్రణాళిక సిద్దం చేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తర్వాత వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు.

నిరంజన్ రెడ్డి మాట్లతూ….”అంతర్జాతీయ మార్కెట్ ను ఆకర్షించేందుకు తగినట్లుగా మార్కెట్ లో వసతుల ఏర్పాటు. దేశంలో నంబర్ వన్ మార్కెట్ గా కోహెడ. ప్రపంచంలో అధునాతన మార్కెట్ గా ఉండబోతున్నది. 199 ఎకరాలలో మార్కెట్ నిర్మాణం. మార్కెట్ గోదాంలు, లాజిస్టిక్ పార్క్, ప్రాసెసింగ్ ప్లాంట్, వేస్ట్ మేనేజ్ మెంట్, రీ సైక్లింగ్ , సోలార్ సిస్టమ్ , కోల్డ్ స్టోరేజ్ గోదాంలు, రైపెనింగ్ చాంబర్లు, లేబర్, స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణం.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులకు అనుగుణంగా సదుపాయాలు. మామిడి ఎగుమతుల కోసం ప్రత్యేకంగా వేపర్ హీట్ ట్రీట్ మెంట్ ఇర్రాడియేషన్ ప్లాంట్. షెడ్ల నిర్మాణం, కమీషన్‌ ఏజెంట్ల దుకాణాలు, కోల్డ్‌ స్టోరేజీలు నిర్మాణం,రహదారుల నిర్మాణం, పార్కింగ్‌ సౌకర్యం ఏర్పాటు. మాస్టర్ ప్లాన్ ప్రకారం మార్కెట్ స్థలంలో జరగాల్సిన నిర్మాణాల పరిశీలన. ఔటర్ రింగ్ రోడ్, ట్రిపుల్ ఆర్ రహదారి ఏర్పాటు, అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులో ఉన్న నేపథ్యంలో కోహెడ మార్కెట్ కు అత్యంత ప్రాధాన్యం

భవిష్యత్ లో ఏటేటా ఉద్యాన పంటల ప్రాధాన్యం పెరగనున్నది. ప్రపంచ ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఉద్యాన పంటల విస్తరణ పెరుగుతున్నది. దానికి అనుగుణంగా జాతీయ, అంతర్జాతీయ ఎగుమతులకు కోహెడ మార్కెట్ కీలకంగా నిలవనున్నది. కోహెడ మార్కెట్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, డైరెక్టర్ లక్ష్మీబాయి గారు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు, అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు గారు, కార్యదర్శి నర్సింహారెడ్డి గారు తదితరులు.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X