हैदराबाद/सूर्यापेट: सब-इंस्पेटकर पुली वेंकटेश्वरलू ने सरपंच चुनाव लड़ने के लिए अपनी मर्ज़ी से अपने पद से इस्तीफा दे दिया। सब-इंस्पेटकर ने 5 महीने की सर्विस बाकी रहते हुए VRS से इस्तीफा दे दिया। सब-इंस्पेटकर वेंकटेश्वरलू अपने गांव की सेवा करने के मकसद से कोडाद मंडल के गुडीबांडा गांव से चुनाव लड़ने के लिए तैयार हैं।
సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉద్యోగానికి రాజీనామా చేసిన ఎస్ఐ
సూర్యాపేట : సర్పంచ్ ఎన్నికల్లో పోటీ కోసం స్వచ్ఛంద పదవి విరమణ చేసిన ఎస్ఐ పులి వెంకటేశ్వర్లు. ఇంకా 5 నెలలు సర్వీస్ ఉండగానే వీఆర్ఎస్ రాజీనామా చేసిన ఎస్ఐ. పుట్టిన ఊరికి సేవ చేయడమే లక్ష్యంగా కోదాడ మండలం గుడిబండ గ్రామం నుండి పోటీకి సిద్ధమైన ఎస్ఐ వెంకటేశ్వర్లు.
మరోవైపు తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. గురువారం మొదలైన నామినేషన్ల స్వీకరణ ఇవాళ సాయంత్రం 5 గంటలతో ముగిసింది. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 31 జిల్లాల్లో 189 మండలాల్లో 4236 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు.
ఇది కూడ చదవండి–
డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజున మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులు ప్రచారంపై ఫోకస్ పెట్టారు. ఓటర్లను తమ వైపు ఆకర్శించేలా హామీలు ఇచ్చేందుకు ప్రథ్యర్థులతో పోటీ పడుతున్నారు.
రేపటి నుంచి రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్లు స్వీకరించనున్నారు. రెండో విడతలో నామినేషన్ల స్వీకరణకు డిసెంబర్ 2 వరకు తుది గడువు విధించారు. డిసెంబర్ 3వ తేదీన నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 6న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అదే రోజున అభ్యర్థుల తుది జాబితా ప్రకటించి వారికి ఎన్నికల గుర్తును కేటాయించనున్నారు. వచ్చే నెల 14న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితం ప్రకటిస్తారు.
