हैदराबाद : नलगोंडा जिले के मुनुगोडु निर्वाचन क्षेत्र के मर्रिगुडा मंडल के शिवन्नागुडेम गांव निवासी और स्केलेटन फ्लोरोसिस पीड़ित अंशाल स्वामी का शनिवार को निधन हो गया। मंत्री केटीआर ने स्वामी के निधन पर शोक व्यक्त किया।
केटीआर ने शोक संदेश में कहा कि स्वामी न केवल लंबे समय से जिले में फ्लोरोसिस के खिलाफ लड़ रहे थे, बल्कि अपने साहस से कई लोगों को प्रेरित भी किया है।
उन्होंने ट्वीट कर स्वामी की आत्मा को शांति प्रदान करने की भगवान से प्रार्थना की है। मंत्री केटीआर ने अंशाल स्वामी के परिवार के सदस्यों के प्रति भी गहरी संवेदना व्यक्त की।
दुख की बात यह है कि एक डोनर की ओर से दिये गये इलेक्ट्रिक मोटरसाइकिल से स्वामी गिर गया। घायल स्वामी की शनिवार को इलाज के दौरान मौत हो गई।
32 वर्षीय स्वामी फ्लोरोसिस की समस्या के समाधान के लिए कई दिनों से संघर्ष कर रहा था। अंशाल स्वामी के निधन से स्थानीय व जिले के लोगों में मातम छा गया है।
ఫ్లోరైడ్ సమస్యపై పోరాడిన వ్యక్తి ఇకలేరు, మృతిపై కేటీఆర్ విచారం
హైదరాబాద్ : నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలం శివన్నగూడెంకు చెందిన స్కెలెటిన్ ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి శనివారం కన్నుమూశారు.
ఎంతో కాలంగా జిల్లాలోని ఫ్లోరోసిస్ భూతంపై పోరాటం చేస్తుండటమే కాకుండా మనోధైర్యంతో చాలా మందికి ప్రేరణగా నిలిచిన స్వామి మరణంపై మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
భగవంతుడు స్వామి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నట్లుగా ట్వీట్ చేశారు. అంశాల స్వామి కుటుంబ సభ్యులకు మంత్రి కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
విచారకరమైన సంఘటన ఏమిటంటే ఓ దాత ఇచ్చిన ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్ నుంచి స్వామి కిందపడిపోయారు. గాయపడిన స్వామి చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశాడు.
32సంవత్సరాల స్వామి ఫ్లోరోసిస్ సమస్య పరిష్కారం కోసం చాలా రోజులుగా పోరాటం చేశారు. అంశాల స్వామి మృతిపై స్థానికులు, జిల్లా ప్రజలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. (ఏజెన్సీలు)