వైభవంగా భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణం, తరలివచ్చిన భక్తజనం

हैदराबाद: बुधवार को श्रीराम नवमी के संदर्भ में भद्राचल में श्री सीताराम का कल्याणोत्सव भव्य रूप से संपन्न हुआ। तेलंगाना सरकार की ओर से मुख्य सचिव शांति कुमारी ने कल्याण के अवसर पर श्रीसीतारामचंद्र स्वामी को रेशम के कपड़े और अक्षत भेंट किये।

तिरु कल्याणम ब्रह्मोत्सवम के अवसर पर, पुजारियों ने बुधवार तड़के मंदिर के द्वार खोले और भगवान राम की सुप्रभात सेवा की। उसके बाद, ध्रुव मूर्ति के लिए तिरुवराधना, आरगिम्पु, मंगल शासन, अभिषेक और फिर कल्याण का प्रदर्शन किया गया। बाद में, कल्याणम की मूर्तियों को पालकी पर रखा गया और मंगल वाद्ययंत्रों के संगीत के बीच मिथिला मैदान में कल्याणम मंडपम में ले गये।

హైదరాబాద్ : శ్రీరామ నవమి భద్రాచల క్షేత్రంలో బుధవారం సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. కళ్యాణం సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారలకు ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.

తిరు కళ్యాణం బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం తెల్లవారు జామునే ఆలయ ద్వారాలను తెరిచి అర్చకులు రామయ్యకు సుప్రభాత సేవ జరిపారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళ శాసనం, అభిషేకం ఆ తర్వాత ధ్రువ మూర్తులకు కళ్యాణం నిర్వహించారు. తర్వాత కళ్యాణం మూర్తులను పల్లకీలో ఉంచి మంగళ వాయిద్యాల మధ్య మిథిలా మైదానం లోని కళ్యాణం మండపానికి వేంచేపు చేశారు.

రజత సింహాసనంపై శ్రీ సీతారామ చంద్ర స్వాములను ఆసీనులను చేశారు. తిరువారాధన, విశ్వక్సేన పూజ, పుణ్యహా వచనం నిర్వహించి మండప శుద్ధి చేశారు. ‘యుంజానహః ప్రథమం’ అనే మంత్రాని పఠిస్తూ వేద పండితులు ప్రజా సంపతర్థ్యం ‘శ్రీయం ఉద్వాః హిష్షే’ అన్న సంకల్పంతో స్వామి వారికి ఎదురుగా సీతమ్మను కూర్చో బెట్టి కన్యావరణలు జరిపారు. మోక్ష బంధం, ప్రతిసర బంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోపవీత ధారణ గావించారు.

వధూవరుల వంశ గోత్రాలకు సంబంధించి ప్రవరలు వినిపించారు. అనంతరం ఆశీర్వచనం, పాద ప్రక్షాళన, పుష్పాదక స్నానం జరిపి వర పూజ కార్యక్రం జరిపారు. కళ్యాణం సందర్భంగా సంప్రదాయబద్ధంగా భక్త రామదాసు చేయించిన పచ్చల పతకం, చింతాకు పతకం, కలికితు రాయి, రామ మాడ తదితర ఆభరణాలను రామయ్యకు, సీతమ్మకు, లక్ష్మణ స్వామికి ధరింప జేశారు. అర్చక స్వాములు స్వామి వారికి నూతన వస్త్రాలను అలంకరించారు.

అభిజిత్‌ లగ్నం సమయంలో శ్రీ సీతారాముల ఉత్సవ మూర్తుల శిరసుపై జీలకర్ర బెల్లం ఉంచి.. అనంతరం భక్త రామదాసు చేయించిన మంగళ సూత్రాలతో సూత్ర ధారణ, తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. కళ్యాణం వేడుకలో వేలాది మంది భక్తులు వీక్షించి పరవశించి పోయారు. కళ్యాణం జరిగిన మిథిలా మైదానంతో ఆలయ పరిసరాలన్నీ రామ నామ స్మరణతో మార్మోగాయి.

కళ్యా ణోత్సవంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టీస్ పీఎస్‌ నరసింహా, హైకోర్ట్ జడ్జి భీమపాక నగేష్రా రామయ్య కళ్యాణాన్ని వీక్షించారు. కల్యాణ వేడుక సందర్భంగా మిథిలా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం పట్టాభిషేక కార్యక్రమం జరుగనున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X